సాక్షి, నగరి: పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు (Investments) వచ్చాయని.. చంద్రబాబు(Chandrababu) ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్‌బుక్ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్. పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే.. చంద్రబాబు అండ్ కో కట్టుకథలతో ఏపీకి వస్తోంది’’ అని రోజా దుయ్యబట్టారు.
‘‘వైఎస్ జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎంతో చక్కగా మెయింటెయిన్ చేశారు. మూడు పోర్టుల పనులు పరుగులు పెట్టించారు. చంద్రబాబు, లోకేష్ తీరుతో దావోస్‌లో ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. స్పెషల్ ఫ్లైట్లు, సూట్లు, బూట్ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. అంత పెద్ద వేదికపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు, కట్టుకథలు, పచ్చమీడియాతో ప్రజలను మభ్యపెట్టారు. దావోస్‌లోనూ అదే తరహా మభ్య పెట్టాలని చూశారు. కానీ, చంద్రబాబు మాటలు విని పెట్టుబడిదారులు పారిపోయారు’’ అని రోజా చెప్పారు.
‘‘వైఎస్ జగన్‌ను చూసి అదానీ, అంబానీ, జిందాల్ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారు. చంద్రబాబును, ఆయన పరిపాలన చూసి ఒక్క పారిశ్రామికవేత్త అయినా వచ్చారా?. మీ అరాచక రెడ్‌బుక్ పాలన చూసి పెట్టుబడుదారులు భయపడుతున్నారు. ఏపీ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తున్నారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్ర పరువు కాపాడాలని ఆ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా. పవన్‌ను చంద్రబాబు ఎందుకు దావోస్ తీసుకెళ్లలేదు?. పవన్ వస్తే లోకేష్ స్థాయి తగ్గిపోతుందని తీసుకెళ్లలేదా?.’’ అంటూ రోజా ప్రశ్నలు గుప్పించారు.
ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు.. హోదాకు తగ్గినట్టు మాట్లాడితే బాగుండేది!
Comments
Please login to add a commentAdd a comment