భారతదేశంలో రోజురోజుకి ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. కియా మోటార్స్ కూడా దేశీయ మార్కెట్లో కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ తరుణంలో కంపెనీ తన డీజిల్ మాన్యువల్ వేరియంట్‌లను నిలివేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఇప్పటికే చాలా కంపెనీలు మార్కెట్లో డీజిల్ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసి ఆ స్థానంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఈ మార్గంలోనే కియా మోటార్స్ కూడా పయనించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ఔత్సాహికులు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో సంతృప్తి చెందాలి, ఇది ఆటోమేటెడ్ క్లచ్ ఆపరేషన్‌తో కూడిన మాన్యువల్ ట్రాన్స్‌మిషన్.
ఇప్పుడు సెల్టోస్ మాత్రమే 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లతో పాటు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ iMT ఆప్సన్ అందిస్తోంది. అయితే సొనెట్, కారెన్స్ డీజిల్ వేరియంట్స్ స్టాండర్డ్ మ్యాన్యువల్ & ఆటోమాటిక్‌లో లభిస్తున్నాయి.
డీజిల్ వేరియంట్స్‌లో ఐఎమ్‌టికి అనుకూలంగా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను నిలిపివేసే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమాటిక్ మధ్య బ్యాలెన్స్‌ని స్ట్రైక్ చేయడం ద్వారా డ్రైవర్‌ను క్లచింగ్ అండ్ డీ-క్లచింగ్‌ను ఆటోమేటిక్‌గా చూసుకుంటూ షిఫ్టింగ్ పార్ట్‌పై పూర్తి కంట్రోల్ కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. గేర్ లివర్ ఉపయోగించి రెండు పెడల్ డ్రైవింగ్‌కు అలవాటు పడటానికి కొంత సమయం పట్టవచ్చు. ఇది బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో అనుకున్నంత సులభంగా ఉండదు.
ఇటీవల చాలా మంది కస్టమర్లు క్లచ్‌లెస్ డ్రైవింగ్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనికోసం కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రస్తుతం బిఎస్6 ఉద్గార ప్రమాణాలు మరింత కఠినతరం అవుతున్నాయి, ఈ సమయంలో డీజిల్ కార్ల ధరలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ ఈ కార్ల డిస్‌కంటీన్యూ గురించి ఎటువంటి అధికారిక సమాచారం అందివ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment