సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో దినసరి కూలీలు, వలస కూలీలు, నిరాశ్రయుల ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు కొన్ని వాణిజ్య సంస్థలు, సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తరపున సోమవారం సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యే వెంకటేష్ గౌడల ఆధ్వర్యంలో.. డీసీసీబీ ఛైర్ పర్సన్ మొగసాల రెడ్డమ్మ, మొగసాల కృష్ణమూర్తిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి క్యాంపు కార్యాలయంలో ఆందజేశారు. (నెగిటివ్ అని తేలిన కరోనా మళ్లీ ఎందుకు వస్తుందంటే...)
అంతేగాక శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వర్తక వాణిజ్య సంఘాల, ప్రజల తరపున రూ. 53, 3,343 రూపాలయలను పలాస ఎమ్మెల్యే సీదిరిర అప్పలరాజు ఆధ్వర్యంలో బడగల బాలచంద్రుడు, టి. సురేంద్ర, కృష్ణారెడ్డిలు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు చెక్కును అందించారు. ఇక గుంటూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంఘం వారు రూ. 25 లక్షలను సీఎం సహానిధికి కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా విరాళం ప్రకటింది. దీనికి సంబంధించిన చెక్కును డిప్యూటీ స్పికర్ కోనా రఘుపతి అధ్వర్యంలో అసోషీయేషన్ అధ్యక్షుడు వి. భాస్కరరావు సెక్రటరీ వి.వి రత్న గుప్త సీఎం జగన్‌కు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. (కష్టాల్లో ఉన్నా.. పథకాల్లో ముందుకే : వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment