‘మా ప్రభుత్వంపై నమ్మకంతో కియా మోటార్స్ మరొక పరిశ్రమను కూడా పెట్టబోతోంది. జూలై నెలలో మరో కియా ప్లాంట్ వస్తుంది. కియా మోటార్స్ తమిళనాడుకు వెళ్తోందని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ, కియా మోటార్స్‌తో మాట్లాడలేదని తమిళనాడు ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారు.