తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విరాళం చెక్కులను అందజేస్తున్న గంగవరం పోర్టు చైర్మన్ డీవీఎస్ రాజు, పోర్టు సీఈవో, మాజీ డీజీపీ సాంబశివరావు
కరోనా వైరస్ నియంత్రణ కోసం తమ వంతు సాయంగా పలువురు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. గంగవరం పోర్టు తరఫున చైర్మన్ డీవీఎస్ రాజు, పోర్టు సీఈవో, మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు రూ.3 కోట్ల విరాళం అందజేశారు. అలాగే డీవీఎస్ రాజు గంగవరం పోర్టులో షేర్ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.16.25 కోట్ల ఇంటర్మ్ డివిడెండ్ చెక్‌ను కూడా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి అందజేశారు. ఇతర విరాళాల వివరాలు..
► దివీస్ లాబొరేటరీస్ రూ.5 కోట్లు.
► మిత్రా ఎనర్జీ ఎండీ విక్రమ్ కైలాష్ రూ.2 కోట్లు.
► హువెయ్ కంపెనీ వారు ఛారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ ద్వారా రూ.1 కోటి
► చీమకుర్తి రాసన్ గ్రానైట్స్ అధినేత కె.రవీంద్రారెడ్డి రూ.10 లక్షలు.
► కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సిజిటిన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కోటేశ్వరరావు రూ.5 లక్షలు
► చిత్తూరు జిల్లా ఐరాల మండలం పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు సీఎం సహాయనిధికి రూ.3.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.
► చిత్తూరు జిల్లా కుప్పంలోని బీసీఎన్ విద్యా సంస్థల చైర్మన్ బీసీ నాగరాజ్ రూ.2 లక్షలు
► తిరుపతికి చెందిన సీన్ హైటెక్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, సిబ్బంది తరఫున రూ.2 లక్షలు
► రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య తన వంతుగా రూ.1.54 లక్షలు
► కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కార్డియాలజిస్ట్ రాసంశెట్టి చంద్రశేఖర్ రూ.లక్ష, పిల్లల వైద్య నిపుణులు చీకటి ఉదయభాస్కరరావు రూ.లక్ష.
► విజయవాడలోని గరిమెళ్ళ లక్ష్మీ సమీర ఈస్ట్ లయన్స్ కంటి ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ బి.హనుమయ్య రూ.లక్ష.
► కృష్ణా జిల్లా కైకలూరు మండలం భుజ బలపట్నం గ్రామానికి చెందిన ఆక్వా రైతు ముదునూరి సీతారామరాజు రూ.లక్ష.
► కరోనా నివారణ చర్యల కోసం ఏపీ సీఎం సహాయ నిధికి హువెయ్ కంపెనీ వారు ఛారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం ప్రకటించారు. అందుకు సంబంధిన లేఖ శుక్రవారం సీఎం సహాయ నిధి విభాగానికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment