కియాలో ఉద్యోగం పొందిన వారి పేర్లు బయట పెట్టగలరా? | Vijayasai Reddy fires on Chandrababu | Sakshi
Sakshi News home page

కియాలో ఉద్యోగం పొందిన వారి పేర్లు బయట పెట్టగలరా?

Published Thu, Jan 31 2019 6:55 PM | Last Updated on Thu, Jan 31 2019 7:00 PM

Vijayasai Reddy fires on Chandrababu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కియా మోటార్స్‌లో ఉద్యోగం పొందిన వారి పేర్లు, వేతనం, చిరునామాలను సీఎం చంద్రబాబు నాయుడు బయట పెట్టగలరా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కియాకు రాయితీలపేరుతో చంద్రబాబు ముట్ట చెప్పిన నిధులు, భూముల విలువ లెక్కిస్తే లక్ష మంది నిరుద్యోగులకు రూ.10 లక్షల చొప్పున అందించవచ్చని మండిపడ్డారు.

'నాలుగేళ్లలో 2 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరూ చనిపోలేదని అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించడమేమిటి చంద్రబాబూ! కరువుతో 6 జిల్లాలు విలవిలలాడుతున్నాయి. మీరిలాగే కళ్లు మూసుకుంటే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటుంది. రైతుల ఉసురు తీసింది చాలు' అని విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోకపోతే అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అవుతుందన్న విషయాన్ని గురువారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి దృష్టికి తీసుకు వచ్చామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement