
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 నియంత్రణలో భాగంగా సహాయ చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్ధకి (ఏపీఎస్‌డిఎంఏ) కియా మోటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. విరాళానికి సంబంధించిన నిధులను ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, క్రయోజనిక్ ట్యాంకర్లు తదితర వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు.
నెఫ్ట్ ద్వారా బదిలీ చేసిన విరాళానికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ, సీఈవో కుక్ హ్యున్ షిమ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కియా మోటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీగల్, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ జ్యూడ్ లి, కియా ఇండియా ప్రిన్సిపల్ అడ్వైజర్ టి.సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment