లండన్ : కరోనాతో ప్రపంచం గడగడలాడిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఆయా దేశాల్లోని సెలబ్రిటీలు, ప్రజలు తమ వంతుగా విరాళాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో నివాసముంటున్న 99 ఏండ్ల రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ టామ్ మూర్ (99) కరోనా బాధితులకు వైద్యం కోసం ఏదైనా సహాయం చేయాలని భావించారు. అయితే మూర్‌కు రెండేండ్ల క్రితమే తుంటి ఎముక విరిగిపోవటంతో వికలాంగులు వాడే ఊతకర్ర సాయంతో మాత్రమే నడువగలరు. అది కూడా పది పదిహేను అగుడు దూరం మాత్రమే. కానీ ఆయన సంకల్పం ముందు అతనికున్న వైకల్యం కూడా చిన్నబోయింది. తన నివాసం చుట్టూ 25 మీటర్ల దూరం ఏర్పరచుకున్న గార్డెన్‌లో 100 సార్లు నడవాలని నిశ్చయించుకున్నారు. అలా నడవమే గాక తన మిత్రులు, సన్నిహితులకు జాతీయ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) కోసం తోచినంత విరాళం చేయాలని కోరాడు. ఏప్రిల్ నెలలోనే ఆయన తన 100వ జన్మదినం జరుపుకోనున్న టామ్ మూర్ పుట్టిన రోజు నాటికి 100 రౌండ్లు తిరుగుతానని చాలెంజ్ చేశారు.(కరోనా; త్వరలోనే సాధారణ స్థితికి)
తన గార్డెన్ ఏరియాలో రోజు నడుస్తూనే.. దాంతో వచ్చే విరాళాలను ఎన్‌హెచ్‌ఎస్‌కు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆయన చేస్తున్న పని అక్కడి స్థానిక మీడియా దృష్టిలో పడటంతో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. ప్రస్తుతం మూర్ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అంతేకాదు మూర్ చేస్తున్న పనిని మెచ్చి లక్షల మంది ఆయన ప్రారంభించిన నిధుల సేకరణకు విరాళాలు అందజేశారు. ఇప్పటివరకు మూర్‌కు 12 మిలియన్ పౌండ్లు( దాదాపు రూ. వంద కోట్లకు పైగా) విరాళాలు సమకూరాయి. మూర్‌కు ప్రమాదం జరిగినప్పుడు ఎన్‌హెచ్‌ఎస్ ఆయనకు ఎంతో సేవ చేసింది. ఆ సంస్థ చేసిన సేవలకు కృతజ్ఞతగా ఎన్‌హెచ్‌ఎస్‌కు ఏదో విధంగా సహాయపడాలనుకున్నారని మూర్ అల్లుడు కొలిన్ ఇన్‌గ్రామ్ తెలిపారు. ఇప్పుడు మూర్ 100వ జన్మదినం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుండడం విశేషం. (గూగుల్ ట్రెండింగ్స్‌లో మద్యం తయారీ)
Comments
Please login to add a commentAdd a comment