
సాక్షి, అమరావతి: ఏపీని దక్షిణ కొరియాకు రెండవ రాజధానిగా భావించి పరిశ్రమలు స్థాపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కియా మోటార్స్ అనుబంధ సంస్థలను కోరారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఆ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం కొరియాకు సానుకూల పరిస్థితిని కల్పించేలా అన్ని మౌలిక సదుపాయాలతో కొరియన్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పెట్టుబడులకు దక్షిణ కొరియా ఎంచుకున్న అనంతపురం జిల్లా అటు బెంగళూరు విమానాశ్రయానికి, ఇటు కృష్ణపట్నం నౌకాశ్రయానికి అనుసంధానంగా ఉందని, కార్మిక అశాంతి లేని వాతావరణం తమ రాష్ట్రంలో ఉందని తెలిపారు. లొట్టే కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈవో వాన్గ్ కాగ్ జుతో కూడా బాబు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో 37 కంపెనీలతో ఏపీ ఆర్థికాభివృద్ధి సంస్థ లెటర్ ఇఫ్ ఇండెంట్ తీసుకోగా వాటి విలువ రూ.3వేల కోట్లని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment