సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ తప్పుడు మాటలతో వార్తల్లో నిలిచే చంద్రబాబు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నా సైలెంట్‌గా ఉన్నారెందుకని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో.. ‘మాజీ పీఏతోపాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరువిప్పడం లేదు. నిప్పు కణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని ఐటీ శాఖను నిలదీయాలి. రెండ్రోజులుగా కిక్కురుమనకుండా, కియా లేచిపోతోందని ఫేక్ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు’అని పేర్కొన్నారు.
(చదవండి : శ్రీనివాస్ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు)
కాగా, చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాసరావు, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్ నివాసాల్లో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. శ్రీనివాస్‌కు చెందిన వాల్ లాకర్ నుంచి భూ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంకు లాకర్ నుంచి నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ దంపతుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ఐటీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు (శనివారం) సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
(చదవండి : ఏపీలోనే కియా)
Comments
Please login to add a commentAdd a comment