
కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన కియా ఇండియా..!
Kia Car Price Hike: భారత ఆటోమొబైల్ మార్కెట్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ నమ్మకమైన ఆటోమొబైల్ కంపెనీగా కియామోటార్స్ నిలుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ ఆనతి కాలంలో భారీగా ఆదరణను పొందింది కియా మోటార్స్. కాగా తాజాగా కొనుగోలు దారులకు షాక్ ఇస్తూ కార్ల ధరలను పెంచుతూ కియా ఇండియా నిర్ణయం తీసుకుంది.
కొద్ది రోజుల క్రితం పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కియా ఇండియా కూడా పలు కార్ల ధరలను పెంచింది. ఈ ధరల పెంపు ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తోందని కియా ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. భారత మార్కెట్లలోకి సెల్టోస్, సోనెట్, కార్నివాల్, కారెన్స్ వంటి కార్లను కియా ఇండియా ప్రవేశపెట్టింది. ధరల పెంపుతో కియా కారెన్స్, కియా సెల్టోస్, సోనెట్, కార్నివాల్ ధరలు భారీగా పెరగనున్నాయి.
సవరించిన ధరలు ఇలా ఉన్నాయి..!
- భారత మార్కెట్లలోకి కియా కారెన్స్ ఎంపీవీ వాహనాన్ని కియా ఇండియా లాంచ్ చేసింది. కియా కారెన్స్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తోంది. వీటిపై రూ.70,000 వరకు ధరలను కియా ఇండియా పెంచింది. ఆయా ట్రిమ్స్ మోడల్స్‌ను బట్టి ధరలు మారే అవకాశం ఉంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌తో కూడిన ప్రీమియం 7-సీటర్ కియా కారెన్స్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌తో కూడిన లగ్జరీ+ 7-సీటర్ ధర వరుసగా రూ. 40,000, రూ. 70,000 వరకు పెరిగింది.
- కియా సెల్టోస్ ధరలు కూడా రూ. 10,000 నుంచి రూ. 36,000 వరకు పెరిగాయి. కియా సెల్టోస్ GTX+ 1.4 మాన్యువల్ ధర రూ. 10,000 పెరిగింది. సెల్టోస్ HTX+ 1.5 మాన్యువల్, iMT ట్రిమ్స్ ధరలు రూ. 36,000 మేర పెరిగాయి. కియా సెల్టోస్ డీజిల్ మోడల్స్ ధరలు రూ. 20,000 నుంచి రూ. 34,000 వరకు పెరగనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
- కియా సోనెట్ పెట్రోల్, డీజిల్ మోడళ్ల ధరలలో రూ.10,000 నుంచి రూ.30,000 వరకు పెరిగాయి. పెట్రోల్ సోనెట్ హెచ్‌టిఎక్స్ 1.0 మోడల్ ధర గణనీయంగా రూ. 30,000 వరకు పెరిగింది. కియా సోనెట్ HTX 1.5 డీజిల్ వెర్షన్ ఇప్పుడు GTX 1.5 మాన్యువల్ వెర్షన్ కంటే రూ. 30,000 ఖరీదైనది.
- కియా కార్నివాల్ ధరలను రూ. 50,000 పెంచుతూ కియా ఇండియా నిర్ణయం తీసుకుంది. 6 సీట్ల ప్రిస్టీజ్ ఆటోమేటిక్ ధర రూ.29.49 లక్షలుగా ఉండగా.... ఇప్పుడు ఈ కారు రూ.29.99 లక్షలకు లభించనుంది.
చదవండి: హల్‌చల్ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్ నయా మోడల్..! ధర ఎంతంటే..?