
ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో వివరించామని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో వివరించామని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. పలు సంస్థల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామన్నారు. ప్రపంచస్థాయి వేదికలపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర ప్రగతిని ఫోకస్ చేశామన్నారు. ఐదు రోజుల సదస్సుకు సంబంధించి ఒక పెవిలియన్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
చదవండి: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి
గీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీలో దేశానికి ఏపీని ఆదర్శంగా మారుస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీ ఒక దిక్సూచి కాబోతుందన్నారు. 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నామని మంత్రి అమర్‌నాథ్ వెల్లడించారు.