
బీజింగ్ : ప్రధాని నరేంద్ర మోదీ దావోస్ ప్రసంగంపై చైనా స్పందించింది. అగ్రదేశాల రక్షణాత్మక విధానాలకు వ్యతిరేకంగా మోదీ గళమెత్తారని ప్రశంసించింది. ప్రపంచీకరణను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచీలా వ్యవహరించడంలో ఇరు దేశాల ఆలోచన ఒకటేనని చైనా పేర్కొంది. రక్షణాత్మక వైఖరులను ఎండగట్టడం, ప్రపంచీకరణను ప్రోత్సహించడం వంటి ఉమ్మడి ఆలోచనా వైఖరులను భారత్, చైనా కలిగిఉన్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి హు చునింగ్ పేర్కొన్నారు.
గత ఏడాది దావోస్ ప్రసంగంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రక్షణాత్మక విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా హు గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ప్రపంచీకరణను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ సహా అన్ని దేశాలతో చైనా సమన్వయం పెంచుకుంటుందని స్పష్టం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు చైనా కట్టుబడి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment