davos tour
-
బాబు ముఠా.. బాగా దోచుకో పంచుకో..!
-
నేలవిడిచిన సాము ఆపేది ఎప్పుడు?
చంద్రబాబు పాలనలో కాలేజీ స్థాయిలో సామా జిక శాస్త్రాల చదువులు అటక ఎక్కాయి. ఆ తర్వాత ఎవ్వరూ వాటి వైపు తిరిగి చూడలేదు. ఆ చదువుల పట్ల అశ్రద్ధ కారణంగానే ఇప్పటికీ రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది అనేది ఏపీ ప్రజలకు సాకల్యంగా స్పష్టం కాలేదు. తెలంగాణ విషయం అలా కాదు, ఇక్కడి కొరతను అధిగమించి మరీ ఉద్యమానికి ముందు ఒక దశాబ్దం పాటు వారు తమ చరిత్ర–సంస్కృతిని పునర్నిర్మించారు. అయితే ఇక్కడ అది లేదు. యూపీఏ–2 పాలన చివరిలో (2009–14) ‘విభజన’ లక్ష్యంగా తెలంగాణ అప్రమత్తం అయినప్పుడు, అక్కడ జరి గిన ‘హోం వర్క్’ వంటిదే ఇక్కడ కూడా జరిగి ఉంటే, ప్రతి అంశంలోనూ మన ‘ప్లానింగ్’లో ఆ స్పష్టత మొదటి నుంచి కనిపించేది. అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వ విధానాల్లో మార్పు ఉండేది కాదు. కేంద్రం విభజన నిర్ణయం ఏ కారణంతో తీసుకున్నా విస్తృత ప్రయోజనాల దృష్టితో సూక్ష్మ ప్రణాళికల వైపు మన నడక సాగి ఉండేది. అదే కనుక జరిగిఉంటే, ఇప్పుడు కురచ దృష్టితో కొందరు మాట్లాడుతున్న–‘సంక్షేమం’ వేరు ‘అభివృద్ధి’ వేరు అనే విపరీత పరిస్థితి మనకు వచ్చేది కాదు. ప్రధానిగా డా‘‘ మన్మోహన్ సింగ్ కాలంలో పెద్ద ఎత్తున చలామణిలో ఉండిన –‘ఇంక్లూజివ్ గ్రోత్’ (సమష్టి వృద్ధి) పదం ఎన్డీఏ తొలినాళ్లలోనే నిశ్శబ్దంగా అదృశ్యం అయింది. ఇటీవల ‘జాతీయ ఉపాధి హామీ పథకం’లో పేదలు వేసవిలో చేసే పని దినాలు–వేతనాలు తరచూ జాతీయ స్థాయిలో చర్చకు గురికావడం, పార్లమెంట్లో ప్రతిపక్షాలు అందుకోసం ప్రభుత్వంపై పోరాటం చేయడం చూస్తున్నదే. అదే ఆంధ్ర ప్రదేశ్ విషయంలో అయితే, కనీసం రెండున్నర ఏళ్ళపాటు మన ప్రాధాన్యతలు మార్చిన ‘కోవిడ్’ సోయి కూడా మరిచి, ‘సంక్షేమం’ అవసరాన్ని ప్రశ్నించడం చూశాము. మనం ఏమిటో మన భాష చెబుతుంది అనడానికి ఇదో ఉదాహరణ. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిందని, ‘ప్రాంతం’ – ‘ప్రజల’ స్వభావంలో మార్పు ఎందుకు వస్తుంది? కేవలం ఒక మంత్రికి పరిపాలనలో కొత్త ‘టెక్నాలజీ’ తేవాలని ఉంటే చాలదు కదా. ఆ స్థాయిలో ఇక్కడి పరిస్థితుల(ఎకో సిస్టం)లో కూడా మార్పు తీసుకు రావాలి కదా? కానీ ఆ విషయం దావోస్‌లో మరెవరో మనకు చెప్పాల్సి వచ్చింది. ‘గూగుల్’ కంపెనీ దావోస్‌లో ఏర్పాటు చేసిన– ‘ఏఐ ఫర్గుడ్ షేపింగ్, ఏ స్మార్టర్ సస్టెయినబుల్ టుమారో’ సెషన్లో మన కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ–‘మా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని ఎంపిక చేయడానికి, వైద్య– ఆరోగ్య రంగంలో ఆరోగ్య రక్షణను ప్రజాస్వామ్యయుతం చేయడం కోసంమేము కృత్రిమ మేధ (ఏఐ)ను వాడాలి అనుకుంటున్నాము’ అన్నారు. ఆ సెషన్ సమన్వయకర్తగా ఉన్న రాజేష్ నంబియార్ ఇండియాలోని ‘డిజిటల్ డివైడ్’ (సాంకేతికత... అందుబాటులో ఉన్నవారికీ– లేనివారికీ మధ్య ఉన్న దూరం) ను దృష్టిలో ఉంచుకుని, అక్కడి ప్రజలకు స్మార్ట్ ఫోన్లు ఉండాలి, అందులో మళ్ళీ ‘ఫైవ్–జి’, ‘సిక్స్–జి’ అందుబాటులో ఉండాలి అన్నారు. ‘అయినా మంత్రి ప్రతిపాదనపై మీరు ఏమంటారు?’ అని ఆయన ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ ప్రతినిధి అర్చనా వ్యాస్‌ను అడిగారు. దానికి ఆమె– ‘ముందుగా ప్రజలకు ‘మిషన్‌లెర్నింగ్’ తెలియాలి. దాన్ని వాడాలి అనుకుంటున్న రంగాలకు తగిన ‘డిజిటల్ కెపాసిటీ’ ఏమిటి అనేది ముఖ్యం. అయినా అటువంటి సేవలు వినియోగించుకునే వాయిస్ ఆఫ్ కమ్యూ నిటీ (ప్రజల ఉద్దేశం) ఏమిటో తెలుసు కోవడం అవసరం. ఈ నేపథ్యంలో లాస్ట్ మైల్లో ఉన్న వారికి ఈ పద్ధతిలో వైద్యం అందుతుందా? అనేది కీలకం. అయినా మన కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్కు ఈసాంకేతికత తెలియాలి కదా?’ అన్నారు. ప్రభుత్వాలు ఇటువంటి నేల విడిచి సాము చేసే రీతిలో ఆరోగ్యం వంటి అత్యవసర సేవలు అందిస్తాము అంటే, ప్రజలు తమ వైఖరిని (ప్రజా) ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి తెలపాలి. అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటివి ‘ప్రభుత్వం’ అని, అవి ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటాయి అనే పాత దృష్టి నుంచి ఇక బయటపడాలి. రాజకీయం అంతా మన చుట్టూనే జరుగుతున్నప్పుడు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఉన్నప్పటికీ, ‘సర్పంచ్ – ఎంపీపీ – జడ్పీటీసీ’ స్థాయిలో అభివృద్ధి పనులు గుర్తించి, అవి శాసన సభ్యుల ద్వారా నేరుగా ‘అసెంబ్లీ’లోకి వెళ్ళినప్పుడు ఈ నేలవిడిచిన సాము తరహా ‘ప్రెజెంటేషన్లు’ ఉండవు. విభజన తర్వాత పునాది నుంచి ప్రతిదీ కొత్తగా కట్టుకుంటున్న దశలోనే ఈ స్పృహ రాష్ట్రంలో మొదలుఅయితే, కాలక్రమంలో అదొక ‘స్టేట్ సైక్’ (రాజ్య మనఃస్థితి)గా స్థిరపడుతుంది.-జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
బాబుకు ఆ ఛాన్సే లేకుండా చేసిన రేవంత్!
ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల రికార్డు ఉన్న చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు దావోస్‌కు వెళ్లివచ్చారు. ఇంకోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి దావోస్ వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్ అనుభవం 15 నెలలు మాత్రమే. అయినా రేవంత్ తెలంగాణకు పెద్ద స్థాయిలో పెట్టుబడులు వచ్చేలా ఎలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు? ఇది ఆసక్తికరమైన పరిశీలన. 👉దావోస్ లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం అతి పెద్ద విజయం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 👉దావోస్తోనే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా చూస్తూంటారు. ఈ విషయాన్ని రేవంత్ అంగీకరించకపోయినా జనం దృష్టిలో వారిది బాగా దగ్గరి అనుబంధమే. ఓటుకు నోటు కేసు తర్వాత అది మరింత బలపడిందని భావిస్తూంటారు. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబుకు చెప్పే వెళ్లారు. తన తెలివితోపాటు కాలం కలిసి వచ్చి రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే చంద్రబాబును మరోసారి అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయ్యారు. అంతవరకు ఓకే. ఇప్పుడు వీరిద్దరి మాటలలో ఎవరిది ప్రామాణికంగా తీసుకోవాలి అనేది ప్రశ్న. రేవంత్ చెప్పినదాని ప్రకారం 25 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వాటిలో ఒక్క అమెజాన్ సంస్థే రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. అలాగే సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రూ.45 వేల కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రకు వచ్చిన రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోల్చితే తెలంగాణకు వచ్చింది తక్కువే కావచ్చు. కాని అసలు ఒక్క రూపాయి పెట్టుబడి రాని ఏపీతో కనుక పోల్చుకుంటే తెలంగాణ బాగానే సాధించినట్లు ఒప్పుకోవాలి. అందుకే రేవంత్ ధైర్యంగా.. ‘‘ఇది మా ప్రభుత్వ విజయం’’ అని చెప్పుకోగలిగారు. చంద్రబాబు మాత్రం దావోస్ ఒక మిథ్య అంటూ వేదాంతం చెప్పారు. తెలిసేట్టు చెప్పేది సిద్దాంతం.. తెలియకపోతేనే వేదాంతం అని ఒక కవి వ్యాక్యం. చంద్రబాబు పద్దతికి ఇది సరిపోతుంది. తనకు అనుకూలంగా ఉంటే అంతా బ్రహ్మాండం అని చెబుతారు. తను విఫలం అయితే వేదాంతంతో మాట్లాడి అంతా మిథ్య అని అంటారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మామూలుగా అయితే రేవంత్ మండి పడాలి. కాని ఎంతైనా గురువు కదా! దానిపై నేరుగా స్పందించలేదు. కాకపోతే పెట్టుబడులే కాకుండా.. ప్రపంచం పోకడ తెలుసుకోవడానికి కూడా దావోస్ వెళతామని రేవంత్ అన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్లను తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నవి కూడా ఉత్తుత్తి అగ్రిమెంట్లుగా కనిపించాలి. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ సదస్సుకు వెళ్లి సుమారు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకు వచ్చారు. అప్పుడు ఇదే తెలుగుదేశం దేశంలోని పారిశ్రామికవేత్తలతో అక్కడకు వెళ్లి పెట్టుబడులు తెచ్చామంటే సరిపోతుందా? అని ప్రశ్నించింది. ఈసారి చంద్రబాబు వెళ్లి ఆ మేరకైనా దేశీయ కంపెనీలతో కూడా అవగాహన కుదుర్చుకోలేకపోవడం పెద్ద వైఫల్యం. అందువల్లే రేవంత్ తమ ప్రగతిశీల విధానాల వల్లే పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నారు. అయితే.. చంద్రబాబుకు అలా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు,మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు లోకేష్‌లు కలిసి అభివృద్ది విధానాలు కాకుండా, రెడ్ బుక్ పాలసీని అమలు చేస్తుండడం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుండడంతో పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది. దానికి తోడు ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై తప్పుడు కేసు పెట్టడానికి ఒక మోసకారి నటిని ఉపయోగించుకున్న వైనం కూడా ఏపీకు అప్రతిష్ట తెచ్చిపెట్టింది. జిందాల్‌ను కూటమి ప్రభుత్వం తరిమేసిందని వార్తలు వచ్చాయి. ఆయన వెళ్లి మహారాష్ట్రలో రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. ఇటు.. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పాలి. అయితే తెలంగాణలో ఉండే మెఘా కంపెనీ రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి దావోస్‌లో ఒప్పందం అవడాన్ని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. దానికి రేవంత్ సమాధానం ఇస్తూ పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్కు అక్కసని ధ్వజమెత్తారు. అమీర్పేట్లోనే ఒప్పందం చేసుకోవాలా? అని మండిపడ్డారు. రిలయన్స్ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వంతో దావోస్‌లో అగ్రిమెంట్ చేసుకుంటే ఎందుకు తప్పు పట్టడం లేదు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై అపోహలు సృష్టించే యత్నం చేశారని, ఆర్థిక మూలాలు దెబ్బతీసే కుట్రలు జరిగాయని రేవంత్ అన్నారు. ఈ-ఫార్ములా రేస్ ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారని ఆయన బీఆర్ఎస్పై ఆరోపించారు. నిజానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ.. ఇలాంటి ఆరోపణలవల్లే దెబ్బతింటుందని రేవంత్ గుర్తించాలి. అచ్చం చంద్రబాబు భాషలో కాకుండా రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు ఉపయోగపడేలా మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు అక్కడ పెట్టుబడులకు అవకాశం ఉన్న విశాఖ, రాయలసీమ ప్రాంతాలను పక్కనబెట్టి మూడు పంటలు పండే, వరద ముంపు అవకాశం ఉన్న భూములలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఇందు కోసం వేల కోట్ల వ్యయం చేస్తున్నారు. దాని వల్ల కూడా ఏపీకి నష్టం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆచరణాత్మకంగా వ్యవహరించకుండా ఎంతసేపు ఏపీ పేద రాష్ట్రం అయిపోయిందని, ఐదేళ్లుగా ఏదో జరిగిపోయిందని అంతర్జాతీయంగా కూడా అసత్యాలు ప్రచారం చేస్తే పెట్టుబడిదారులు ఎందుకు ముందుకు వస్తారన్నది చాలా మంది ప్రశ్నగా ఉంది. ఇక.. ఏపీలో స్థానిక కంపెనీలు కూడా ఎవరూ పెట్టుబడుల ఎంఓయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరమే. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దావోస్ వెళ్లి లోకేష్‌ను కలిసి ఏపీలో గోల్ఫ్ సిటీ పెడతామని చెప్పిందని వార్తలు వచ్చాయి. అది కూడా కార్యరూపం దాల్చినట్లు కనిపించ లేదు. చంద్రబాబు, లోకేష్‌ల దావోస్ పర్యటనకు ముందు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వెళుతున్నారని వార్తలు రాసిన ఎల్లో జాకీ మీడియా, టూర్ ముగిశాక పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్ వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వెళ్లారని మాట మార్చేసింది. పైగా ఏపీ బ్రాండ్ అంటూ కహానీలు ప్రచారం చేసింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతుంటారు. కాని ఆయన కూడా ఏపీలో మైక్రోసాఫ్ట్ సెంటర్ నెలకొల్పడానికి హామీ ఇవ్వలేదట. పదేళ్ల క్రితమే చంద్రబాబు దాని గురించి మాట్లాడినా ఫలితం దక్కలేదు. చంద్రబాబు 1995 నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు దావోస్వెళ్లి వచ్చారు. ఆ సందర్భాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని చెప్పేవారు. కాని ఈసారి పెట్టుబడి రాకపోవడంతో అదంతా ‘మిథ్య’ అని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక విషయం చెప్పారు. మహారాష్ట్రకు ముంబై ఉండవచ్చు. కాని ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారట. మరి చంద్రబాబును చూసి పెట్టుబడులు ఎందుకు రాలేదు? ఫడ్నవీస్ రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా తీసుకు వెళ్లగలిగారు? ఏది ఏమైనా చంద్రబాబువి కబుర్లు అయితే.. ఫడ్నవీస్, రేవంత్ లు పెట్టుబడులు తెచ్చుకున్నారన్నమాట. అందని ద్రాక్ష పులుపు అన్నట్లు ఇతర రాష్ట్రాలు పెట్టుబడులు తెచ్చుకున్నా, దావోస్ వెళితే పరిశ్రమలు వస్తాయనుకోవడం మిథ్య అని చంద్రబాబు చెప్పుకుని తనను తాను మోసం చేసుకుంటూ.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారా?.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీకి ఒక్క రూపాయి ఉపయోగం లేదు బాబు, లోకేష్‌పై గొల్లపల్లి ఫైర్..
-
ఫిబ్రవరి 7న కీలక ప్రకటన: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్ : ఫిబ్రవరి 7న ఉద్యోగాల అంశంలో కీలక ప్రకటన ఉండబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో వచ్చిన పెట్టుబడులు ఈ ఏడాది వచ్చాయి. ఈ పెట్టుబడులను గ్రౌండ్ చేయడానికి ఇప్పటికే వర్క్ మొదలు పెట్టాం. రాబోయే ఏడాదిపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భవిషత్ అంతా ఏఐ, సైబర్ సెక్యూరిటీ పైనే .. దానిపై మేము ఫోకస్ పెట్టాం.గత బీఆర్ఎస్ ఐటీ పాలసీని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఐటీ పాలసీ తెస్తాం. ట్రిపుల్ ఆర్ చుట్టూ ఐటీ విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్ చుట్టూ ఐటీ అభివృద్ధి చేయబోతున్నాం. ఔట్ లుక్స్ మాల్స్ తరహాలో హైదరాబాద్ చుట్టూ మాల్స్ తెచ్చే యోచనలో సర్కార్ ఉంది.ఫిబ్రవరి 7వ ఉద్యోగాల అంశంలో కీలక ప్రకటన ఉండబోతోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన సర్కార్‌కు లేదు. మంత్రులు ఎవరూ అలక.. అసంతృప్తిలో లేరు. ఆర్థిక పరిస్థితి పై అందరికీ అవగాహన ఉంది. అవినీతి ఆరోపణలు కరెక్ట్ కాదు. ఖండిస్తున్నాం. గచ్చిబౌలి అవతార్ టవర్స్ తరహాలో హకింపేట్‌లో రాబోతున్నాయి. గత ప్రభుత్వం లెక్క భవనాలు చూపించి అభివృద్ధి అనం...అసలైన అభివృద్ధి ఏంటో రాబోయే ఐదేళ్లలో చూపిస్తాం. -
ఈ పెట్టుబడుల వల్ల వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి: Revanth Reddy
-
అందుకే పెట్టుబడులొచ్చాయ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దావోస్ పర్యటనలో తెలంగాణకు రూ.1.80 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపించాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలకు ధన్యవాదాలు తెలిపిన రేవంత్.. తమ ప్రభుత్వ కృషి వల్లే పెట్టుబడులు వచ్చాయన్నారు.‘‘ఈ పెట్టుబడులు ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తాం. పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రలు చేశారు. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు. కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారు. దావోస్ పర్యటనలో పెద్ద ఎత్తున పెట్టబడులు తీసుకొచ్చాం. ప్రణాళికతో వెళ్లాం కాబట్టే పెట్టుబడులొచ్చాయి’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.పెట్టుబడులు కార్యరూపం దాల్చినప్పుడే విజయం సాధించినట్లు: శ్రీధర్‌బాబు‘‘రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉన్నందునే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఎంఓయూల రూపంలో వచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చినప్పుడే మనం విజయం సాధించినట్లు. మూసీ నది పునరుజ్జీవనం అవసరం.. సింగపూర్ కంపెనీలతో చర్చలు జరిపాం..ఓ వైపు పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటు చేస్తూనే.. మరోవైపు నిరుద్యోగులకు స్కిల్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. గత సంవత్సరం 18 కంపెనీలతో ఎంఓయూ చేసుకుంటే.. 17కంపెనీల పనులు జరుగుతున్నాయి’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్.. రైతుబంధు అంటే కేసీఆరే గుర్తొస్తారు: కేటీఆర్ -
నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్‌ల దావోస్ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులేవీ తేకపోయినప్పటికీ ఒక రకంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే అంతటి ముఖ్యమైన కార్యక్రమాలనూ రాజకీయాలకు వేదికగా చేసుకోవచ్చునని, తమకు కావాల్సిన విధంగా ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చునని టీడీపీ ప్రభుత్వం నిరూపించింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా, ఏపీ బ్రాండ్ అంటూ కొత్త డైలాగుతో మీడియా మేనేజ్మెంట్లో తమకు తామే సాటి అని చెప్పుకోవడం హైలైట్!. దావోస్‌లో చంద్రబాబు, లోకేష్‌లు చాలా కష్టపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాత్రం లోకేషే భావి ముఖ్యమంత్రి అని పొగడటంలో బిజీ అయిపోయారు. ఏపీలో లోకేష్‌లాగా చదువుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడగడం ఒక హైలైట్ అయితే.. ఆ మిషతో భావి ఉప ముఖ్యమంత్రి ఆయనే అని జనసేన అధినేత పవన్‌కు సిగ్నల్స్ ఇవ్వడం ఇంకో హైలైట్. అయితే దావోస్ పర్యటనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఇచ్చిన కవరేజీ బహుశా బాబు, లోకేష్‌లను ఇరకాటంలో పెట్టేసి ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి రావడమే తరువాయి అన్నట్టుగా సాగింది ఈ మీడియా బ్యాండ్ బాజా. తీరా పర్యటన ముగిసిన తరువాత చూస్తే.. సున్నకు సున్నా.. హళ్లికి హళ్లి!! ప్రతిపక్షంలో ఉండగా పవన్.. 'దావోస్ వెళ్లి సాధించే పెట్టుబడులు ఏముంటాయి? సూటు,బూటు వేసుకువెళ్లి హడావుడి చేయడం తప్ప.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటే పారిశ్రామికవేత్తలే ఏపీకి వస్తారు’ అని చెప్పినట్లే.. ఇప్పుడు రెడ్‌బుక్ రాజ్యాంగం పుణ్యమా అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అనుకోవాలి. మహారాష్ట్రకు రూ. 15 లక్షల కోట్లు, తెలంగాణకు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడమేమిటి.. ఏపీకి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదరక పోవడం ఏమిటి? కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి బాబు, లోకేష్‌లు సాధించింది ఏమిటీ అంటే.. ‘‘ఏపీ బ్రాండ్’’ను ప్రచారం చేసి వచ్చారట! మరి.. చంద్రబాబు గతంలోనూ చాలాసార్లు దావోస్ వెళ్లివచ్చారే? అప్పట్లో ఏపీకి బ్రాండ్ ఇమేజీ రానట్టేనా? పైగా అప్పట్లో దావోస్ వెళ్లిన ప్రతిసారి అదిగో పెట్టుబడులు.. ఇదిగో ఇన్వెస్ట్మెంట్లు అని ఎల్లోమీడియా భలే బాకాలూదేదే? బాబు స్వయంగా తనను చూసి బోలెడన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు కదా? ఈసారి ఏమైంది? విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినప్పుడు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రచారం జరిగింది. అయితే.. వీటిల్లో అధికమొత్తం బోగస్ ఒప్పందాలన్న విమర్శ వచ్చింది. దారిన పోయేవారిని కూడా కంపెనీ సీఈవోలుగా ముస్తాబు చేసి ఫొటోలు దిగారు అని ససాక్ష్యంగా నిరూపితమైంది. ఇప్పుడు ఆ డ్రామా కూడా ఆడలేకపోయారు. చంద్రబాబు, లోకేష్‌లు కంపెనీలతో చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. మంచిదే. కానీ అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం గురించి, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి కంపెనీల్లో అనుమానాలు రేకెత్తించారా? ఈ అనుమానం ఎందుకొస్తుందంటే.. జగన్ మళ్లీ వస్తాడేమో అని పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు లోకేష్ చాలాసార్లు వ్యాఖ్యానించారు మరి!. అలాగే ‘జగన్ రాడు’ అని బాండ్ రాసి ఇమ్మంటున్నారని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతుంటారు. పారిశ్రామికవేత్తలు ఆ బాండ్లను నమ్మలేదా? జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్లు నమ్మారని అనుకోవాలా?.. ఇదీ చదవండి: దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్యమూడేళ్ల క్రితం జగన్ దావోస్ వెళ్లినప్పుడు రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఈ పారిశ్రామికవేత్తలే. విశాఖలో సదస్సు పెడితే అంబానీ, అదాని వంటివారూ వచ్చి జగన్‌ను అభినందించి వెళ్లారే? ఆ తరువాత అదానీ పెద్ద ఎత్తున సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో విద్యుత్ ఉత్తత్తి ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యారే? కూటమి అధికారంలోకి వచ్చాక అదానీ సిబ్బంది పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లాలో దాడులు చేశారే? ఆ విషయం ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయేందేమో!. ఇక లోకేష్ రెడ్ బుక్ ఉండనే ఉంది. ఏపీలో కూటమి అదికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ వారు వైసీపీ వారిపై చేసిన దాడులు, హింసాకాండ, అరాచకాల సమాచారం కూడా వారికి అందిందేమో! ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జగన్ టైమ్ లో ముందుకు వచ్చారు. కాని కూటమి అధికారంలోకి రావడంతోనే ఎవరో మోసకారి నటిని పట్టుకొచ్చి ఏపీలో పోలీసు అధికారులపైనే కాకుండా, జిందాల్ పై కూడా కేసుపెట్టి అరెస్టు చేసే ఆలోచనవరకు వెళ్లారే..సహజంగానే ఒక పారిశ్రామికవేత్తను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా హింసించే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా?. అందువల్లే పైకి కబుర్లు చెప్పినా, పెట్టుబడి కింద వందల, వేల కోట్లు వ్యయం చేయడానికి ఏపీకి రావడానికి భయపడ్డారేమో! దాని ఫలితంగానే ఏపీకి జిందాల్ గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. జిందాల్‌ను ఇబ్బందిపెట్టకపోయి ఉంటే ఆయన ఇక్కడ కొన్ని వేల కోట్లు అయినా పెట్టుబడి పెట్టడానికి సిద్దమై ఉండేవారేమో కదా? ఆ రకంగా ఏపీకి పెట్టుబడి రాకుండా ఒక పారిశ్రామికవేత్తను తరిమేశారన్న అపఖ్యాతిని చంద్రబాబు, లోకేష్‌లు మూటకట్టుకున్నట్లయింది కదా! ఎల్లో మీడియా ఇప్పటికి జగన్ పై తప్పుడు రాతలు రాస్తుంటుంది. ఆయన టైమ్‌లో పరిశ్రమలను తరిమేశారని పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేశాయి. కాని ఫలానా పరిశ్రమ వెళ్లిపోయిందని మాత్రం చెప్పలేదు. కేవలం వదంతులు సృష్టించి ప్రజలలో అనుమానాలు రేకిత్తించడంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా బాగా కృషి చేసింది. ఇదీ చదవండి: దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారుదావోస్లో యూరప్ లోని టీడీపీ అభిమానులుగా ఉన్న ఏపీ ప్రవాసులతో సమావేశం అయి కూడా రెడ్ బుక్, అందులో రాసుకున్నవారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ స్వయంగా చెప్పినట్లు వీడియోలు వచ్చాయి కదా!. కక్ష సాధింపు లేదంటూనే ఈ మాట చెప్పాక, ఎవరైనా పరిశ్రమలవారు భయపడకుండా ముందుకు వస్తారా? పోనీ వచ్చిన తెలుగువారిలో ఎవరైనా పరిశ్రమలు పెడతామని ఎందుకు ఆసక్తి చూపలేదు? అమరావతి ప్రపంచం అంతా ఆకర్షితమవుతోందని చెబుతారు కదా. అక్కడ కూడా ఏమైనా పెట్టుబడులు పెడతామని ఎవరూ చెప్పలేదే?. ఇప్పుడేమో దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయని అనడం మిథ్య అని బాబు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. అంతకాడికి కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి వెళ్లడం ఎందుకు! అక్కడేదో అద్భుతం జరగబోతోందని బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నట్లు? ఎవరూ ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఏపీ పరువును అంతర్జాతీయంగా నడిబజారులో తీసేసినట్లు కాలేదా! చంద్రబాబు మాటలు ఎప్పటికీ మిథ్య అన్నది మరోసారి తేలినట్లే కదా!!!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారు
మహారాణిపేట (విశాఖ): సీఎం చంద్రబాబు 1997 నుంచి దావోస్‌కు వెళ్తున్నారని, అక్కడ ఎప్పుడూ ఒప్పందాలు చేసుకోరని, చర్చించి వారి ఆసక్తిని బట్టి ఒప్పందాలు చేసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఓ కోర్టు కేసు నిమిత్తం సోమవారం విశాఖపట్నం వచ్చిన ఆయన కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీలో ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు, అధికారులను వదిలిపెట్టేదిలేదని స్పష్టంచేశారు. కాకినాడ పోర్టును అడ్డగోలుగా తుపాకీ పెట్టి లాక్కున్నారని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ పకడ్బందీగా చేయాల్సి ఉన్నందున ఒక్కొక్కటిగా చేస్తున్నామన్నారు. ఈ ఏడు నెలల కూటమి ప్రభుత్వ హయాంలో రూ.6,33,568 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 4,10,128 మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ తెలిపారు. స్థిరమైన ప్రభుత్వంవల్లే పెట్టుబడులు ఇక మహారాష్ట్ర, గుజరాత్‌లలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంవల్లే వారికి పెట్టుబడులు వస్తున్నాయని, స్థిరమైన ప్రభుత్వంవల్ల పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం నెలకొంటుందని చెప్పారు. జగన్ మళ్లీ రాడని పారిశ్రామికవేత్తలు గ్యారంటీ అడుగుతున్నారని మంత్రి లోకేశ్ చెప్పారు. దావోస్‌లో కాగ్నిజెంట్ ను వారి పెవిలియన్‌కు వెళ్లి కలిశానని, త్వరలోనే ఉత్తరాంధ్రకు మంచి న్యూస్ వస్తుందన్నారు. మరో 90 రోజుల్లో టీసీఎస్ వస్తుందని చెప్పారు. కాలేజీల యాజమాన్యాలకే విద్యాదీవెన నిధులు చెల్లిస్తామన్నారు. ఇక చంద్రబాబు ఏ బాధ్యతలిచ్చినా అహర్నశలు కష్టపడి పనిచేస్తానని, పార్టీకి చెడ్డపేరు మాత్రం తీసుకురానని లోకేశ్ చెప్పారు. -
రెడ్‌బుక్‌కు మా ఇంటి కుక్క కూడా భయపడదు: అంబటి
సాక్షి,గుంటూరు : ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విజనరీ, అనుభవం ఉన్న నేతగా తనను తాను గొప్పగా చిత్రీకరించుకునే చంద్రబాబు తాజాగా తన అబద్దాలతో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...నీతి అయోగ్ వెల్లడించిన లెక్కలను చూపుతూ తాజాగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను బట్టి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను అని అంగీకరించారు. దానికి కారణం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని సాకులు చూపుతుండటం ఆయన అసమర్థతకు నిదర్శనం. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలంటే, తాను ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం అయ్యిందని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు అనేక వాగ్ధానాలు చేశారు. వాటిని అమలు చేస్తానని చెప్పారు. ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు హామీలు అమలు చేయలేనివి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుగుణంగా లేదని చెప్పారు. అయినా కూడా నేను అన్నీ చేయగలను అని చంద్రబాబు ప్రజలను నమ్మించి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.రాష్ట్ర అప్పులపైనా అబద్దాలుఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని విష ప్రచారం చేశారు. ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బడ్జెట్ సందర్భంగా మీరే అధికారికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు రూ. 6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారు. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన అప్పుల కన్నా యాబై శాతం తక్కువగానే గత ప్రభుత్వం అప్పులు చేసింది అని తెట్టతెల్లం అయ్యింది. అంటే మీరు ఊహించిన దానికన్నా అప్పుల తక్కువగా ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ వాస్తవాలను ఒకవైపు అంగీకరిస్తూనే, మరోవైపు ఎన్నికలకు ముందు మేం ఊహించిన దానికన్నా ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది, దానికి వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అప్పులే కారణం అని ఎలా చెబుతారు? చంద్రబాబు తన మాటలను తానే ఖండించుకుంటున్నారు. ఇలా గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా?తన ప్రజంటేషన్ లోనూ తప్పుడు వాదనలుతాజాగా చంద్రబాబు నీతి అయోగ్ లెక్కల గురించి ఇచ్చిన ప్రజంటేషన్ లో మాట్లాడుతూ 2022-23లో సీఎం వైఎస్ జగన్ చేసిన పెట్టుబడి వ్యయం రూ.7,244 కోట్లు, అప్పులు రూ.67,985 కోట్లు అని చెప్పారు. ఇలా చేయడం అన్యాయం, అక్రమం అని చెప్పారు. 2024-25లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ఏడు నెలల్లో చేసిన అప్పులు రూ.73,685 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.8,894 కోట్లు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేసింది పోల్చుకుంటే ఎక్కడా పెద్ద తేడా కనిపించడం లేదు. మరి చంద్రబాబు దీనిని ఎలా సమర్థించుకుంటారు? చంద్రబాబు తన మీడియా సమావేశంలో ఇలా గతంలో జరిగిందంతా తప్పు, తాను చేస్తున్నవి మాత్రం అత్యుత్తమమైన ఒప్పు అని ఎటువంటి సిగ్గు లేకుండా చెబుతుంటే, ఈ మీడియా సమావేశంలో చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియా ప్రతినిధులు 'మీరు చాలా తక్కువగా చెబుతున్నారు, ఇంకా కొన్ని కలుపుకుంటే చాలా ఎక్కువ అప్పులు కనిపిస్తాయి' అంటూ చంద్రబాబు అబద్దాలకు తాళం వేస్తున్న పరిస్థితి చాలా దురదృష్టకరం. ఇటువంటి అబద్దాలను చెబుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగవేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం.చంద్రబాబు అసమర్థత వల్లే పెట్టుబడులు రాలేదుఇటీవల చంద్రబాబు దావోస్ పర్యటనకు తన కుమారుడు లోకేష్‌తో పాటు పలువురు అధికారులతో తీసుకుని ఎంతో ఆర్భాటంగా పర్యటనకు వెళ్లారు. ఇంకేముందీ రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందనే స్థాయిలో ఈ ప్రచారం జరిగింది. తీరా ఉత్తి చేతులతో చంద్రబాబు బృందం రాష్ట్రానికి తిరిగి వచ్చింది. ఒక్క ఎంఓయు లేదు, కోట్ల రూపాయల ప్రజాధనంను వ్యయం చేశారు. కనీసం దారి ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మాట్లాడుతూ దావోస్‌లో ఎంఓయులు అనేవి ఒక మిథ్య అంటూ చాలా గొప్పగా సెలవిచ్చారు. దావోస్ వెళ్ళినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ అని కొత్త అంశాన్ని వెల్లడించారు. అలాంటప్పుడు చంద్రబాబు, ఆయన బృందం ఎందుకు దావోస్ వెళ్ళారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా ఆయన కోటు వేసుకోలేని స్థితిలో ఉన్నారు. దానిని కూడా ఎల్లో మీడియా అంతగొప్ప చలిలో కూడా కోటు తొడుక్కోకుండా పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నించారంటూ దిగజారుడు రాతలు రాసింది. అనుకూలంగా ఉంటే ఒకరకంగా, వ్యతిరేకం అయితే మరోరకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. టక్కుటమార విద్యలకు చంద్రబాబు ప్రసిద్ది. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని భక్తితో పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ఎల్లో మీడియాకు తెలిసింది. 2014-19 హయాంలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ నిర్వహించారు. 328 ఒప్పందాల ద్వారా రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని డబ్బా కొట్టుకున్నారు. ఇందులో ఎన్ని ఒప్పందాలు ఆచరణలోకి వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పగలరా? సీఎంగా వైఎస్ జగన్ కూడా దావోస్‌కు వెళ్ళి రూ. 1.26 లక్షల కోట్ల రూపాయల ఎంఓయులపై సంతకాలు చేశారు. టెక్ మహేంద్ర సీఈఓ గుర్నానీ రూ.200 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఆదానీ గ్రూప్ రూ.60 వేల కోట్లతో పెట్టుబడులతో వస్తే, భూములు కేటాయించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే 37వేల కోట్ల పెట్టుబడులతో కర్నూలు జిల్లాలో గ్రీన్ కో కంపెనీ పనులు కూడా మా హయాంలోనే ప్రారంభమయ్యాయి. అరబిందో గ్రీన్ ఎనర్జీ 28వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చింది. ఇవ్వన్నీ జగన్ హాయంలో జరిగినవి.ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబుఒక పర్యాయం సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటనకు వెళ్ళలేకపోతే చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియా ఈనాడు పత్రిక 'ఓసోస్ దావోస్ మనకెందుకూ' 'పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళలేరా?' అంటూ ఒక కథనాలను ప్రచురిస్తూ, సీఎం దావోస్ ఎందుకు వెళ్ళలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పొరుగు రాష్ట్రాల సీఎంలు దావోస్ కు వెళ్ళి పెట్టుబడులు తెచ్చుకుంటుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు అంటూ తమ కథనాల్లో ప్రశ్నించారు. మరి నిత్యం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూ స్వామిభక్తిని చాటుకునే ఇదే ఎల్లో మీడియాకు చెందిన ఈనాడు పత్రికకు ఉత్తి చేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు బృందం అసమర్థత కనిపించడం లేదా? దావోస్ వెళ్లినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే సమంజసమే అన్నట్లుగా అనుకూల కథనాలను రాయడానికి ఏమాత్రం వెనకాడలేదు. అంటే వైఎస్ జగన్ దావోస్ వెళ్ళకపోతే పెట్టుబడులు అక్కరలేదా అని ప్రశ్నిస్తారు, అదే చంద్రబాబు తన అసమర్థత వల్ల పెట్టుబడులు తీసుకు రాలేకపోతే మరే ఫరవాలేదు అంటూ చంద్రబాబును సమర్థిస్తారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల సీఎంలు లక్షల కోట్లు పెట్టుబడులతో తమ రాష్ట్రాలకు వచ్చారు, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఎంఓయు కుదుర్చుకోకుండా వచ్చారు. ఇది ఎల్లోమీడియాకు కనిపించదు. ఇదీ ఎల్లో మీడియా, దానిని నిర్ధేశిస్తున్న చంద్రబాబు నిజస్వరూపం. నరంలేని నాలుకను ఎటువైపు అయినా తప్పి మాట్లాడటంలో ఎంతో ఘనుడు. ఈ విషయంలో చంద్రబాబు, ఆయనకు ప్రచారం చేసే ఎల్లో మీడియాను మించిన వారు లేరు.పగిలిన గ్లాస్ కథను ప్రచారంలోకి తెచ్చారుదావోస్ లో చంద్రబాబు ఎంత బాధ్యతతో వ్యవహరించారో ఆయనతో పాటు పర్యటనలో పాల్గొన్న ఒక అధికారి ఎల్లో మీడియాకు చెందిన ఒక చానెల్ కు తెలిపిన కథనాన్ని చాలా గొప్పగా ప్రసారం చేశారు. ఈ కథనంలో దావోస్ లో మైనస్ 12 డిగ్రీల చలిలో చంద్రబాబు బృందం నిద్రిస్తున్న గదుల్లో గ్లాస్ పగిలి, గడ్డకట్టించే చలిలో రాత్రంతా నిద్రలేకుండా గడిపారని, తెల్లవారుజామున వారు కొద్దిసేపు నిద్రించి ఆలస్యంగా లేచారట. సదరు అధికారులు తెల్లవారిన తరువాత లేచి చూస్తే చంద్రబాబు గదిలో లేరని, ఆయన గదిలో కూడా గ్లాస్ పగిలినా, గడ్డకట్టే చలిలో రాత్రంతా వణికిపోతూ నిద్ర లేకుండా గడిపి, ఉదయానే అలసటను కూడా పట్టించుకోకుండా దావోస్‌లోని మీటింగ్ హాల్‌కు వెళ్ళిపోయారట. అంతేకాదు మిగిలిన రాష్ట్రాల వారు ఇంకా తమ స్టాల్స్ ను ప్రారంభించక ముందే అందరికంటే ముందుగా చంద్రబాబు ఏపీ స్టాల్ కు వెళ్ళి, దానిని ప్రారంభించి, అప్పటికే అక్కడకు వచ్చిన కొందరు విదేశీ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతూ కనిపించారట. అక్కడ ఉన్న విదేశీ పారిశ్రామికవేత్తలు కోట్లు, రగ్గులు కప్పుకుని ఉంటే, చంద్రబాబు మాత్రం తాను రోజూ ధరించే అదే ఖద్దరు దుస్తులతో వారితో మాట్లాడుతూ కనిపించారట. అది చూసి అధికారులు సిగ్గుతో చంద్రబాబు వద్దకు వచ్చి ఇంత చలిలో మీరు ఎందుకు అందరికంటే తొందరగా వచ్చారని వారిలోని ఒక అధికారి ప్రశ్నిస్తే, మనం ప్రభుత్వ సొమ్ముతో, వారు చెల్లించిన పన్నులతో విమానాల్లో ఇక్కడకు వచ్చాం, అందరికంటే ముందుగా ఇక్కడకు వస్తే కనీసం ముందుగా వచ్చే పారిశ్రామికవేత్తలతో మాట్లాడవచ్చు, వారిలో ఒకరిద్దరు అయినా పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే బాధ్యతతో ఇక్కడకు వచ్చాను అని అన్నారట. అది విన్న సదరు అధికారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయని అత్యంత అద్భుతమైన ఒక కథను ప్రచారం చేశారు. ఈ మొత్తం కథను 2023 నవంబర్ 13వ తేదీన టీవీ5 అనే ఛానెలో లో ప్రజంటేటర్ మూర్తికి, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మధ్య జరిగిన సంభాషణ. ఇదే స్టోరీని అదే ఛానెల్ లో అదే ప్రజంటేటర్ మూర్తి 20.1.2025న తాజాగా జరిగినట్లు చెప్పడం చూస్తే వీరు ఎంతగా దిగజారిపోయారనేది ప్రజలకు అర్థమవుతుంది. ఈ కథనంను ప్రచురించి ఎల్లో మీడియా చానెల్ టీవీ5 మరెవరిదో కాదు ఇటీవలే చంద్రబాబు ఆశీస్సులతో టీటీడీ చైర్మన్ గా పదవిని దక్కించుకున్న బీఆర్ నాయుడిది. తనకు పదవి ఇచ్చినందుకు గానూ కృతజ్ఞతతో తన చానెల్ లో గత ఏడాది నవంబర్ లో సినీ నిర్మాత బండ్ల గణేష్ చెప్పిన కథను తాజాగా ఇప్పుడే జరిగింది అని చెప్పి, దానిని ప్రచారంలోకి తీసుకురావడం చూస్తే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? 2023న పగిలిన గ్లాసు కథను టీవీ5 మూర్తి 2025లో జరిగినట్లు చెప్పడం ఎంత దారుణం.చంద్రబాబు కుమారుడిగానే లోకేష్ కు గౌరవంవైయస్ఆర్ సీపీ హయాంలో మేం చేసుకున్న ఒప్పందాల్లో భాగంగానే ప్రాజెక్ట్ లను ఇప్పుడు ప్రారంభిస్తున్నారి మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్న మాటలను మీడియా నారా లోకేష్ వద్ద ప్రస్తావిస్తే అమర్ నాథ్ గురించి 'ఆ.. కోడిగుడ్డాయనా' అని ఎద్దేవా చేశాడు. లోకేష్ పెద్ద పప్పుసుద్ద కాదా? చంద్రబాబును చూసి ఆయనను గౌరవిస్తున్నారు. గుడివాడ అమర్ నాథ్ ఒక మాజీ మంత్రి కుమారుడు. ఆయన చనిపోయిన తరువాత కూడా అమర్ నాథ్ ప్రజల నుంచి గౌరవం పొందుతున్నాడు. కేవలం చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే లోకేష్ కు గౌరవం. ఇది నిజంగా లోకేష్ కు ఉన్న గౌరవం కాదు. లోకేష్ ఎర్ర బుక్కుకు నా కుక్క కూడా భయపడదు. ఎంతమందిని జైలులో అక్రమ కేసులతో జైలుకు పంపినా వైఎస్సార్సీపీ వెనుకంజ వేయదు.రిపబ్లిక్ డే ప్రసంగంలోనూ డొల్లతనంవైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ప్రసంగం ద్వారా 1.03 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు, 2.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. రూ.3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, అమ్మ ఒడి ద్వారా లక్షలాధి మంది తల్లులకు అండగా నిలుస్తామని ఇలా పలు కార్యక్రమాల గురించి చెప్పాం. వాటిని తరువాత అదే తరహాలో ఆచరణలో కూడా చూపాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం తమ తొలి రిపబ్లిక్ డే నాడు ప్రసంగంలో ఒక్క కార్యాచరణపైన కూడా నిర్ధిష్టమైన విషయాలను చెప్పలేకపోయింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపైనా, వైజగన్పైనా విమర్శలు చేయడంతోనే కాలం గడుపుతోంది. ఆంధ్రా బ్రాండ్ ను దావోస్ కు వెళ్లి పెంచామని సిగ్గులేకుండా చెబుతున్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి, లేనిపక్షంలో వైఎస్సాఆర్సీపీ నుంచి మిమ్మల్ని నిలదీస్తాం. సూపర్ సిక్స్ హామీల అమలు ఏదీ? తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు అమలు విస్మరించలేదా? తమ అసమర్థతను దాచుకుంటూ జగన్ గారి వల్ల అమలు చేయలేకపతున్నామని చెప్పడానికి తెగబడుతున్నారు.మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూలోకేష్ రెడ్ బుక్ చూసి పారిపోలేదు, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. విజయసాయిరెడ్డిని అప్రూవర్ గా మారమని చాలా వత్తిడి తెచ్చారని ఆయనే చెప్పారు. ఇలా వత్తిడి తెచ్చిన వారు ఎవరో ఆయనే చెప్పాలి. జగన్ మీద పెట్టిన ఏ కేసులోనూ ఆధారాలు లేవు, రాజకీయ కక్షతోనే ఆయనను జైలుకు పంపారు. లోకేష్ వేధింపులపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఎర్ర పుస్తకంలో పిచ్చిరాతలు రాసుకుని, అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్న దానికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు. వైజాగ్ లో జగన్ హయాంలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణాలను ఏం చేసుకోవాలో తెలియని అయోమయంలో లోకేష్ ఉన్నారు. జగన్ మించిన ప్రజాధరణ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో మరొకరు లేరు. రాజకీయపార్టీలు ఓటమి పాలైన తరువాత నాయకులు బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం వైఎస్ఆర్ సీపీకే పరిమితం కాదు. గతంలో చాలా మంది టీడీపీ నుంచి బయటకు వెళ్లారు. అంతమాత్రాన టీడీపీ అధికారంలోకి రాకుండా మిగిలిపోయిందా. పార్టీ నుంచి వెళ్ళడం అనేది వెళ్ళినవారి నైతికతకు సంబంధించిన విషయం. కష్టాలను తట్టుకునే శక్తి, నష్టాలను పూడ్చుకునే శక్తి కూడా వైఎస్సార్సీపీకి ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్రజలను మెప్పిస్తాం’అని అన్నారు. -
KSR Live Show: తప్పును అంగీకరించిన బాబు!.. తెలంగాణకు అన్యాయం
-
దావోస్ లో 4 రోజులు తండ్రీకొడుకులు చేసింది ఇదే !
-
బాబు కవరింగ్..!
-
దావోస్ వైఫల్యంపై సీఎం చంద్రబాబు బుకాయింపు
-
ప్లేటు ఫిరాయించిన చంద్రబాబు.. ‘దావోస్’ వైఫల్యంపై కవరింగ్
సాక్షి, విజయవాడ: దావోస్(Davos) వైఫల్యంపై సీఎం చంద్రబాబు(Chandrababu) బుకాయింపులకు దిగారు. దావోస్‌లో అసలు ఎంవోయూలు చేసుకోరంటూ వింత సమాధానం ఇచ్చారు. దావోస్ వెళితే పెట్టుబడులు (Investments) వస్తాయన్నది ఓ భ్రమ అంటూ చంద్రబాబు భాష్యం చెప్పారు. దావోస్‌లో అసలు ఎంవోయూలు చేసుకోవాల్సిన పనిలేదంటూ కవరింగ్ ఇచ్చారు. దావోస్ వెళ్లేముందు పెట్టుబడుల కోసమేనంటూ టీడీపీ, ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.గతంలో దావోస్‌నే ఏపీకి తెస్తానంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ అక్కడ ఆయన టీమ్ ఘోర వైఫల్యం చెందింది. దీంతో దావోస్‌లో ఏపీకి ఘోర అవమానమే మిగిలింది. జీరో ఎంవోయులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తిరిగొచ్చారు. తీవ్రంగా విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు ప్లేటు ఫిరాయించేశారు.‘‘దావోస్ అంటే ఒక మిత్ ఉంది. ఎన్ని ఎంవోయూలు చేశారు.. ఎంత డబ్బులొచ్చాయన్నది ఓ మిత్. ఇక్కడుండే ఎంవోయూలు అక్కడ చేసుకునే పనిలేదు. దావోస్ కేవలం నెట్ వర్క్ ప్లేస్ మాత్రమే. ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: దావోస్ తుస్.. పవన్ ఫుల్ ఖుష్!దావోస్ పర్యటనకు ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఎటువంటి పెట్టుబడుల ఒప్పందాలు లేకుండా ఏపీ బృందం రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. రిలయన్స్, ఎల్ అండ్ టీ, అమెజాన్, వర్థన్ లిథియం, జేఎస్‌డబ్ల్యూ, టాటా తదితర దిగ్గజ సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.తెలంగాణ ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని, నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని, 1995 నుంచి దావోస్‌కు వెళుతున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్‌గేట్స్‌తో సమావేశమై ఆ ఫోటోను ఎల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు, బిల్‌గేట్స్‌కు ఇప్పుడు సంబంధం లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ పత్రికలు బాకాలూదాయి.ఇదీ చదవండి: చంద్రబాబు దావోస్ పర్యటన.. దారి ఖర్చులు 'దండగ'! -
చంద్రబాబు దావోస్ పర్యటన ఫ్లాప్
-
చంద్రబాబు దావోస్ టూర్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి: అరుణ్‌కుమార్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దావోస్ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. దావోస్ పర్యటన పేరుతో చంద్రబాబు బృందం పెద్ద ఎత్తున ప్రజాధనంను దుర్వినియోగం చేసిందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మండిపడ్డారు. కనీసం ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకురాలేక పోయారని ఆక్షేపించారు.చంద్రబాబు, నారా లోకేష్ ప్రచార ఆర్భాటానికే దావోస్ పర్యటన పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ పర్యటనకు ఎంత ఖర్చు చేశారు? ఎందరు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు? ఎన్ని కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి? అన్న వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.దావోస్ పర్యటనకు కొత్త అర్థం:సీఎం దావోస్ పర్యటనపై ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నారు?. ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తల ముందు ఎలా ప్రజెంట్ చేశారోనని ఎదురు చూశారు. కానీ, తీరా దావోస్ నుంచి తిరిగి వచ్చిన సీఎం, మీడియా ముందు మాట్లాడింది చూసి ప్రజలు అవాక్కయ్యారు. దావోస్ అంటే కేవలం పెట్టబడులు కావు. నెట్ వర్కింగ్. పది మందిని కలవడం. అందరితో మాట్లాడటం. కాఫీలు తాగడం. అందరితో ఫోటోలు దిగి వాటిని మీడియాకు విడుదల చేయడం.. అంటూ చంద్రబాబు చెప్పడం నివ్వెర పరుస్తోంది. దావోస్ పర్యటన అంటే పెట్టుబడులు మాత్రమే కాదు, నెట్ వర్కింగ్ అని కొత్త అర్ధం చెబుతున్నారు. చంద్రబాబు వల్లనే..:14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అనేకసార్లు దావోస్ వెళ్లారు. ఈసారి పర్యటనలో ఒక్క పారిశ్రామికవేత్తతో అయినా ఎంఓయూ చేసుకోలేకపోయారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణాలో 2 లక్షల కోట్లు, మహారాష్ట్రలో ఏడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. కానీ, చంద్రబాబు బృందం మాత్రం ఒక్కటంటే ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేక పోయింది. కేవలం చంద్రబాబు సీఎంగా ఉండడం వల్లే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదా? దావోస్ పర్యటనపై చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. టీవీ ఛానల్స్‌కు కోట్ల రూపాయలు ఇచ్చారు. యథేచ్ఛగా ప్రజాధనంతో పెయిడ్ మార్కెటింగ్ చేసుకున్నారు. ఇంత చేసినా చంద్రబాబు పాలనపై పారిశ్రామికవేత్తలు విశ్వాసం వ్యక్తం చేయలేదు. ఒక్కరు కూడా ఏపీలో పెట్టుబడులకు సాహసించ లేదు.లోకేష్ ప్రమోషన్ కోసమే..:నారా లోకేష్‌ను రాజకీయ వారసుడుగా, కాబోయే సీఎంగా ప్రచారం చేసుకునేందుకే చంద్రబాబు దావోస్ పర్యటన. పారిశ్రామికవేత్తలతో 32 సమావేశాల్లో పాల్గొన్నామని చంద్రబాబు చెబుతుంటే, కాదు 38 మీటింగ్స్‌లో పాల్గొన్నట్లు లోకేష్ చెబుతున్నారు. అందులో 20 కంపెనీలు మనదేశానికి చెందినవే. మరో ఎనిమిది కంపెనీలు హైదరాబాద్‌కు చెందినవి. ఆయా కంపెనీలతో సమావేశాలకు దావోస్ దాకా వెళ్ళాలా?.జగన్ తమ హయాంలో ఒకేసారి దావోస్ వెళ్ళారు. ఏకంగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. గ్రీన్ ఎనర్జీ, ఇథైనల్ ఫ్యాక్టరీల వంటివి తీసుకువచ్చారు. అయినా ఆనాడు ఎల్లో మీడియా నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తూ, కథనాలు రాసింది. ఇప్పుడు అదే చంద్రబాబు, ఈసారి దావోస్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణలో పూర్తిగా విఫలం కావడంతో.. ఆ టూర్‌కు ఆయన పూర్తిగా కొత్త అర్ధం చెబుతున్నారు. తన మీద నమ్మకం లేక పారిశ్రామికవేత్తలు ముందుకు రాకపోయినా, దానిపై ప్రజల దృషి మరల్చేందుకు ఏవేవో కొత్త బాష్యాలు చెబుతున్నారు.చంద్రబాబు ఘోర వైఫల్యం:దావోస్‌లో చంద్రబాబు బృందం ఎవరితో తమ మొదటి సమావేశం నిర్వహించిందని చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. హైదరాబాద్ సోమాజీగూడలోని స్టోన్ క్రాఫ్ట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులతో మొదటి సమావేశం జరిగింది. 150 ఎకరాల భూమి ఇస్తే దానిలో గోల్ఫ్ కోర్ట్ పెడతామనే అంశంపై చర్చించారు. దీన్ని బట్టి చంద్రబాబు బృందం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.దావోస్‌లోని అంతర్జాతీయ వేదికపై నుంచి మన రాష్ట్రంలోని వనరులు, మానవ నైపుణ్యాలు, ప్రగతిదాయకమైన ఆర్థిక విధానాలు, ఉత్తమ పాలన, పారిశ్రామిక ప్రోత్సాహక పాలసీలను గురించి మాట్లాడి ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలి. కానీ దీనికి బదులుగా రాష్ట్ర ఐటీ మంత్రి దావోస్ వేదికపైన మాట్లాడుతూ మా భవిష్యత్ నేత నారా లోకేష్, ఆయన సీఎంగా రావాలని కోరుకుంటున్నాం అంటూ మాట్లాడటాన్ని పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యంతో విన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ప్రోత్సాహకాలను ఇస్తామో చెప్పకుండా తమను తాము పొగుడుకుంటూ మాట్లాడిన మాటలను చూసి అందరూ నవ్వుకున్నారు. చివరికి దావోస్ వేదికపై నుంచి జగన్‌గారిపై విమర్శలు చేశారు.దావోస్ పర్యటనలపై చంద్రబాబు గొప్పలు:రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఎటువంటి వ్యూహాత్మక ప్రణాళికలను అనుసరించాలని నిర్ధేశించాల్సిన ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కేవలం ప్రచారం ఎలా చేసుకోవాలి అనే దానిపైనే దృష్టి పెట్టింది. సీఎంగా దావోస్ వెళ్లిన ప్రతిసారి చంద్రబాబు ఒక కొత్త విషయాన్ని ప్రజలకు చెబుతుంటారు. ఆనాడు ఐటీకి తానే ఆరాధ్యుడిని అన్నారు. ఇప్పుడు ఎఐకి ప్రాముఖ్యతను కల్పించింది తానే అని చెప్పుకుంటున్నారు.తాను దావోస్ వెళ్తుండడం చూసి మిగిలిన సీఎంలు కూడా తనను అనుసరించారని, ఆనాటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ తనను చూసే దావోస్ వచ్చారని చెబుతున్నారు. అలాంటప్పుడు బెంగుళూరు ఐటీ హబ్‌గా దేశంలోనే ఒక ప్రత్యేకతను సాధించింది. బెంగుళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఎందుకు వెనుకంజలో ఉందో చంద్రబాబు చెప్పాలి. దావోస్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ అంటే పాకిస్తాన్‌లోని హైదరాబాదా అని అడుగుతుండేవారు అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక సీఎం హోదాలో ఉండి ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పి ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారా?ఎప్పుడూ ఆర్భాట ప్రకటనలే..వచ్చింది లేదు:2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దావోస్ పర్యటన సందర్భంగా 2016లో దావోస్‌లో 32 ఎంఓయులపై సంతకాలు చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. రూ.4.78 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి అందులో 95 శాతం ఎంఓయులన్నీ నకిలీవే. 2017లో మళ్ళీ దావోస్ వెళ్ళి ఏపీని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాను చేస్తానని చెప్పారు. వైజాగ్‌లో ఫిన్‌టెక్ వ్యాలీలో రూ.4,550 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. తీరా చూస్తే అది ఒక డెడ్ ప్రాజెక్ట్ అయింది. 2018లో దావోస్ వెళ్ళి అమరావతిని స్కిల్ హబ్ చేస్తానని చెప్పారు.కానీ, రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు పాల్పడ్డారు. 2017లో దావోస్ వెళ్ళి వచ్చి అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నాను, పారిశ్రామికవేత్తలు అమరావతికి రావాలని ఆహ్వానించారు. తీరా అవరావతి ల్యాండ్ పూలింగ్ స్కాంలో ఇరుక్కుపోయారు. 2019లో రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడారు. గతంలో తన ప్రభుత్వంలో ప్రతిఏటా ఏదో ఒక అంశంపై మాట్లాడి ప్రచారం చేసుకున్నారు.ఇప్పుడు 2024లో దావోస్‌కు వెళ్ళి వచ్చి బ్లూ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంథన వనరులు అని మాట్లాడుతున్నారు. మీ కంటే ముందే గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ 2019–24 వరకు బ్లూ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడటమే కాదు పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు కూడా తీసుకువచ్చారు. ఆదానీ గ్రూప్‌తో రూ.20 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రారంభించాం. రూ.37 వేల కోట్లతో గ్రీన్ కో సంస్థతోగ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇదే ప్రాజెక్ట్‌ను ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించి అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది అని కొనియాడారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. పనులు:వాటర్ వేస్, బ్లూ ఎకనామీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏపీకి సుదీర్ఘమైన సముద్రతీరం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టింది. రామాయపట్నంలో 19 బెర్త్‌లతో 138 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా లక్ష్యంగా పనులు చేశాం. ఇక మచిలీపట్నం పోర్ట్‌లో నాలుగు బెర్త్‌ల్లో మొదటి రెండు దశలు పూర్తి చేశాం. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్ట్, కాకినాడ గేడ్ వే పోర్ట్ పనులు కూడా మా హయాంలోనే చేశాం.ఇవి కాకుండా పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను ప్రారంభించాం. మొదటి దశలో ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను ప్రారంభించాం. జువ్వలదిన్నెలో 88 శాతం పనులు పూర్తిచేశాం. నిజాంపట్నంలో 70 శాతం పనులు పూర్తి చేశాం. రెండోదశలో ఊడుగంట్లపాలెం, పుడిమాడిక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప వంటి హార్బర్ల పనులు ప్రారంభించాం.మార్కెటింగ్ ఏజెంట్‌గా..:అన్ని పనులు చేసిన మేము, ఏనాడూ రాష్ట్రంలో బ్లూ ఎకానమీ గురించి మీలాగా ప్రచారం చేసుకోలేదు, ఆచరణలో చూపించాం. జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ద్వారా 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, వైఎస్సార్ జిల్లా చక్రాయిపాలెం వద్ద 400 మెగావాట్ల ప్రాజెక్ట్, సత్యాసాయి జిల్లా ముదిగుంపు వద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనకానపల్లి, రాప్తాడ్ లో 1050, బొమ్మనహళ్ళలో 850 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే. జగన్ చేసిన పనులను చెప్పుకునేందుకు మీరు దావోస్ వెళ్లారని అర్థం చేసుకోవాలి. గతంలో చంద్రబాబు తనను తాను సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేవారు. కానీ, ఇప్పుడు జగన్ ప్రగతిని ప్రచారం చేసే మార్కెటింగ్ ఏజెంట్‌గా మారిపోయారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. -
ఎల్లో మీడియా డబ్బా దావోస్ టూర్‌పై శివ శంకర్ కామెంట్స్
-
40 ఏళ్ల అనుభవం 40 కోట్లు కూడా తేలేదు...వరుదు కళ్యాణి షాకింగ్ రియాక్షన్
-
కోట్లలో ప్రజల సొమ్ము స్వాహా... బాబుపై గుడివాడ సంచలన వ్యాఖ్యలు
-
‘దావోస్‌నే ఇక్కడకు తెస్తామన్నారు.. ఏమైంది చంద్రబాబు?’
వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఏపీలో ఎక్కడ చూసినా మహిళలపై దురాగతాలు, గంజాయి, పేకాట క్లబ్‌ల పాలనే సాగుతోందన్నారు. మట్టి నుంచి ఇసుక వరకూ దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. ఇంతటి దుష్ట దుర్మార్గ పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదన్న రవీంద్రనాథ్‌రెడ్డి.. దావోస్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu) ఏమి తెచ్చాడని ప్రశ్నించారు. దావోస్(Davos)నే ఇక్కడకు తెస్తానంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. మైదుకూరు వ్యక్తికి కోటు వేసి చర్చలు జరపారని ఎద్దేవా చేశారు. వీళ్ల చేతగానితనానికి కూడా జగనే కారణమంటూ మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలందరికీ వీళ్ల చేతగానితనం, మోసం అర్థమవుతోందని, వైఎస్ జగన్ ఉంటే బాగుండేదని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.మత్స్యకార భరోసా, అమ్మ ఒడి వంటి అనేక పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం పంగనామాలు పెట్టిందని రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం తప్ప వీళ్లు చేసింది ఏమీ లేదని విమర్శించారు. వీళ్ల పరిపాలనకు దావోస్ పర్యటన నిదర్శమని, అక్కడ కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం తెలిసిపోయిందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినవి వచ్చే వరకూ తాము ప్రజాపోరాటాలు చేస్తామని రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. -
బాబు దావోస్ టూర్ పై వరుదు కళ్యాణి షాకింగ్ రియాక్షన్
-
బాబు బిల్డప్ సినబాబు ఎలివేషన్స్.. ఎల్లో మీడియా డబ్బా
-
చంద్రబాబు దావోస్ టూర్ పై నాగార్జున యాదవ్ కామెంట్స్
-
దావోస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్