సేవ్ స్కామ్స్ లక్ష్యంతో టీడీపీ దుష్ప్రచారం.. | YSRCP MP Mithun Reddy Slams TDP And Condemn News On Kia Motors in Parliament | Sakshi
Sakshi News home page

సేవ్ స్కామ్స్ లక్ష్యంతో టీడీపీ దుష్ప్రచారం..

Feb 6 2020 2:53 PM | Updated on Mar 22 2024 11:10 AM

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి మండిపడ్డారు. కియా పరిశ్రమ ఎక్కడికీ తరలిపోవడం లేదని.. తాను ఈరోజు ఉదయమే కియా ఎండీతో మాట్లాడానని గురువారం లోక్‌సభలో స్పష్టం చేశారు. కియా మోటార్స్‌ తరలింపుపై టీడీపీ ఎంపీలు లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ పేరుతో డమ్మీ కంపెనీ రూ. 30 కోట్ల పెట్టుబడికి.. రూ. వెయ్యి కోట్ల విలువైన భూములు ఇచ్చింది. దీని గురించి ప్రశ్నిస్తే.. కియా పరిశ్రమ తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement