2023 ఉమెన్స్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 'కియా నిరో' (Kia Niro) సొంతం చేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున 43 దేశాల నుండి 63 మంది మహిళా మోటరింగ్ జర్నలిస్టులు ఈ కారుకి ఓటు వేశారు. మొత్తం 59 వాహనాలను పరిశీలించిన తరువాత కేవలం ఆరు వాహనాలు మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నాయి.
- కియా నిరో - బెస్ట్ అర్బన్ కారు
- జీప్ అవెంజర్ - బెస్ట్ ఫ్యామిలీ ఎస్‌యువి
- సిట్రోయెన్ సి5ఎక్స్ - బెస్ట్ లార్జ్ కారు
- నిస్సాన్ ఎక్స్ ట్రైల్ - బెస్ట్ లార్జ్ ఎస్‌యువి
- ఆడి ఆర్ఎస్3 - బెస్ట్ పర్ఫామెన్స్ కారు
- ఫోర్డ్ రేంజర్ - బెస్ట్ 4×4
ఫైనల్‌కు చేరుకున్న ఆరు కార్లలో కియా నిరో ఒక ప్రాక్టికల్ లిటిల్ సిటీ కారు అని, ఇది మీకు కావలసినన్ని సరసమైన ప్యాకేజీలో లభిస్తుందని ఆటోకార్ ఇండియాకు చెందిన రేణుకా కిరిపలాని అన్నారు. ఈ కారు 2021 సియోల్ మోటార్ షోలో గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. ఇది టూ-టోన్ పెయింట్, బ్లాక్-అవుట్ వీల్ ఆర్చ్‌లు వంటి ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది.
(ఇదీ చదవండి: ఈవీల తయారీకి భారత్ చైనావైపు చూడాల్సిందేనా? జిటిఆర్ఐ రిపోర్ట్ ఏం చెబుతోందంటే!)
కియా నీరో హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో లభిస్తుంది. EV పవర్‌ట్రెయిన్‌తో ఇది ఒక ఛార్జ్‌తో 463 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది, అయితే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ 65 కిమీ పరిధిని అందిస్తుంది.
సేఫ్టీ, డ్రైవింగ్, కంపర్టబుల్, టెక్నాలజీ, కెపాసిటీ వంటి వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని విజేతలుగా ప్రకటించడం జరిగింది. విజేతలుగా నిలిచిన అన్ని కార్లు 2022వ సంవత్సరంలో విడుదలయ్యాయి. ఓటింగ్‌ను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లోని దాని కార్యాలయం నుండి గ్రాంట్ థోర్న్టన్ ధృవీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment