KIA Carens Three Row MPV Makes Global Debut in India - Sakshi
Sakshi News home page

Kia: వచ్చేసింది కియా నయా కార్‌..! కళ్లు చెదిరే లుక్స్‌తో, సూపర్‌ డూపర్‌ ఫీచర్స్‌తో..!

Published Thu, Dec 16 2021 5:04 PM | Last Updated on Fri, Dec 17 2021 8:55 AM

Kia Carens Three Row MPV Makes Global Debut In India - Sakshi

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్‌ రాబోయే సెవెన్-సీటర్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) 'కరెన్స్'ను గురువారం (డిసెంబర్‌ 16) ఆవిష్కరించింది. ఈ కారును రిక్రియేషనల్‌ వెహికిల్‌గా కియా పేర్కొంది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత భారతదేశ లైనప్‌లో కియాకు చెందిన నాల్గో వాహనంగా కరెన్స్‌ నిలవనుంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్‌లోని కియా ప్లాంట్‌లో తయారుకానుంది. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా కియా కరెన్స్‌ సప్లై కానున్నట్లు తెలుస్తోంది.   

డిజైన్‌ విషయానికి వస్తే..!
కియా సెల్టోస్ మాదిరిగా కాకుండా, కియా కరెన్స్ సొగసైన గ్రిల్ డిజైన్, ఎల్‌ఈడీ డే టైమ్‌ రన్నింగ్‌ ల్యాంప్స్‌తో రానుంది. బోల్డ్ డిజైన్, హై-టెక్ ఫీచర్లు, ఇండస్ట్రీ-లీడింగ్ సేఫ్టీ సిస్టమ్స్‌తో కొత్త సెగ్మెంట్‌, ఇండస్ట్రీ బెంచ్‌ మార్క్‌గా కియా కరెన్స్‌ నిలవనుంది. ఎంపీవీ వెనుక భాగంలో టీ-ఆకారంలో ర్యాప్‌ రౌండ్‌ ఎల్‌ఈడీ క్లస్టర్స్‌ను కల్గి ఉంది. అంతేకాకుండా చిసెల్డ్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ ఇన్సర్ట్‌లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ , ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కూడా ఉన్నాయి.

ఇంటీరియర్స్‌లో హై ఎండ్‌..!
కియా కరెన్స్‌ ఇంటీరియర్స్‌  హై ఎండ్‌ డిజైన్‌ను పొందనుంది. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే , ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరాలు అమర్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్‌, ఈఎస్‌ఈ, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ , రియర్ పార్కింగ్ సెన్సార్ల ద్వారా కారులో ప్రయాణించే వారికి మరింత భద్రతను కరెన్స్‌ అందిస్తోంది. 

ఇంజిన్ విషయానికి వస్తే..!
కియా కరెన్స్‌ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్,  టర్బో పెట్రోల్‌తో  7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును.



వీటికి గట్టిపోటీ..!
కియా మోటార్స్‌ ఆవిష్కరించిన కియా కరెన్స్‌ కొత్త వాహనం పలు దిగ్గజం కంపెనీల ఎస్‌యూవీలతో పోటీ పడనుంది. హ్యుందాయ్ అల్కాజార్, మారుతి ఎర్టిగా, ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా మరాజో, మహీంద్రా XUV700 వంటి వాటితో సెవెన్-సీటర్ కరెన్స్ పోటీపడే అవకాశం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే...కియా కరెన్స్‌ సెగ్మెంట్‌లో పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ వాహనం సిక్స్-సీటర్, సెవెన్-సీటర్ వేరియంట్లలో కూడా లభ్యం కానుంది.

బుకింగ్స్‌ ఎప్పుడంటే..!
కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రి-బుకింగ్స్‌ చేసుకునే అవకాశాన్ని కొనుగోలుదారులకు కల్పించింది. ఇప్పటికే బుకింగ్‌లను అంగీకరించడం ప్రారంభించింది. 2022 మొదటి త్రైమాసికంలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. కాగా  ఈ కారు ధరలను కంపెనీ ఇంకా రివీల్‌ చేయలేదు. 

చదవండి: టీఎంసీ బంపర్‌ ఆఫర్‌..!, 2025 వరకు రాయితీ వర్తింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement