హైదరాబాద్: ఇంతకుముందు మలేషియా, సింగపూర్ లాంటి విదేశాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 21 నుంచి 24 వరకు దావోస్ లో పర్యటించనున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో కూడా చంద్రబాబు వెంట పలువురు పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ఉండొచ్చని అంచనా.