అందుకే పెట్టుబడులొచ్చాయ్‌: సీఎం రేవంత్‌ | Davos Tour: Cm Revanth Reddy Comments On Investments In Telangana | Sakshi
Sakshi News home page

అందుకే పెట్టుబడులొచ్చాయ్‌: సీఎం రేవంత్‌

Published Tue, Jan 28 2025 3:59 PM | Last Updated on Tue, Jan 28 2025 4:52 PM

Davos Tour: Cm Revanth Reddy Comments On Investments In Telangana

దావోస్‌ పర్యటనలో తెలంగాణకు రూ.1.80 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్‌: దావోస్‌ పర్యటనలో తెలంగాణకు రూ.1.80 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపించాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలకు ధన్యవాదాలు తెలిపిన రేవంత్‌.. తమ ప్రభుత్వ కృషి వల్లే పెట్టుబడులు వచ్చాయన్నారు.

‘‘ఈ పెట్టుబడులు ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ ఎకానమీగా అభివృద్ధి చేస్తాం. పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రలు చేశారు. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు. కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని  చాటుకున్నారు. దావోస్‌ పర్యటనలో పెద్ద ఎత్తున పెట్టబడులు తీసుకొచ్చాం. ప్రణాళికతో వెళ్లాం కాబట్టే పెట్టుబడులొచ్చాయి’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

పెట్టుబడులు కార్యరూపం దాల్చినప్పుడే విజయం సాధించినట్లు: శ్రీధర్‌బాబు
‘‘రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉన్నందునే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఎంఓయూల రూపంలో వచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చినప్పుడే మనం విజయం సాధించినట్లు. మూసీ నది పునరుజ్జీవనం అవసరం.. సింగపూర్ కంపెనీలతో చర్చలు జరిపాం..ఓ వైపు పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటు చేస్తూనే.. మరోవైపు నిరుద్యోగులకు స్కిల్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. గత సంవత్సరం 18 కంపెనీలతో ఎంఓయూ చేసుకుంటే.. 17కంపెనీల పనులు జరుగుతున్నాయి’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.

ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్‌.. రైతుబంధు అంటే కేసీఆరే గుర్తొస్తారు: కేటీఆర్‌
 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement