సాక్షి, అమరావతి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ ఏపీ వైపు చూడని సంస్థలు ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.
‘‘రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వాస్తవాలు కనిపిస్తున్నా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ అవాస్తవాలు చెబుతున్నారు. సీఎం జగన్ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఫస్ట్‌ప్లేస్‌లో ఉంది’’ అని మంత్రి అన్నారు.
‘‘స్క్రిప్ట్ చంద్రబాబుది.. స్పీచ్ పవన్ కల్యాణ్‌ది. ఉపవాసాలు చేస్తే సీఎం కాలేరు. ప్రజల మన్ననలు పొందాలి. తాను ఓడిపోతానని పవన్‌కు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. చంద్రబాబు, పవన్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు’’ అని అమర్‌నాథ్ పేర్కొన్నారు.
‘‘పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు పేరు సార్ధకం చేసుకున్నాడు. ఒకే రోజు రెండు పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందుకే సీఎం జగన్ ఆయనకి దత్తపుత్రుడు అని పేరు పెట్టారు. హైదరాబాద్ పారిపోయింది చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లే. సింపతి కోసం పవన్ కల్యాణ్ ప్రాణహాని ఉందని ఆరోపణ చేస్తున్నాడు. చంద్రబాబు వల్లే పవన్‌కి ప్రాణ హాని ఉండొచ్చు’’ అని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్‌సీపీ గెలుపు నల్లేరుపై నడకే..
‘‘ముద్రగడ పద్మనాభంను చంపేద్దాం అనుకున్న వ్యక్తి చంద్రబాబు. బాబు బిస్కెట్ల కోసం కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. భూముల ధరలు కోసం కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదు. మా విశాఖలో కూడా ఎకరం కొంటె.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు. హైదరాబాద్ కాకుండా బయటకు వెళితే ధర ఎక్కడుంది. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడితే కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరు’’ అని మంత్రి అమర్‌నాథ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment