ఉందిలే మంచి కాలం ముందుముందునా.. అందరూ సుఖపడాలి నందనందనా అంటూ ఎగురుతున్నాడు అప్పన్న.. ఏమైందిరా అని అడిగాడు సింహాచలం. అయినా సరే అప్పన్న నిలవలేకపోతున్నాడు.. మరి పర్లేదు ఈ నాల్రోజులు గడిస్తే నాకు నా కొడుక్కి.. నా కూతురికి ఉద్యోగాలు.. మేమంతా హాయిగా ఇంటిల్లిపాదీ ఉద్యోగాలు చేస్తాం.. అందరికీ ఉద్యోగాలు.. నాలుగు జీతాలు.. చేతినిండా డబ్బులు.. మంచి బ్రాండ్లు తాగొచ్చు అనుకుంటూ ఊగిపోతున్నాడు.
ఏందిరా అప్పిగా ఏంది నీ గొల్లు.. ఏదీ చెప్పకుండా ఎగురుతున్నావ్.. మెంటల్ గానీ ఎక్కిందేట్రా అన్నాడు సింహాచలం.. మరేట్లేదు.. ముందు ముందు అంతా అదిరిపోతోంది.. ఊళ్లన్నీ ఉద్యోగాలు.. నా కొడుక్కు ఒక మంచి జాబ్.. పాతికవేలు జీతం.. ఇక మా డబ్బులు దాచావుకొవడానికి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలి.. రెండు జీతాలు ఖర్చుపెట్టుకుని ఒక జీతం దాచుకోవాలి అనుకుంటూ ఊగుతున్నాడు. చీప్ లిక్కర్ తాగి పిచ్చిగా వాగుతున్నావా?.. ఎదవా.. అసలు ఏమైంది చెప్పురా అని అప్పన్న టెంకిమీద ఒకటిచ్చాడు సింహాచలం.. టెంకి మీద దెబ్బతో మామూలు పరిస్థితికి వచ్చిన అప్పన్న తుపుక్కున బీడీ పడేసి.. విషయం నీకు తెలీదా.. ఐతే రా చెబుతా అని రాయి మీద కూర్చున్నాడు.
మా వోడు.. కొడుకూ కలిపి ఇమానంలో ఎల్లారా.. ఇక పదిరోజుల్లో వచ్చేత్తారు.. రాగానే బోలెడు కంపెనీలు తెచ్చేస్తారు.. ఇక మనకు ఉద్యోగాల జాతరే అన్నాడు అప్పన్న.. ఒరేయ్ అడ్డదిడ్డంగా కూస్తే పీక కొస్తా అని సింహాచలం చెప్పడంతో.. లైన్లోకి వచ్చిన అప్పన్న.. మరేటి లేదురా.. పెదబాబు.. చినబాబు దావోస్ వెళ్లారు. వస్తూనే సంచుల్లో కంపెనీలు తేవడం.. ఉద్యోగాలు ఇవ్వడం.. ఇక ఏపీ ఎలిగిపోవడం.. తథ్యం అన్నాడు. ఇప్పటికే ఇంగ్లీష్ చానెల్లకు డబ్బులు కూడా ఇచ్చేశాం తెలుసా.. పబ్లిషిటీ కోసం అన్నాడు.. అప్పన్న.
ఒరేయ్ తాగుబోతోడా.. మీ బాబులు ఇది ఎన్నోసారి దావోస్ వెళ్లడం.. అని అడిగాడు సింహాచలం.. ఎయ్యే ఎన్నోసార్లు వెళ్ళాడు.. మరి ఏమైంది అన్నాడు సింహాచలం.. వెళ్ళాడు అప్పట్లో కర్రీ పాయింట్ పెట్టి.. పాల కూర పప్పు కూడా అందరికి వడ్డించాడు తెలుసా.. గర్వంగా అన్నాడు అప్పన్న. సరే.. కర్రీపాయింట్ కాకుండా ఇంకేం జరిగింది.. అడిగాడు సింహాచలం. ఏమోరా అన్నాడు అప్పన్న. సరే నేను చెబుతా విను.. అంటూ సింహాచలం మొదలెట్టాడు. అప్పట్లో బిల్ గేట్స్ తో ఫోటో దిగాడు.. మరి ఆంధ్రకు మైక్రోసాఫ్ట్ వచ్చిందా.. రాలేదు.. డెలాయిట్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. జనరల్ అట్లాంటిక్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. ఇంటర్నేషనల్ ఆస్పత్రి అన్నారు.. ఫోటోలు దిగారు.. వచ్చిందా.. రాలేదు.
అలాగే, గూగుల్, యాక్సెంజర్ డేటా సెంటర్లు అన్నారు.. వచ్చాయా.. రాలేదు.. పైగా సిస్టమ్స్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. మరి ఏమీ రానిదానికి అప్పట్లో ఏ స్థాయి బిల్డప్ ఇచ్చారు గుర్తుంది కదా.. అవునవును యాదొచ్చింది అన్నాడు అప్పన్న.. మరి అప్పుడు రాని కంపెనీలు ఇప్పుడు ఎలా వస్తాయిరా అప్పిగా.. మెల్లగా చురకేశాడు సింహాచలం.. అవునురోయి.. నేను హిస్టరీ మర్చిపోయాను.. అప్పుడు రానివి ఇప్పుడెలా వస్తాయి.. మారేలా అన్నాడు అప్పన్న. ఏమీ లేదు.. మళ్ళీ మన డబ్బుతో తండ్రీ కొడుకులు షికారు వెళ్లి వస్తారు అంతే అంటూ జ్ఞానోదయం చేశాడు సింహాచలం. అయితే మరెలా అన్నాడు బాధపడుతూ అప్పన్న.. ఏమీ లేదు మీ తండ్రీ కొడుకులు ఆటో నడుపుకోండి.. అని సలహా ఇచ్చి అక్కణ్ణుంచి కదిలాడు సింహాచలం.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment