సాక్షి, హైదరాబాద్: కియా కార్ల పరిశ్రమను అనంతపురంలో పెట్టేందుకు హ్యుందాయ్ కంపెనీని ఒప్పించింది ప్రధాన మంత్రి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. కియా మోటార్స్‌ను తమిళనాడులో నెలకొల్పేందుకు ఆ సంస్థ సిద్ధమైన తరుణంలో.. అది ఏపీని ఎంపిక చేసుకునేలా ఆయన ఒత్తిడి తెచ్చారని చెప్పారు. కియా మోటార్స్‌ను ఏపీకి తానే తీసుకొచ్చానని సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.
ప్రజలు అదంతా మర్చిపోయారనుకుని.. చంద్రబాబు కష్టపడి కియాను ఏపీకి తెచ్చినట్టు కటింగులిస్తున్నారని విమర్శించారు. కియా కార్ల ఉత్పత్తికి ఇంకా ఏడాది పడుతుందని ఆ కంపెనీ వెబ్‌సైట్లో పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అనంతపురం కియా మోటార్స్‌లో మొదటి కారు తయారైందని చంద్రబాబు షో చేశారని విమర్శించారు. చెన్నై ప్లాంటు నుంచి తెచ్చిన ఇంజన్, విడిభాగాలతో అసెంబ్‌లు చేసిన కారును విడుదల చేశారని ఆరోపించారు.
కియా కార్ల పరిశ్రమ అనంతలో పెట్టాలని హ్యుండయ్ కంపెనీని ఒప్పించింది అప్పటి ప్రధానమంత్రి. తమిళనాడులో నెలకొల్పేందుకు సిద్ధమైన ఆ సంస్థ ఏపిని ఎంపిక చేసుకునేలా ఒత్తిడి తెచ్చారు. ప్రజలు ఇదంతా మర్చి పోయారనుకుని తాను ఎంతో కష్టపడి కార్ల కంపెనీని తీసుకొచ్చానని చంద్రబాబు కటింగులిస్తున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 30, 2019
కియా కార్ల ఉత్పత్తి ప్రారంభానికి ఇంకో ఏడాది పడుతుందని ఆ కంపెనీ వెబ్ సైట్లో పేర్కొంది. ఎలక్షన్ మైలేజి కోసం చంద్రబాబు హడావుడిగా మొదటి కారు తయారైందని షో చేశాడు. చెన్నై ప్లాంటు నుంచి తెచ్చిన ఇంజన్, విడిభాగాలతో అసెంబుల్ చేసిన కారును విడుదల చేశారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 30, 2019
Comments
Please login to add a commentAdd a comment