International Women's Day 2023
-
అమెరికాలో తెలుగు అమ్మాయిల ఆట.. విజేత నాష్విల్లే రైజర్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం- 2023 వేడుకల్లో భాగంగా టేనస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) తొలిసారి మహిళల షార్ట్ క్రికెట్ టోర్నీని ఏప్రిల్ 8, 9 తేదీల్లో విజయవంతంగా నిర్వహించింది. 9 జట్ల మధ్య పోరు ఈ కార్యక్రమంలో 9 మహిళా జట్లు పాల్గొనగా.. సుమారు 300 మంది ప్రేక్షకులు వారి ఆటను తిలకించారు. ఈ పోటీలను ఆటా రీజినల్ కో-ఆర్డినేటర్లు క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండతో సహా ఆటా నాష్విల్ టీమ్ సభ్యులు భరద్వాజ్ సామల, సాయి వర్ధన్ రెడ్డి బోడా, అనూష వంగాల, ఆనంద్ రామ్‌కుమార్, దిగ్విజయ్ వంగల, ప్రశాంతి రాచకొండ, వంశీ కొరిపెల్లి, రాకేష్ బెక్కం, వాలంటీర్లు నిర్వహించారు. రామకృష్ణారెడ్డి ఆల (ఆటా కార్యదర్శి) , కిషోర్‌రెడ్డి గూడూరు (బీఓటీ సభ్యుడు), సుశీల్ చందా (విద్యాకమిటీ చైర్) , నరేందర్‌రెడ్డి నూకల ( ప్రాంతీయ సలహాదారుడు) నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. విజేత ఎవరంటే ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నాష్విల్లే రైజర్స్ నిలిచింది. పవర్ గర్ల్స్ రన్నరప్, TNMM రెండో రన్నరప్గాన నిలిచాయి. విజేతలకు ఆటా ట్రోఫీలను అందించింది. అదనంగా, మహిళల అభిరుచి, క్రీడ పట్ల నిబద్ధతను ప్రోత్సహించడానికి ప్రతి జట్టు సభ్యురాలికి పార్టిసిపెంట్ మెడల్స్ అందజేశారు. ఆటా నాష్విల్ బృందం ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సమాజానికి సేవ చేయడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన ఇండియా బజార్, చాయ్ సమోసా రెస్టారెంట్‌కు ఆటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. వాళ్ల వల్లే ఇదంతా: డుప్లెసిస్ -
Kia Niro: మగువల మనసు దోచిన కారు.. ఇదే!
2023 ఉమెన్స్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 'కియా నిరో' (Kia Niro) సొంతం చేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున 43 దేశాల నుండి 63 మంది మహిళా మోటరింగ్ జర్నలిస్టులు ఈ కారుకి ఓటు వేశారు. మొత్తం 59 వాహనాలను పరిశీలించిన తరువాత కేవలం ఆరు వాహనాలు మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నాయి. కియా నిరో - బెస్ట్ అర్బన్ కారు జీప్ అవెంజర్ - బెస్ట్ ఫ్యామిలీ ఎస్యువి సిట్రోయెన్ సి5ఎక్స్ - బెస్ట్ లార్జ్ కారు నిస్సాన్ ఎక్స్ ట్రైల్ - బెస్ట్ లార్జ్ ఎస్యువి ఆడి ఆర్ఎస్3 - బెస్ట్ పర్ఫామెన్స్ కారు ఫోర్డ్ రేంజర్ - బెస్ట్ 4×4 ఫైనల్‌కు చేరుకున్న ఆరు కార్లలో కియా నిరో ఒక ప్రాక్టికల్ లిటిల్ సిటీ కారు అని, ఇది మీకు కావలసినన్ని సరసమైన ప్యాకేజీలో లభిస్తుందని ఆటోకార్ ఇండియాకు చెందిన రేణుకా కిరిపలాని అన్నారు. ఈ కారు 2021 సియోల్ మోటార్ షోలో గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. ఇది టూ-టోన్ పెయింట్, బ్లాక్-అవుట్ వీల్ ఆర్చ్‌లు వంటి ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది. (ఇదీ చదవండి: ఈవీల తయారీకి భారత్ చైనావైపు చూడాల్సిందేనా? జిటిఆర్ఐ రిపోర్ట్ ఏం చెబుతోందంటే!) కియా నీరో హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లతో లభిస్తుంది. EV పవర్‌ట్రెయిన్‌తో ఇది ఒక ఛార్జ్‌తో 463 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది, అయితే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ 65 కిమీ పరిధిని అందిస్తుంది. సేఫ్టీ, డ్రైవింగ్, కంపర్టబుల్, టెక్నాలజీ, కెపాసిటీ వంటి వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని విజేతలుగా ప్రకటించడం జరిగింది. విజేతలుగా నిలిచిన అన్ని కార్లు 2022వ సంవత్సరంలో విడుదలయ్యాయి. ఓటింగ్‌ను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లోని దాని కార్యాలయం నుండి గ్రాంట్ థోర్న్టన్ ధృవీకరించారు. -
నారీ శక్తికి సలాం: మోదీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో మహిళలు అమూల్య పాత్ర పోషిస్తున్నారంటూ కొనియాడారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. మన్ కీ బాత్‌లో క్రోడీకరించిన మహిళల స్ఫూర్తి గాథలను షేర్ చేశారు. నారీశక్తి ఫర్ న్యూ ఇండియా అంటూ హాష్‌ట్యాగ్ జత చేశారు. భారత మహిళల స్ఫూర్తిదాయకత్వంపై ‘హర్ స్టోరీ, మై స్టోరీ...’ శీర్షికతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాసిన వ్యాసాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు. ‘‘త్రిపుర నుంచి తిరిగొస్తూ వ్యాసం చదివా. ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. అతి సాధారణ స్థాయి నుంచి దేశ అత్యున్నత అధికార పీఠం దాకా ఎదిగిన ఒక స్ఫూర్తిదాయక మహిళ ప్రయాణాన్ని కళ్లకు కట్టిన ఆ వ్యాసాన్ని అందరూ చదవాలి’’ అని సూచించారు. అన్ని రంగాల్లోనూ దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ కూడా కొనియాడారు. -
International Womens Day: వాణిజ్య వాహనాల డ్రైవర్లుగా మహిళలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాహన తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ ఎంబ్రేస్ ఈక్విటీ పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు సమాన అవకాశాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అశోక్ లేలాండ్‌కు చెందిన ట్రైనింగ్ సెంటర్లో భారీ వాణిజ్య వాహనాలు, బస్‌లు నడపడంపై శిక్షణ పొందేందుకు 100 మంది మహిళలను న్యూఢిల్లీకి ఆహ్వానించింది. ‘వాస్తవానికి భారీ వాణిజ్య వాహనాల డ్రైవింగ్ అనేది పురుషుల బలమనే ప్రచారం ఉంది. ఎంబ్రేస్ ఈక్విటీ ద్వారా దీనిని ఛేదించాలనేది కంపెనీ ఆలోచన’ అని అశోక్ లేలాండ్ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం కోసం ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీనిలో భాగంగా 180 మంది మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ కల్పించింది. వీరిలో చాలా మంది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్లుగా నియామకం అందుకున్నారని అశోక్ లేలాండ్ వెల్లడించింది. -
International Womens Day: మహిళల కోసం హర్ సర్కిల్ ఎవిరీబాడీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హర్ సర్కిల్ ఎవిరీబాడీ పేరుతో ఓ ప్రాజెక్టును రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్పర్సన్ నీతా ఎం అంబానీ ఆవిష్కరించారు. మహిళల నిజ జీవిత కథలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా విభిన్న శరీర పరిమాణాలు, రూపాలను ప్రోత్సహించడం లక్ష్యంగా హర్ సర్కిల్ ఏడాదిపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఒక నిర్దిష్ట పరిమాణం, రంగు, ఆకృతిని కలిగి ఉండాలని ఆశించే అవాస్తవిక సౌందర్య ప్రమాణాలు, విష నిబంధనలను సవాలు చేసి విజేతలుగా నిలిచిన మహిళలను హర్ సర్కిల్ సామాజిక మాధ్యమం వేదికగా పరిచయం చేస్తారు. మహిళల కోసం భారత్‌లో అతిపెద్ద కంటెంట్, నెట్వర్కింగ్ వెబ్సైట్, యాప్ అయిన హర్ సర్కిల్‌ను 2021లో నీతా అంబానీ ప్రారంభించారు. 31 కోట్ల మందికి ఈ వేదిక చేరువైంది. వీరిలో 2.25 లక్షల మంది మహిళా వ్యాపారులు ఉన్నారు. -
నా జీవితంలో అత్యంత ప్రభావవంతులు వీరిద్దరే: మెగాస్టార్
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని మహిళలందరికీ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భార్య సురేఖ, అమ్మ అంజనా దేవితో దిగిన ఫోటోను షేర్ చేశారు. ట్విటర్లో మెగాస్టార్ రాస్తూ..' ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో తమ సరైన స్థానాన్ని పొందేందుకు పోరాడిన, పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలందరికీ వందనం. భవిష్యత్ తరాలకు మీరే ఆదర్శం. నా జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు వీరిద్దరే.' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. #HappyWomensDay to ALL the Women of the world! Saluting all the inspirational women who have fought & are fighting to claim their rightful space & place in the world. You are the Wind beneath the Wings of future generations! Here are the Two most influential women of My life 💐🙏 pic.twitter.com/JZhKHHAY1b — Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2023 -
నాడు కూలీ... నేడు ఓనర్! కాదేది అతివకు అసాధ్యం
ట్రాక్టర్ నడుపుతున్న బడియా సావిత్రిది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామం. మత్స్యకార కుటుంబానికి చెందిన సావిత్రి పెద్దగా చదువుకోలేదు. కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ కూలీగా పనిచేసేది. ఆడవాళ్లు కార్లు, బైక్‌లు, బస్సులు, రైళ్లు, విమానాలు నడుపుతున్నారు, ట్రాక్టర్ కూడా నడపవచ్చు అనుకుంది. డ్రైవింగ్ నేర్చుకుంది. తనకు సొంతంగా ట్రాక్టర్ ఉంటే బావుణ్నని కలగన్నది. స్వయంసహాయక బృందంలో సభ్యురాలు కావడంతో గత ఏడాది ఆమెకు ‘స్త్రీ నిధి’ నుంచి 80వేలు, గ్రామ సంఘం నుంచి లక్ష రూపాయల లోన్ వచ్చింది. ఆ డబ్బు డౌన్ పేమెంట్‌గా కట్టి వాయిదాల పద్ధతిౖపై ట్రాక్టర్ కొన్నది. ప్రస్తుతం తన ట్రాక్టర్‌ను తానే నడుపుతూ వ్యవసాయ పనులు, ఇతరత్రా పనులు చేసుకుంటోంది సావిత్రి. ►విజయవాడ నగరం, రామలింగేశ్వర నగర్ నివాసి రమాదేవి. . భర్త వ్యసనపరుడై మరణించాడు. ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి ఇంత కష్టమైన పనిని చేయడానికి ముందుకు వచ్చింది. ఎయిర్ బ్రేక్ సిస్టమ్ మెకానిక్‌గా పని చేస్తోంది. ►ఆటో నడుపుతున్న సరస్వతి సుమతిది నెల్లూరు నగరం. ఇంటర్ వరకు చదువుకున్న సుమతి పిల్లల పోషణ కోసం ఆటో నడుపుతూ, పిల్లలతో పాటు చదువును మళ్లీ మొదలు పెట్టి బీఎల్ పూర్తి చేసింది. ►స్వరూపరాణిది పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం, గంగన్నగూడెం. ఆడవాళ్లు వేదాలను ఎందుకు చదవకూడదనే ప్రశ్నకు తానే జవాబుగా నిలవాలనుకుంది. వేదాలు ఔపోశన పట్టి, బ్యాంకు మేనేజర్ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పౌరోహిత్యం చేస్తున్నారు. ►నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు సర్పంచ్ గొడ్డేటి వెంకటసుబ్బమ్మ... పొలం దుక్కి దున్నడంతోపాటు నిమ్మచెట్లకు తెగుళ్లు సోకితే స్ప్రేయర్‌తో క్రిమిసంహారక మందులను స్వయంగా పిచికారి చేస్తుంది. ►కాచరమైన కళమ్మ ఉండేది కుషాయిగూడ హైదరాబాద్‌లో.మొదట భవన నిర్మాణ కార్మికురాలిగా ఉన్న కళమ్మ 30 ఏళ్లుగా ఇండ్లకు, దేవాలయాలకు పెయింటింగ్ వేస్తోంది. ►మదనపల్లె పట్టణంలో రేణుక... డ్రైవింగ్ స్కూల్లో స్వయంగా తానే మహిళలకు డ్రైవింగ్ నేర్పిస్తోంది. ►యదళ్ళపల్లి ఆదిలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్లో ఉంటుంది. గత 5 ఏళ్లుగా మెకానిక్‌గా పనిచేస్తోంది. ►కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పెట్రోలు బంకులో పెట్రోలు పడుతున్న పగిడేల ఉమా మహేశ్వరి. చదవండి: Lalitha Manisha: తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో.. -
‘ఏపీలో ప్రతీ పథకంలోనూ మహిళలకే పెద్దపీట’
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. బుధవారం విజయవాడ ఏపీ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్రెడ్డి పైనా కొమ్మినేని ప్రశంసలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో చేస్తోంది. మహిళలకు సీఎం జగన్ అన్ని రంగాల్లో పెద్దపీట వేశారు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కల్పించారు. మార్కెట్ యార్డు పదవులను సైతం మహిళలకు కేటాయించడం చరిత్రలో ఇదే తొలిసారి అని కొమ్మినేని తెలిపారు. ఇక ఐఅండ్‌పీఆర్ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిజం వృత్తి అంటేనే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మహిళలు ఆ సవాళ్లను ఎదుర్కొని రాణించడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే.. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అధికప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ‘‘ప్రతీ పథకంలోనూ మహిళలకే పెద్దపీట వేస్తున్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిట ఇచ్చారు అని పేర్కొన్నారు. అలాగే.. మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం అని హామీ ఇచ్చారాయన. ఈ సందర్భంగా.. వీరిరువురు ప్రెస్ అకాడమీ తరపున పలువురు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. -
భారతదేశంలోని టాప్ 10 మహిళా స్వాతంత్ర్య సమరయోధులు (ఫోటోలు)
-
కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. సర్కార్‌కు వ్యతిరేకంగా, తెలంగాణ మహిళలకు సంఘీభావంగా దీక్షకు దిగిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా.. ట్యాంక్ బండ్‌పై బుధవారం ఆమె మౌన దీక్ష చేపట్టారు. అయితే.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అంతకు ముందు.. రాణి రుద్రమ దేవి విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించి దీక్షకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా.. ఆమె కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆమె ఏమన్నారంటే.. ‘‘తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల్లో నెంబర్ వన్. మహిళలను ఎత్తుకుపోవడంలో నెంబర్ వన్. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని కేసీఆర్ సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయి. కేసీఆర్‌కి మహిళల భద్రత పట్ల చిత్త శుద్ది లేదు. కేసీఆర్ దృష్టిలో మహిళలు ఓట్లు వేసే యంత్రాలు. మహిళ భద్రతకు చిన్న దొర కేటీఆర్ భరోసా యాప్ అని చెప్పాడు. ఎక్కడుంది భరోసా యాప్?. నేను ఫోన్ లో చెక్ చేశా.. ఎక్కడ కనపడలేదు యాప్. కేవలం మాటలకి మాత్రమే చిన్న దొర,పెద్ద దొర. తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్ మైన్ లా తయారయ్యింది. మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబ్ పేలుతుంది తెలియదు. .. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారామె. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వేల కేసులు నమోదు అయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది అత్యాచారాలకు పాల్పడ్డారు. చిన్న దొర కేటీఆర్ నియోజక వర్గంలో కూడా మైనర్లపై అత్యాచారం జరిగితే దిక్కు లేదు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితే దిక్కు లేదు. ‘ఆడపిల్లల పై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుతా’.. అని చెప్పిన కేసీఅర్ ఎంత మంది గుడ్లు పీకారు. స్వయంగా మంత్రుల బంధువులు రేపులు చేసినా దిక్కు లేదు. కేసీఆర్‌కి ఆడవాళ్లు అంటే వివక్ష. కేసీఆర్‌కి ఆడవాళ్లు అంటే కక్ష. దళిత మహిళలపై దాడులు చేస్తున్నారు. లాకప్ డెత్ లు చేస్తున్నారు. తెలంగాణలో ఓకే ఒక్క మహిళకు రక్షణ ఉంది. ఆమె కల్వకుంట్ల కవిత. మిగతా మహిళలంటే కేసీఆర్‌కి లెక్కే లేదు. ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ మీదనే అసభ్య పదజాలం వాడుతున్నారు. గవర్నర్‌కే గౌరవం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో మహిళా కమీషన్ ఒక డమ్మీ. స్వయంగా నేనే ఫిర్యాదు చేసినా దిక్కు లేదు. సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడితే నోటి కొచ్చినట్లు తిట్టారు నన్ను. ఇదేనా రాష్ట్రంలో మహిళకు ఉన్న గౌరవం. గవర్నర్, సాధారణ మహిళలకు, మహిళా నేతలకే కాదు.. ఐఏఎస్ మహిళా అధికారులకు గౌరవం లేదు. మహిళా ఉపాధ్యాయులకు గౌరవం లేదు. పోడు భూములకు పట్టాలు అడిగితే చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టారు. ఇది దిక్కుమాలిన పాలన. కేసీఆర్ బిడ్డకు తప్పితే ఎవరు సంతోషంగా లేరు. కేసీఆర్ బిడ్డ కవితకు ఏ లోటూ లేదు. ఓడిపోతే కవితకు ఎమ్మెల్సీ కట్టబెట్టి.. అదే మహిళలకు దక్కిన గౌరవం అని ప్రచారం చేసుకున్నారు. కవిత సిగ్గులేకుండా లిక్కర్ వ్యాపారం చేశారు. స్కాంలో చిక్కి.. మహిళల గౌరవాన్ని దెబ్బ తీశారు. రాష్ట్రంలో దిక్కు లేదు కానీ కవిత దేశంలో ధర్నా చేస్తారట!. అసలు రాష్ట్రంలో 33 శాతం ఎక్కడ అమలు అవుతుంది. ఇక్కడ నాలుగు శాతం కూడా అమలు కాలేదు. రెండు పర్యాయాలు కలిపి 10 సీట్లు కూడా మహిళలకు ఇవ్వలేదు. మహిళా మంత్రులకు దిక్కు లేదు. ఉన్న ఇద్దరు మంత్రులను డమ్మీలను చేశారు. అసలు మహిళల అభ్యున్నతికి ఒక్క పథకం లేదు. కేసీఆర్‌ది నియంత పాలన.. మహిళల పట్ల సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా మౌన దీక్షఅని ప్రకటించారామె. -
ఫిలిం మేకింగ్‌లోకి ‘మేడమ్స్’.. ప్రొడ్యుసర్స్‌గా రాణిస్తున్న నారీమణులు
ఒక సినిమాను నిర్మించాలంటే చాలా కష్టం. కేవలం డబ్బు పెడితే సరిపోదు..ఎంతో మందిని మేనేజ్ చేయాలి...ఎన్నో టెన్షన్స్ పడాలి. అందుకే సినిమా నిర్మాణ విషయంలో మహిళలు దూరంగా ఉండేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ప్రతి విభాగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ...నిర్మాతలుగా దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకొని ఫిలిం మేకింగ్(నిర్మాణం)లో రాణిస్తున్న ‘మేడమ్స్’ గురించి తెలుసుకుందాం. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు నిర్మించాడు. అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్...ప్రియాంక దత్. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో నెంబర్ వన్ లేడీ ప్రొడ్యూసర్స్ అనే చెప్పాలి. స్వప్న సినిమాస్ బ్యానర్ స్థాపించి భారీ చిత్రాలను నిర్మించటమే కాదు..బిగ్గెస్ట్ హిట్స్ కూడా అందుకున్నారు. డైరెక్టర్ నాగ్అశ్విన్ తో మహానటి నిర్మించిన ఈ లేడీ ప్రొడ్యూసర్స్...సేమ్ డైరెక్టర్ తో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 500 కోట్లు బడ్జెట్ కేటాయించారు. సమంత నటిస్తున్న మైధిలాజికల్ మూవీ శాకుంతలం...ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తన తండ్రి గుణశేఖర్ సినిమాలకు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది. రుద్రమదేవి సినిమాకి కూడా నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా చేసింది. నిన్నటి వరకు చిరంజీవి సినిమాలకు , క్యాస్టూమ్స్ డిజైనర్ గా ఉన్న మెగాస్టార్ డాటర్ సుస్మిత కొణిదెల కూడా ప్రొడ్యూసర్ గా మారింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షూట్ అవుట్ ఎట్ ఆలేర్ లాంటి వెబ్ సిరీస్ తో పాటు ..సేనాపతి, శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు నిర్మించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు డాటర్..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిస్టర్ ప్రసీద కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అడుగుపెట్టింది. ప్రసీద..ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీకి కో-ప్రొడ్యూసర్ గా వర్క్ చేసింది. అలాగే ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురు, దివ్య దీప్తి నిర్మాతగా మారి... హీరో కిరణ్ అబ్బవరంతో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ నిర్మించింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా నిర్మాణ రంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు. మరో నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ కూడా ప్రొడ్యూసర్స్ గా సినిమాలు నిర్మిస్తున్నారు. కేవలం సినిమాల మీద ఇంట్రెస్ట్ తో డైరెక్టర్ వెంకటేష్ మహా ను నమ్మి...ప్రొడ్యూసర్ గామారింది పరుచూరి విజయ ప్రవీణ. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా మారిన ఈమె వరుసగా సినిమాలను నిర్మిస్తోంది. ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు.. వీళ్లే కాదు..కొంతమంది హీరోయిన్స్ కూడా ప్రొడ్యూసర్స్ గా...కో ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. హీరోయిన్ చార్మి నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా సెటిలైపోయింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. హీరోయిన్ అవికా గోర్ పాప్ కార్న్ సినిమాని తనే సొంతంగా నిర్మించింది. -
తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో..
రాజ్‌భవన్‌లో.. సోమవారం, మార్చి 6న హైదరాబాద్ గవర్నర్ తమిళిసై కొంతమంది మహిళలకు సత్కారం చేశారు. అదే సందర్భంగా ఏర్పాటైన గాత్ర కచ్చేరిలో అందరి దృష్టి లలిత మనీషా మీద పడింది. అందుకు కారణం ఆమె డోలు వాద్యం పై విన్యాసం చేస్తూ ఉండటమే. తెలుగునాట నాదస్వరం వాయించే స్త్రీలు కొద్దిమందైనా ఉన్నారు. కాని డోలు వాయించే వారు అతి తక్కువ. రెండు రాష్ట్రాలకు కలిసి డోలు విద్వాంసురాలిగా ఇటీవల గుర్తింపు పొందుతున్నది 24 ఏళ్ల లలిత మనీషా. తెనాలి అమ్మాయి లలిత మనీషాది తెనాలి. వీరి తల్లి మస్తాన్‌బీ, తండ్రి షేక్ వెంకటేశ్వర సాహెబ్ నాదస్వర విద్వాంసులు. ఇద్దరూ వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మస్తాన్ బీ వంశంలో 300 వందల ఏళ్లుగా నాదస్వరం కొనసాగుతూ ఉంది. అయితే డోలు వాయించిన మహిళలు లేరు. మస్తాన్ బీకి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి నాగ భ్రమరాంబ గాత్ర విద్వాంసురాలిగా శిక్షణ తీసుకుంది. ఇప్పుడు చదువు నిమిత్తం అమెరికా వెళ్లింది. చిన్నమ్మాయి లలిత మనీషా డోలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపింది. ‘నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు వరుసకు వదిన అయ్యే ఒకామె డోలు నేర్చుకోవడానికి ప్రయత్నించింది. ఆమెకు రాలేదు. నేను నేర్చుకోవడానికి ప్రయత్నించాను. నాకు వచ్చేసింది. డోలు వాయిద్యానికి తాళంతో పాటు శక్తి కూడా కావాలి. నాలో అవి రెండూ గమనించి మా అమ్మా నాన్నలు ప్రోత్సహించారు’ అంటుంది మనీషా. కుంభకోణం వెళ్లి డోలు వాయిద్యాన్ని సాధన చేయాలంటే ఇక్కడ అనుకూలంగా లేదని తొమ్మిదో తరగతి డిస్కంటిన్యూ చేసి కుంభకోణంలో డోలు విద్వాంసుడు టి.ఆర్.సుబ్రహ్మణ్యం దగ్గర సంవత్సరం పాటు శిష్యరికం చేసింది లలిత మనీషా. గురువు ఇంట్లోనే ఉంటూ డోలు నేర్చుకుని వచ్చింది. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ కోర్సు, డిప్లమా కూడా పూర్తి చేసింది. డిగ్రీ ఉండాలి కనుక బీసీఏ చేసి డోలు వాయిద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంది. ఆ కోర్సు అన్నామలై యూనివర్సిటీ కింద చిదంబరంలో ఉంది. ‘అక్కడ మా బేచ్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉంటే నేనొక్కదాన్నే అమ్మాయిని. అందుకని నన్ను అందరూ బాగా చూసుకునేవారు. మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా డోలు వాద్యం మగవారిదే అని భావించడం వల్ల ఇప్పటి వరకూ ఒక్క ఆడపిల్ల కూడా ఆ కోర్సు చేయలేదు. దాంతో మొత్తం దేశంలోనే డోలు వాయిద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఏకైక అమ్మాయిగా నేను నిలిచాను’ అంటుంది మనీషా. నిజంగా ఇది తెలుగువారి గర్వకారణమే. మంగళవాయిద్యం డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. దక్షిణ భారతంలో శుభకార్యక్రమాలకు సన్నాయి మేళం తప్పనిసరి. అయితే కర్నాటక సంగీతంలో కూడా సన్నాయి, డోలు ప్రాశస్త్యం మెండుగా ఉంది. డోలు సహ వాయిద్యంగా ఉంటోంది. ‘గాత్ర కచ్చేరిలో గాని వయొలిన్, ఫ్లూట్ కచ్చేరిలో గాని మృదంగాన్ని సహ వాయిద్యంగా తీసుకుంటారు. డోలును కూడా తీసుకునేవారు ఉంటారు. కర్నాటక సంగీతంలో డోలు వాయిద్యకారిణిగా నేను గుర్తింపు పొందాలనుకుంటున్నాను. డోలు వాయించడానికి 108 రకాల తాళాలు ఉన్నాయి. ఉద్దండులు లోతుకు వెళితే ఇంకా వినూత్న తాళాలు వేస్తారు. నేను ఇప్పటి వరకూ 35 రకాల తాళాలు డోలు మీద వేయగలను. మా అమ్మా నాన్నలతో కలిసి అనేక కచ్చేరీలు చేస్తున్నాను. శ్రీశైలం, భద్రాచలం, హరిద్వార్, పూరీ, ద్వారకా, కాశీ పుణ్యక్షేత్రాలలో కచ్చేరీలు ఇచ్చాను. అలాగే తమిళులు డోలు, సన్నాయి కచ్చేరీలను ఇష్టపడతారు. వారి ఆహ్వానం మేరకు మదురై, తంజావూరు... ఇలా అనేక నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ఇంకా నేను చాలా సాధించాల్సి ఉంది’ అంది మనీషా. – ఇన్పుట్స్: బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
IWD 2023: అటు ఇటు అన్నింటా.. మగువా జగమంతా..! (ఫొటోలు)
-
స్ఫూర్తి గాథ: తండ్రి తపనను అర్థం చేసుకుని గెలిచిన బిడ్డలు
నిజామాబాద్ : ‘చేసేది చిన్న ఉద్యోగమైనా ఆ తండ్రి తీసుకున్న నిర్ణయాలు నేడు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఎవరి కాళ్ల మీద వాళ్లు నిల బడాలనే తపనకు తోడు చదువులో పిల్లలు రాణించడంతో ప్రభుత్వఉద్యోగాలకు ఆ ఇల్లు నిలయమైంది. ఇద్దరు కుమారులు సహా నలుగురు కుమార్తెల్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారంటే అందులో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతుందో.. పురు ష, స్త్రీ తేడా లేకుండా అందరినీ సమానంగా చదివించడంలో వారి కృషి, కష్టం అంతకు రెట్టింపు ఉంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆ తల్లిదండ్రుల కోరిక నెరవేర్చిన కుమార్తెల్లో ఒకరై న జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధ విజ యగాథ మహిళా దినోత్సవం సందర్భంగా కథనం. కుటుంబ నేపథ్యం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన రాజారాం, సరోజలకు ఇద్దరు కుమారులు డాక్టర్ శ్రీనివాస్ ప్ర సాద్ (బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్) శ్రీధర్(ఉపాధ్యాయుడు), నలుగురు కుమార్తెలు విజయలక్ష్మి(గృహిణి), డాక్టర్ లత (ప్రొఫెసర్), డాక్టర్ జయసుధ(డీపీఓ), ప్రవీణ (ఉపాధ్యా యురాలు). రాజారాం పోస్ట్‌మాస్టర్ ఉద్యోగం చేసు కుంటూ కుమారులు, కుమార్తెలు అన్న తేడా లేకుండా ఉన్నత చదువులు చదివించా రు. చదువులో వా రి సహకారం, ప్రోత్సాహంతోనే ప్రస్తుతం అందరూ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. మీ కాళ్ల మీద మీరే ని లబడాలని తరచూ గుర్తుచేస్తూనే పిల్లల లక్ష్యాల లో ఆ తండ్రి పాలుపంచుకున్నారు. 2010లో బిచ్కుంద కు చెందిన నాగనాథ్‌తో జయసుధ వివాహమైంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతూ.. రాజారాం, సరోజ దంపతుల ఐదో సంతానమైన డాక్టర్ జయసుధ చిన్ననాటి నుంచి చదువులో రాణించేవారు. ఐదోతరగతి వరకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో, నవోదయ విద్యాలయంలో 6 నుంచి ఇంటరీ్మడియట్ వరకు చదివారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువును కొనసాగించారు. చిన్నప్పటి నుంచే వసతిగృహాల్లో ఉంటూ ఉన్నత చదువులు పూర్తిచేశారు. మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైస్సెస్ పూర్తి చేసిన జయసుధ పదేళ్లపాటు హైదరాబాద్‌లోని వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేశారు. మొదటి ప్రయత్నంతోనే గ్రూప్–1లో విజయం వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం చే స్తున్నా.. ఎక్కడో ఏదో ఒక వెలితి. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో గ్రూ ప్స్‌కు సిద్ధమయ్యారు. అదేక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా కూడా ఉద్యోగం సాధించారు. 2015లో సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. మొదటి ప్రయత్నంలోనే 2017 లో గ్రూప్–1 సాధించారు. ఏడాది శిక్షణ తర్వా త జిల్లా పంచాయతీ అధికారిగా మొదటి పోస్టింగ్ నిజామాబాద్‌లోనే నియమితులయ్యారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వచ్ఛభారత్ మిషన్‌లో జాతీయస్థాయిలో మొదటిస్థానంలో జిల్లా కు అవార్డు దక్కింది. అలాగే సంసద్ ఆదర్శ గ్రా మ్ యోజనలో మొదటి 20 గ్రామాల్లో జిల్లా నుంచే 5 ఉత్తమ పంచాయతీలుగా ఎంపికై అవార్డులు పొందడం సంతోషానిచ్చింది. ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగు లు, సిబ్బంది సహకారంతో డీపీవోగా నాలుగేళ్లు ఎంతో సంతృప్తినిచ్చిందని జయసుధ పేర్కొన్నారు. -
T20 WC: మిథాలీ రాజ్, ధోని అంటే ఇష్టం.. పిజ్జా, బర్గర్ తినాలని ఉన్నా!
కంచెలు తెంచేశాం. హద్దులు చెరిపేశాం. ఆంక్షలు తుడిచేశాం. అవరోధాలు ఎదిరించాం. నేల, నింగి, నీరు, ఊరు... కొలువు, క్రీడ, కార్మిక వాడ... గనులు, ఓడలు, రోదసి యాత్రలు.. పాలనలో.. పరిపాలనలో.. ఆర్థిక శక్తిలో.. అజమాయిషీలో సైన్యంలోన సేద్యంలోన అన్నీ మేమై... అన్నింటా మేమై... అవకాశం కల్పించుకుంటాం. అస్తిత్వం నిలబెట్టుకుంటాం. స్త్రీని గౌరవించే సమాజం.. స్త్రీని గౌరవించే సంస్కారం.. ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలి. ప్రతి రంగంలో పాదుకొనాలి. తెలుగుతేజమైన గొంగడి త్రిష ఉమన్ క్రికెటర్‌గా మనందరికీ పరిచయమే. భద్రాచల వాసి త్రిష అండర్–19 వరల్డ్ కప్– 2023 ఫైనల్లో టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. ‘సీనియర్ ఉమన్ క్రికెట్ టీమ్‌లో చోటు దక్కించుకోవడమే నా నిరంతర కృషి’ అని చెబుతోంది త్రిష. ఫిట్నెస్ కోచ్ అయిన తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులోనే క్రికెట్లో ఓనమాలు దిద్దిన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్–16 జట్టులో చేరింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు కూతుర్ని హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో చేర్చారు. అక్కడ నుంచి ఆమె క్రికెటర్‌గా తనను తాను మెరుగుపరుచుకుంటూ భారతజట్టులో స్థానం దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయిగా భారత క్రికెట్ జట్టులో విజయకేతనం ఎగురవేస్తున్న త్రిష తన ఆసక్తులను, భవిష్యత్తు కలను ఇలా వివరించింది... ‘‘నేను మహిళల అండర్–19 కేటగిరిరీలో టీ20 వరల్డ్ కప్‌కి ఆడాను. రాబోయే రోజుల్లో ఇండియన్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించాలన్నది నాకల. ఆ లక్ష్యం సాధించడానికే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక తపస్సులా ప్రాక్టీస్ చేస్తున్నాను. గెలుపు ఓటమి గురించి కూడా ఆలోచించకుండా లక్ష్యం కోసం చేసే ప్రయత్నంలో ఏదీ ఒత్తిడిగా అనిపించదు. ఇతర అభిరుచులు... నాకున్న మరో అభిరుచి స్విమ్మింగ్. ఎంతసేపైనా వదలాలనిపించదు. అమ్మాయిలకు స్విమ్మింగ్ తప్పనిసరిగా వచ్చితీరాలని. నాకు స్విమ్మింగ్ చేసిన ప్రతీసారి అనిపిస్తుంటుంది. మంచి రిలాక్సేషనిస్తుంది స్విమ్మింగ్. చదువూ ముఖ్యమే.. ఇప్పుడు 12వ తరగతి చదువుతున్నాను. చదువు, ఆటలు కొనసాగిస్తూ వెళ్లడమే. ఎందుకంటే నా ఎదుగుదలకు ఈ రెండూ ముఖ్యమే అని భావిస్తాను. అయితే, ఎక్కువ సమయం క్రికెట్ సాధనను కేటాయించినప్పటికీ ఎగ్జామ్స్‌కి ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతుంటాను. ఇష్టాలు ఏవైనా కల తర్వాతే.. నాకు స్నేహితులు చాలా తక్కువ. కొందరు క్రికెట్ ఫ్రెండ్స్ ఉన్నారు. కోచ్‌లు సూచించిన డైట్‌ని కచ్చితంగా ఫాలో అవుతాను. ఏ ఆహారం తీసుకుంటే నా హెల్త్‌కి మంచిదో, ఫిట్నెస్ పట్ల ఎంత శ్రద్ధ తీసుకోవాలో అవన్నీ పాటిస్తాను. పిజ్జా, బర్గర్ వంటివి ఇంట్రస్ట్ ఉన్నా సరే తీసుకోను. ప్రాక్టీస్‌లోని మా క్రికెట్ టీమ్ మెంబర్స్‌తోనే టైమ్ పాస్ అవుతుంది కాబట్టి, ఇతరత్రా ఆలోచనలు కూడా ఏవీ మైండ్లోకి రానివ్వను. ప్రోత్సాహాన్నిచ్చేవి.. ఉమెన్ క్రికెటర్ మిథాలీరాజ్, ఎం.ఎస్ ధోనీలకు పెద్ద అభిమానిని. వారు ఆడుతున్న తీరును చూస్తూ పెరిగినదాన్ని కాబట్టి, వారు నాకు రోల్‌మోడల్స్. స్ఫూర్తిదాయకమైన వారి మాటలు నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుంటాను’’ అని తెలియజేసిన త్రిష లక్ష్య సాధనలో ఎన్నో విజయాలు దక్కించుకోవాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి చదవండి: WPL 2023- Shabnam MD- GG: క్రికెట్.. బిర్యానీ.. అంతే..!: విశాఖ క్రికెటర్ షబ్నమ్ -
మళ్లీ జన్మంటూ ఉంటే.. ఆడపిల్లగానే పుడతాం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మళ్లీ జన్మంటూ ఉంటే అమ్మాయిగానే పుడతామంటున్నారు నేటి మహిళలు. అబ్బాయికంటే అమ్మాయిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నా.. ఉన్నతాధికారిణిగా ఉన్నా.. పని ప్రదేశాల్లో వేధింపులు ఎదురవుతున్నా వాటని్నంటిని అధిగవిుస్తూ స్వతంత్రంగా జీవిస్తున్నారు. సొంతింట్లోనే ఆడ మగ వివక్ష ఉన్నా, సోషల్ మీడియా ద్వారా టీజింగ్ ఎదురవుతున్నా వాటిని అధిగవిుస్తూ ముందుకు సాగుతున్నారు. తమకు శిక్షించే అధికారం లభిస్తే మహిళలపై హింస, ఇతరత్రా నేరాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు. ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వివిధ రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యారంగం, ఆర్టీసీ, పోలీసు, అంగన్వాడీ తదితర ప్రభుత్వ రంగాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, టీచర్లు ఈ సర్వేలో భాగస్వాములయ్యారు. నల్ల గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఒక్కో జిల్లాలో వంద మంది చొప్పున 300 మంది మహిళలు పాలు పంచుకున్నారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్ల డించారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలివే.. ►మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 300 మంది మహిళలు, ఉద్యోగినులు, విద్యార్థినులకు నాలుగు ప్రశ్నలు వేసి వారి అభిప్రాయాలను తీసుకున్నాము. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలి. తల్లిగా లాలిస్తూ, భార్యగా బాగోగులు చూస్తూ నిరంతరం పనిచేసే గొప్ప సేవకురాలు మహిళ. అలాంటి మహిళలు ఇంటికే పరిమితం కావద్దు. బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించి వివిధ రంగాల్లో రాణించాలి. అప్పుడే ఆయా రంగాలతోపాటు సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది. – బి.సునీత, స్టాఫ్ నర్స్, సూర్యాపేట చిన్న విషయాలకు నిరుత్సాహ పడొద్దు ప్రతి చిన్న విషయానికి నిరుత్సాహానికి గురికావద్దు. మహిళ పుట్టుకతోనే శక్తివంతురాలు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ కుటుంబాన్ని, పిల్లలను ఒకస్థాయిలో నిలబెడుతుంది. మహిళలు చిన్న విషయాలకు కుంగిపోతే జీవితంలో ఏమీ సాధించలేరు. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు దూరంగా ఉండాలి. చిన్న కారణాలకే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థినులను చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్య అయినా ఎదురొడ్డి నిలబడాలి. – నళిని, హెల్త్ అసిస్టెంట్, నల్లగొండ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి మహిళా దినోత్సవం జరుపుకోవడం అంటే ఆటలాడి, పాటలు పాడి కేకులు కోసి సంబరాలను జరుపుకోవడం కాదు. ఎవరో నలుగురికి శాలువాలు కప్పి సన్మానించడం అంతకంటే కాదు. ప్రతి మహిళ తన జీవితంలో సాధించిన ప్రగతిని సమీక్షించుకుని భవిష్యత్‌లో చేయాల్సిన అంశాలకు బాటలు వేసుకొని, వాటి అమలుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవడమే అసలైన మహిళా దినోత్సవం. – ఉప్పల పద్మ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, మిర్యాలగూడ ఉన్నత చదువులతోనే రాణింపు సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే ఉన్నత చదువులు చదవాలి. ప్రభుత్వాలు మహిళల కోసం మరిన్ని చట్టాలను తీసుకురావాలి. మహిళలకు ఎన్నో చట్టాలు ఉన్నా ప్రస్తుతం ఎక్కడో ఒకచోట వివక్ష తప్పడం లేదు. – మోహన, బీటెక్, ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, సూర్యాపేట అన్నింటా సమానత్వం ముఖ్యం ప్రతి ఒక్క రంగంలో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలి. లైంగిక దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉండాలి. మహిళా స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వాలు పనిచేయాలి. – కానుగు సాయి ప్రసన్న, ప్రైవేట్ ఉద్యోగిని, వంగపల్లి, యాదాద్రి జిల్లా వివక్షలేని సమాజాన్ని నిర్మించాలి మహిళలపై నేటి సమాజంలో వివక్ష ఎక్కువగా ఉంది. ప్రతి ఇంట్లో మగ పిల్లలు చెల్లి, అక్క, తల్లితో ఎలా మెలుగుతున్నారో బయట సమాజంలో కూడా అలానే ఉండేలా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. మహిళలపై వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. – కడియం రాజేశ్వరి, మహిళా కానిస్టేబుల్, మిర్యాలగూడ వన్‌టౌన్ -
గెస్ట్ ఎడిటర్ రోల్ బాగా నచ్చింది
మహిళా గెస్ట్ ఎడిటర్ రోల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఒక పత్రిక వెలువడడానికి ఇంతమంది శ్రమ దాగి ఉందని నాకు తెలియదు. తెరవెనుక ఉండి నడిపిస్తున్న సిబ్బంది, వారి పనితీరు నాకు స్ఫూర్తినిచ్చింది. – సల్మాబాను సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఆహ్వానం మేరకు ఎస్సీ కార్పొరేషన్ నల్లగొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సల్మాబాను మంగళవారం యూనిట్ కార్యాలయంలో గెస్ట్ ఎడిటర్‌గా ఒక్కరోజు విధులు నిర్వర్తించారు. ‘మహిళా గెస్ట్ ఎడిటర్’గా ముఖ్యమైన వార్తలపై ఎడిటోరియల్ సిబ్బందితో చర్చించారు. వార్తల ప్రాధాన్యత, ఎడిటింగ్, పేజినేషన్‌ను పరిశీలించి సూచనలు చేశారు. కొన్ని వార్తలకు శీర్షికలను కూడా పెట్టారు. మహిళల్లో చైతన్యం కలిగించే వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా యూనిట్ కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీలించారు. పత్రిక ప్రింటింగ్ విధానం, సిబ్బంది విధులు, టెక్నికల్ అంశాల గురించి కూడా తెలుసుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి.. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించిందని, వాటిని అందిపుచ్చుకోవాలంటే కేవలం చదువు వల్లే సాధ్యమవుతుందని సల్మాబాను చెప్పారు. ప్రస్తుతం సమాజంలో మహిళలకు ఉన్న అవకాశాలు, మహిళలు ఉన్నతంగా ఎదగాల్సిన ఆవశ్యకతపై మాట్లాడుతూ.. తాను ఆఫీసర్‌గా గుర్తింపు పొందానంటే అది రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్లేనని అన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్షిప్లు, అన్ని రకాల సదుపాయాలు గురించి అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు మంచి చదువులు చెప్పించి ఆర్థికంగా వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా కృషిచేయాలి ఆమె సూచించారు. హేళన చేసిన వాళ్లే.. గొప్పగా చెబుతున్నారు.. చిన్నప్పుడు తన అమ్మానాన్నను చాలా మంది.. ఆడ పిల్లలను ఎందుకు చదివిస్తున్నారు అని అనడం తాను చూశానని. అయినా వారు కష్టపడి తనను చదివించారని చెప్పారు. అప్పటి నుంచే తాను సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అనే దిశగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించానని, ఆరోజు హేళన చేసిన వాళ్లే ఈ రోజు తన గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి చేరుకోగలిగానని సల్మాబాను చెప్పారు. మహిళలైనా, విద్యార్థినులైనా పనిచేసే చోట, కళాశాలలు, పాఠశాలల్లో జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసిపోయి ప్రతి విషయాన్నీ చర్చించాలని చెప్పారు. కొందరు చిన్న చిన్న విషయాలకు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతుండడం బాధ కలిగిస్తోందని అన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఎడిటోరియల్ సిబ్బందితో మాట్లాడుతున్న గెస్ట్ ఎడిటర్ సల్మాబాను టెక్నాలజీకి అనుగుణంగా పత్రికా రంగంలో మార్పులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పత్రికా రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అరచేతిలో ఉండే సెల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్న ఈ రోజుల్లో జర్నలిజం వ్యాల్యూస్‌తో పనిచేస్తున్న ‘సాక్షి’ సిబ్బందిని ఆమె అభినందించారు. తనకు గెస్ట్ ఎడిటర్ అవకాశం కల్పించిన సాక్షి యాజమాన్యానికి సల్మాబాను కృతజ్ఞతలు తెలిపారు. ఎడిటర్‌గా పత్రికను నిర్వహించడం కత్తి మీద సామేనని పేర్కొన్నారు. -
ఉన్నత పదవుల్లో మహిళల సంఖ్య పెరగాలి
సాక్షి, అమరావతి: జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు సమ ప్రాధాన్యతనివ్వకపోతే దేశ, సమాజం పురోగతి సాధించలేవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా అన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తే ప్రపంచంలో భారతదేశం తిరుగులేని స్థానం సంపాదిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి, గవర్నర్లుగా, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలుగా పలువురు మహిళలు ఉన్నారని, అయినప్పటికీ ఉన్నత పదవుల్లో మహిళల సంఖ్య మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా, మహిళా న్యాయమూర్తులు జస్టిస్ బి.శ్రీభానుమతి, జస్టిస్ వడ్డిబోయన సుజాత, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ మహిళలను పూజించడం, గౌరవించడం మన ధర్మమని చెప్పారు. మహిళలు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని తెలిపారు. ఏపీ హైకోర్టులో గతంలో మహిళా న్యాయవాదుల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, ఇప్పుడు 28 శాతానికి పైగా మహిళలే ఉన్నారన్నారు. న్యాయవ్యవస్థతోపాటు ఇతర శాఖల్లో నిర్వహించే నియామక పరీక్షల్లో మహిళలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధిస్తున్నారని చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోకూడదు మహిళా న్యాయమూర్తులు జస్టిస్ శ్రీభానుమతి, జస్టిస్ సుజాత, జస్టిస్ జ్యోతిర్మయి మాట్లాడుతూ హైకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య మరింత పెరగాల్సి ఉందన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఉన్న అడ్డంకులను మహిళలు తమకు తామే తొలగించుకోవాలన్నారు. మహిళలు ఎన్నడూ ఆత్మస్థైర్యం కోల్పోకూడదని, తమను తాము తక్కువగా భావించకూడదని తెలిపారు. కేవలం వాయిదాలు అడిగేందుకే కాకుండా వాదనలు వినిపించే అవకాశాలను మహిళా న్యాయవాదులు అందిపుచ్చుకోవాలన్నారు. సీనియర్ న్యాయవాది భాస్కరలక్ష్మి మాట్లాడుతూ మహిళా సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు పురుషులను సైతం ఆహ్వానించాలని, తద్వారా మహిళల కష్టాలను అర్థం చేసుకునే అవకాశం వారికి కలుగుతుందన్నారు. అనంతరం జస్టిస్ భానుమతి, జస్టిస్ సుజాత, జస్టిస్ జ్యోతిర్మయితోపాటు భాస్కరలక్ష్మిని న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. -
జగన్ పాలనలోనే.. మహిళలకు మహోన్నత గౌరవం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మహిళలకు మహోన్నత గౌరవం దక్కుతోందని, ఇది దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన అరుదైన ఘనత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ది హిందూ జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత, సమానత్వం’ అంశంపై మంగళవారం చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రచయిత్రి ప్రసూన సంధానకర్తగా వ్యవహరించగా హిందూ జీఎం ఎస్డీటీ రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన చర్చలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ.. తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని మహిళలు అడిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని.. కానీ, సీఎం వైఎస్ జగన్ మాత్రం అడక్కుండానే మహిళలకు అనేక వరాలిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. నవరత్నాల ద్వారా అమలుచేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందేనని మంత్రి అన్నారు. ఇక చర్చా గోష్టిలో పాల్గొన్న వారు ఏమన్నారంటే.. మహిళాంధ్రప్రదేశ్‌గా ఏపీ.. రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. ఆంధ్రప్రదేశ్‌ను మహిళాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. అడక్కుండానే అన్నింట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. మహిళల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ మహిళా దినోత్సవమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ దిశ బిల్లుతో అద్భుత ఫలితాలు దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీలోనే దిశ బిల్లు రూపుదిద్దుకుంది. ఇది చాలా విప్లవాత్మక విజయాలను సాధిస్తోంది. అనేక రాష్ట్రాలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. అనేక కేసుల్లో నెలరోజుల్లోపే శిక్షలు పడుతున్నాయంటే అది దిశ బిల్లు ఘనతే. – కేజీవీ సరిత, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ ఆర్థిక, రాజకీయ స్వావలంబన మెరుగుపడింది రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వావలంబన మెరుగుపడటం సంతోషకరం. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడంతోపాటు అణగారిన వర్గాల మహిళల సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలి. – చల్లపల్లి స్వరూపరాణి, ఏఎన్‌యూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ -
వనపర్తి ఆవాజ్.. ఖమర్ రహమాన్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆమె అతి పేద ముస్లిం కుటుంబంలో పుట్టిన సామాన్యురాలు. తల్లి అనారోగ్యం, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆరో తరగతి చదువుతుండగానే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కుటుంబ భారంతో అనేక సమస్యలు ఎదుర్కొంది. అయితే చిన్నప్పట్నుంచే అభ్యుదయ భావాలు కలిగిన ఆమె ఎలాగైనా తనను తాను నిరూపించుకోవడంతో పాటు మహిళా శక్తిని ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నారు. సమాజంలో కట్టుబాట్లను దాటి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. భర్త సహకారంతో పదో తరగతి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేశారు. అవకాశాలను అందిపుచ్చుకున్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గజ్జె కట్టి, పాట పాడుతూ దేశమంతా తిరిగారు. అంతేకాదు స్వయం ఉపాధి చూపడం ద్వారా ఇప్పటివరకు 25 వేల మందికిపైగా మహిళలు, యువతుల జీవితాల్లో వెలుగులు నింపారు. జాతీయ స్థాయిలోనూ పేరు సంపాదించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆవాజ్ వనపర్తి పేరిట కమ్యూనిటీ రేడియోను స్థాపించి అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌కు చెందిన ఖమర్ రహమాన్‌పై మహిళాదినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం.. 150 గ్రామాలకు ఆవాజ్ వనపర్తి రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వనితా జ్యోతి సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్న ఖమర్ రహమాన్ కమ్యూనిటీ రేడియో ప్రాధాన్యత గురించి తెలుసుకుని.. తానూ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చారు. అనేకసార్లు ప్రయత్నించిన తర్వాత నాలుగేళ్లకు అనుమతి లభించింది. వీజేఎంఎస్ ఆవాజ్ 90.4 ఎఫ్ఎం రేడియో (ఆవాజ్ వనపర్తి) ఏర్పాటయ్యింది. 2018లో ప్రసారాలు ప్రారంభం కాగా.. ప్రస్తుతం ఆవాజ్ వనపర్తి రేడియో కార్యకలాపాల కోసం ప్రభుత్వం ఎకరా స్థలం కూడా కేటాయించింది. ఇందులో నుంచే బ్రాడ్ కాస్టింగ్ నడుస్తోంది. భవన నిర్మాణం పురోగతిలో ఉంది. ఇది పూర్తయితే రికార్డింగ్, బ్రాడ్‌కాస్టింగ్ ఒక్కచోట నుంచే జరుగుతుంది. ప్రస్తుతం వనపర్తి నుంచి 35 కిలోమీటర్ల మేర 150 గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకున్నా ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ఆవాజ్ వనపర్తి 90.4 ఎఫ్ఎం పేరుతో వెబ్ రేడియో కూడా అందుబాటులోకి తేగా.. దీనికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రోతలు ఉండడం విశేషం. రైతులు, మహిళల సమస్యలు పరిష్కారంపై నిపుణులతో కార్యక్రమాలు, జాతీయ నేతలు, మహానుభావుల జీవిత చరిత్ర, చారిత్రక ప్రాధాన్యం గల అనేక అంశాలతోపాటు ఆరోగ్య సూత్రాలు, చిట్కాలు, పద్యనాటకాలు, మిమిక్రీ, చిన్నపిల్లల కార్యక్రమాలు, యూనిసెఫ్ ప్రోగ్రామ్‌లు ప్రసారంతో ఇది బహుళ ప్రజాదరణ పొందుతోంది. ఇలా మొదలు.. నిరక్షరాస్యత, పేదరికం, వలసలకు కేరాఫ్‌గా నిలిచిన పాలమూరు జిల్లాలో ప్రభుత్వం 1989లో అక్షర కిరణం పేరిట పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా మహిళా అక్షరాస్యతను పెంపొందించడం.. పొదుపు అలవాటు చేసుకునేలా స్వయం సహాయక బృందాల (ఎస్ఎస్జీ) ఏర్పాటు కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఆయా కార్యక్రమాలకు ఆటపాటల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. పాటలు రాయడం, పాడడంతో పాటు గజ్జె కట్టి ఆడటంలోనూ ప్రావీణ్యమున్న ఖమర్ రహమాన్‌కు వెంటనే అవకాశం వచ్చింది. అంతే ఆమె ఇక వెనుతిరిగి చూడలేదు. గజ్జె కట్టి, పాటపాడుతూ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రచారం చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కల్చరల్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఖమర్ రహమాన్.. చిన్నమ్మ థామస్ సఖీ కేంద్రాల నిర్వహణ చేపట్టి సమాజంలో అణచివేత, వేధింపులకు గురవుతున్న ఎందరో మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సారా నిషేధం కోసం లక్ష సంతకాలు సేకరించి గవర్నర్‌కు సమర్పించి గుర్తింపు తెచ్చుకున్నారు. భూకంప బాధితులకు విరాళాల సేకరణతో పాటు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు 1994లో వనితా జ్యోతి మహిళా సంఘం (వీజేఎంఎస్) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీని ద్వారా ఇప్పటివరకు 25 వేల మందికిపైగా మహిళలు, యువతులకు కంప్యూటర్, టైలరింగ్, మగ్గం వర్క్స్, సర్ఫ్, అగర్బత్తీల తయారీ తదితరాల్లో శిక్షణ ఇప్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు.. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోకు నాతో పాటు మొత్తం 614 మంది దరఖాస్తు చేశారు. ఇందులో నాకే అవకాశం అభించింది. సాంకేతికతను ఉపయోగించి సమాజానికి మరిం త మేలు చేయాలనే సంకల్పంతో దీన్ని స్థాపించా. ప్రస్తుతం ఈ రేడియోలో 18 మంది మహిళలు పని చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో చాలా అవార్డులు వచ్చినా..డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ (డీఈఎఫ్) నుంచి మూడు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉంది. త్వరలో ప్రతి గ్రామానికి 2 రేడియోల చొప్పున అందజేసి.. మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. – ఖమర్ రహమాన్, ఆవాజ్ వనపర్తి రేడియో ఫౌండర్ -
నాయకత్వ నిర్వచనం మారాలి!
భౌతిక దారుఢ్యం, ఆచరణాత్మకంగా ఉండటం వంటి వాటిని నాయకత్వ లక్షణాలుగా చూడడం వల్ల అనాదిగా పురుషులే నాయకత్వ స్థానాలలో కనిపిస్తున్నారు. కానీ మహిళలు నాయకత్వ బృందాలలో ఉన్నప్పుడు కరుణ వంటి లక్షణాలు కూడా ముఖ్యం అవుతున్నాయి. మహిళా నాయకత్వానికీ, సామాజిక సంక్షేమానికీ మధ్య ధనాత్మక సంబంధాన్ని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 21వ శతాబ్దపు ఒక క్లిష్టమైన పోరాటం అందుబాటులో ఉన్న వనరులకూ, మానవ వైఖరులకూ మధ్య జరుగుతుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ నాయకత్వం అవసరం. మెరుగైన సమాజం నిర్మించడం కోసం మహిళల విభిన్న అనుభవాలు, నైపుణ్యాలు ఎంతో అవసరం. ఏది నాయకి? 2030 నాటికి ప్రపంచం సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో లింగ సమానత్వాన్ని ఐదో లక్ష్యంగా నిర్ణయించి, దీన్ని సాధించడంలో మహిళల సమాన భాగ స్వామ్య అవసరాన్ని ఐకరాజ్య సమితి నొక్కి చెప్పింది. కానీ వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండి, లింగ సమానత్వ లక్ష్యాన్ని ఎప్పటికి సాధించగలమనే ప్రశ్నను రేకెత్తిస్తునాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్ణయాలు తీసుకొనే అనేక స్థానాలలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 1 సెప్టెంబర్ 2021 నాటికి కేవలం 24 దేశా లలో మాత్రమే మహిళలు దేశ, ప్రభుత్వ అధిపతు లుగా ఉన్నారు. దీని ప్రకారం, అత్యున్నత అధికార స్థానాల్లో లింగ సమానత్వం మరో 130 సంవ త్సరాల వరకు కూడా సాధించలేము. ప్రపంచంలోని మూడు వంతుల పార్లమెంటరీ స్థానాలను పురుషులు కలిగి ఉండటం రాజకీయాల్లో పురుషుల ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మంత్రులుగా 21 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. మహిళా వ్యవహారాల శాఖలకే సాధార ణంగా మహిళలు పరిమితం కావాల్సి వస్తోంది. మహిళా నాయకత్వానికీ, సామాజిక సంక్షే మానికీ మధ్య ధనాత్మక సంబంధాన్ని అనేక అధ్య యనాలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో మహిళల నేతృత్వంలో ఉన్న పంచాయతీ ప్రాంతాల్లో తాగు నీటి ప్రాజెక్టుల సంఖ్య పురుషుల నేతృత్వంలోని పంచాయితీల కంటే 62 శాతం అధికంగా ఉన్నదనీ, మున్సిపల్ కౌన్సిళ్లలో మహిళల ప్రాతినిధ్యానికీ, పిల్లల సంరక్షణకీ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్న దనీ సర్వేలు చెపుతున్నాయి. 21వ శతాబ్దపు ఒక క్లిష్టమైన పోరాటం అందుబాటులో ఉన్న వనరులకూ, మానవ వైఖరు లకూ మధ్య జరుగుతుంది. వాతావరణ మార్పు, ఆరోగ్యం, పర్యావరణ క్షీణత, సామాజిక అసమా నతలు మొదలైన సమస్యలను ఎదుర్కొనేందుకు బహుముఖ నాయకత్వం అవసరం. మెరుగైన సమాజం నిర్మించడం కోసం తీసుకొనే నిర్ణయా లలో మహిళల విభిన్న అనుభవాలు, నైపుణ్యాలు ఎంతో అవసరం. మహిళలకు సాధికారత చేకూర్చడానికి లింగ బడ్జెట్‌ను చాలా దేశాలు ఒక మార్గంగా ఎన్ను కున్నాయి. ఐఎంఎఫ్ ప్రకారం, ప్రపంచంలో 80 దేశాలు లింగ బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తు న్నాయి. భారతదేశం కూడా 2006 నుండి లింగ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మన లింగ బడ్జెట్లో సాధారణంగా రెండు రకాల పథకాలు గమనించ వచ్చు. మొదటిది, మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఖర్చు చేసే పథకాలు: ఉదాహరణకు బేటీ బచావో, బేటీ పఢావో. రెండవది పాక్షికంగా మహిళ లను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టినవి. ఇక్కడ పథక ప్రయోజనాలు కనీసం 30 శాతం మహిళలకు చేకూరుతాయి. అయితే రెండో కోవకు చెందిన పథ కాలే ఆధిపత్యంలో ఉంటున్నాయి. ఉదాహరణకు 2021 బడ్జెట్లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బడ్జెట్ 16 శాతం పెరిగింది. కానీ ఈ మొత్తం బడ్జెట్లో 80 శాతం అంగన్ వాడీ, మిషన్ పోషణ్ 2.0 పథకాలకు కేటాయించడం జరిగింది. సమాన అవకాశాలను కల్పించగలిగే ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి నిర్ణయాత్మక స్థానాలలో మహిళల పాత్ర, ప్రాముఖ్యతలను గుర్తించడం కీలకం. మార్పు అనేది దానికదే స్వతంత్రంగా రాదు. సమాజంలో సమానత్వం సృష్టించే సద్గుణ చక్రాన్ని సాధించడానికి వ్యవస్థలు మారాలి. ఇప్పటివరకు ఈ ప్రపంచం ప్రధానంగా పురుషుల ఆలోచనలు, నాయకత్వంలో నడుస్తోంది. చారిత్రకంగా భౌతిక దారుఢ్యం, హేతుబద్ధత, ఆచరణాత్మకంగా ఉండడం వంటి వాటిని నాయకత్వ లక్షణాలుగా చూడడం వల్ల అనాదిగా పురుషులే నాయకత్వం స్థానాలలో కనిపిస్తున్నారు. నాయకత్వ నిర్వచనాన్ని మరింత బహుమితీయంగా మార్చి, నాయకత్వ లక్షణాలను విస్తృతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మారుతున్న ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి శారీరక బలాల మీద కాకుండా నైపుణ్యాలపై ఆధారపడి ఉంది. సహజంగా మహిళలు వ్యూహాత్మక దృష్టితో ఆలోచించే విధానం సమాజ నిర్మాణం కోసం ఉపయోగపడుతుంది. మహిళలు నాయకత్వ బృందాలలో ఉన్నప్పుడు కరుణ వంటి లక్షణాలు నాయకత్వంలో భాగం అవుతున్నాయి. గణపతిరాజు పావనీ దేవి వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర లెక్చరర్ పితృస్వామ్యమే ముద్దాయి స్త్రీ అనగానే కేవలం సౌందర్య భావనతో ప్రాచీన కవులు ఎన్నో కావ్యాలలో రకరకాలుగా వర్ణించారు. మహిళ అనే పదం ఈ మహిలో చాలా గొప్పది. ఒక మహిళను చూసే కళ్ళలో, మనసులో మార్పు వచ్చి తీరాలి. తనకు జన్మ నిచ్చిన స్త్రీ జాతిని గౌరవించకపోగా రక రకాలుగా అవమానించడం అమానుషం. క్షమించరాని నేరం. స్త్రీల దైన్యస్థితికి అతి ముఖ్యమైన కారణం పితృస్వామ్య వ్యవస్థ. నిజానికి ఆదిమ సమాజంలో మాతృస్వామ్యం ఉండేది. స్త్రీ కేంద్రంగా సమాజం నడిచేది. కాలక్రమంలో స్త్రీలు ఉత్పత్తి పరికరాలకు దూరమ వడం, పురుషులు వాటిపై ఆధి పత్యం చలాయించడం, బానిస వ్యవస్థ, గుంపు పెళ్లి నుండి దంపతీ వివాహానికి వివాహ వ్యవస్థ పరిణామం చెందడం, వ్యక్తిగత ఆస్తి భావన పెరగడం, ఆయుధాల మీద పురు షుల ఆధిపత్యం వంటి అనేక కారణాల వల్ల స్త్రీ వెనక్కి నెట్టివేతకు గురై క్రమంగా పురుషాధిక్యత పాదుకు పోయింది. ఈ సంవత్సరం ‘ఆవిష్కరణ, సాంకేతికతల్లో లింగ సమానత్వం’ అంశాన్ని థీమ్‌గా మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇది ఆహ్వానించదగినది. ఎందుకంటే... ‘ఐకాస’, ‘ఉమెన్స్ జెండర్స్ స్నాప్ షాట్– 2022’ నివేదిక ప్రకారం డిజిటల్ ప్రపంచంలో మహిళలు లేకపోవడం వల్ల గత పదేళ్లలో తక్కువ, మధ్య ఆదాయ దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి తగ్గింది. ఈ విషయంలో ఏమీ చేయలేక పోయినట్లయితే ఈ నష్టం 2025 నాటికి ఇంకా పెరుగుతుంది. స్త్రీలు విద్యావంతులు కానంత వరకూ ఏ దేశమూ బాగుపడదు. మన అభివృద్ధి అంతా స్త్రీల అభివృద్ధిపైనే ఆధారపడి ఉన్నది. అయితే పురుషులతో సమానంగా ఉద్యోగం చేస్తున్నా... భారతీయ సమాజంలో ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం స్త్రీ బాధ్యత కాబట్టి ఆమెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అన్ని విధులనూ మహిళ అత్యంత చాకచక్యంగా నిర్వర్తిస్తోంది. స్వప్న కొండ వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయురాలు అపర కాళీమాత కూడా... స్త్రీ ప్రకృతికి ప్రతీక. అందానికే నిర్వచనం. ఇంటికి దీపం. అమృతాన్ని వర్షించే అమ్మగా, అనునయించే అక్కగా, అనురాగాన్ని పంచే చెల్లిగా, ఆత్మీయతను కురిపించే భార్యగా ఆమె ఒక కుటుంబానికి ఎంత సుపరిచితురాలో... ఒక టీచరుగా, డాక్టరుగా, పోలీస్ ఆఫీసరుగా, పైలెట్‌గా, రైతుగా, కూలీగా, ఇంటిపనులు చేసే మనిషిగా... ఇలా అన్ని హోదాలలో కూడా సమాజానికి అంతే సుపరిచితురాలు. భారతీయ సంస్కృతిలో స్త్రీలకు సముచిత స్థానాన్నే అందించారు. మనం నిత్యం ఆరాధించే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన అమ్మవార్లు కూడా స్త్రీలే కదా. స్త్రీని ఒక దేవతలా చూడడం, ఆమెను జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది అనాదిగా మన రక్తంలోనే జీర్ణించుకుపోయింది. అయితే నేడు ఈ జాగ్రత్తనే కొన్ని సందర్భాలలో అతియై ఆడపిల్లల స్వేచ్ఛకు ఆటంకంగా మారు తోంది. సమాజంలోని కొన్ని దుస్సంఘటనలకు వెరసి ఇంట్లోవాళ్ళు విధించే ఆంక్షలు ఆడపిల్లల అభివృద్ధికి అవరోధాలుగా పరిణమించడంతో పాటు, పిల్లలకూ తల్లిదండ్రులకూ మధ్య అగా థాలను సృష్టిస్తున్నాయి. ప్రతి పరిణామం ఇంటి నుండే మొద లవ్వాలి. ఆది గురువులై అమ్మలు మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని తమ పిల్లలకు రంగరించి ఎటువంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని అలవరచాలి. భర్త అడుగుజాడల్లో నడిచిన సీతగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సావిత్రిగా, యుద్ధభూమిలో తోడు నిలిచిన సత్య భామగా, బుద్ధి కుశలతతో త్రిమూర్తులనే పసిబిడ్డలను చేసి లాలించిన అనసూయగా ఉంటూనే, అవసరమైతే ఇంతులు అపర కాళీ మాతలవ్వాలి. సమాజాభివృద్ధికి హేతువయ్యే ప్రతి పాత్రను సంపూర్ణంగా పండించాలి. – డా‘‘ బి. నీలిమా కృష్ణమూర్తి సహాయ కార్మిక అధికారి -
Women's Day 2023: మహిళల కోసం హ్యుందాయ్ స్పెషల్ ఆఫర్స్, ఇవే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యుందాయ్ కంపెనీ మహిళా కస్టమర్లకోసం ప్రత్యేకమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. మార్చి 06 నుంచి 09 వరకు హ్యుందాయ్ డీలర్షిప్ లేదా సర్వీస్ సెంటర్లో ఈ ఆఫర్స్ పొందవచ్చు. హ్యుందాయ్ కంపెనీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వివరాల ప్రకారం, ఫ్రీ వాషింగ్ కూపన్, పిక్-అండ్-డ్రాప్ వంటి సర్వీసులు ఉన్నాయని, అంతే కాకుండా కారుని మెరుగైన పద్ధతిలో ఎలా నిర్వహించాలనే దానిపై కూడా ప్రత్యేక సెషన్లు కూడా నిర్వహించనున్నట్లు, మహిళల కోసం బ్రాండ్లపై myHyundai యాప్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కంపెనీ అందించే ఈ ఆఫర్స్ కేవలం మార్చి 9 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: Women’s Day 2023: మహిళల కోసం జావా యెజ్డీ ముందడుగు.. దేశ వ్యాప్తంగా బైక్ రైడింగ్) ఇదిలా ఉండగా హ్యుందాయ్ కంపెనీ ఇటీవల 2023 హ్యుందాయ్ వెర్నా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది ఈ నెల 21న మార్కెట్లో విడుదలవుతుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నాకి సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. అయితే ధరల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ దీని ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
'అదే వారి బలం.. అందుకే ప్రాణాంతకమైనా జయించారు'
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సినీరంగంలో రాణించడమంటే మాటలు కాదు. పైగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అంతా ఈజీ కాదు. ఎంత టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాకపోతే ఈ రంగంలో గుర్తింపు దక్కడం కష్టమే. అంతే కాకుండా కెరీర్ సాఫీగా సాగుతుందనుకునేలోపే ఊహించని సంఘటనలు మరింత వెనక్కి లాక్కెళ్తాయి. అవకాశాలు అందే సమయంలో అనుకోని పరిణామాలతో దాదాపు కెరీర్ ముగిసేంతా పరిస్థితి ఎదురవుతుంది. కానీ అలాంటి సమయంలోనే మనం పట్టుదలగా ఉండాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకూడదు. అలా ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్న హీరోయిన్ల పేర్లు ఇట్టే వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. జీవితంలో అత్యంత గడ్డుకాలాన్ని అధిగమించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్లు కొందరే ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా విజయం సాధించిన ఆ తారలపై ప్రత్యేక కథనం. మయోసైటిస్‌ను జయించిన సమంత సమంత సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ఆ తర్వాత కోలుకుని కెరీర్లో మళ్లీ బిజీ అయిపోయింది. మయోసైటిస్ బారిన పడిన సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను అనుభవించింది. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకినా.. ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్ నటించనుంది. గతంలో మయోసైటిస్ గురించి సామ్ మాట్లాడుతూ.. 'ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త దయతో మెలగండి’అని సామ్ చెప్పుకొచ్చింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోందంటూ ఎమోషనలైంది సామ్. అందువల్లే బయటపడ్డా: సుస్మితాసేన్ ఇటీవల మాజీ మిస్‌వరల్డ్, నటి సుస్మితాసేన్ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. ఇటీవలే ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు సుస్మితాసేన్. ఆమె మాట్లాడూతూ.. 'ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యా. ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి. నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది. మా నాన్న సుబీర్సేన్ నాకు చెప్పిన ఈ మాటలే నాకు స్ఫూర్తి' అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా సేన్. ఆత్మవిశ్వాసంతో గెలిచా: హంసా నందిని అత్తారింటికి దారేది, ఈగ, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి హంసానందిని. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. గతంలో హంసా మాట్లాడుతూ..' వైద్య పరీక్షల్లో నాకు వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్ ఉందని తేలింది. జన్యు పరివర్తన కారణంగా భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెప్పారు. అయినా కూడా నేను అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతోనే ఆ మహమ్మారిని గెలిచా.' అంటూ చెప్పుకొచ్చింది. క్యాన్సర్‌తో పోరాడిన సోనాలిబింద్రే ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన భామ సోనాలి బింద్రే. సోనాలిబింద్రే క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ కష్టం సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది. మనిషి తన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని.. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది. రెండుసార్లు జయించిన మమతా మోహన్‌దాస్ రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన పడి నటి మమత మోహన్ దాస్. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకుంది. ఇటీవలే మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది. ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి సోకిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. క్యాన్సర్ సమయంలో తాను పడిన కష్టాలను గతంలో ఆమె వివరించింది. క్యాన్సర్‌కు గురికావడంతో నా కలలన్నీ చెదిరిపోయాయని వెల్లడించింది. ఏడేళ్లు పోరాడి ఆ మహమ్మారిని జయించానని తెలిపింది. అమ్మానాన్నలు,స్నేహితుల ధైర్యంతోనే క్యాన్సర్‌పై గెలిచానని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో సీనియర్ హీరోయిన్లు మనీషా కొయిరాల, గౌతమి కూడా క్యాన్సర్‌ను జయించిన వారిలో ఉన్నారు. -
మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కొలమానం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్రను మహిళలు పోషిస్తున్నారని సీఎం కొనియాడారు. ‘‘మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం. 2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి మన ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతలపై దేశంలోని మరే ప్రభుత్వమూ పెట్టనంతగా దృష్టి పెట్టింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, 30 లక్షల ఇళ్ల పట్టాలు-22 లక్షల ఇళ్ల నిర్మాణం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ సంపూర్ణ పోషణ వంటి పథకాలతో గర్భస్త శిశువు నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. వారి రక్షణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లతో ఆడబిడ్డల రక్షణలో అందరికన్నా మిన్నగా అడుగులు ముందుకు వేశాం’’ అని సీఎం అన్నారు. చదవండి: ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ ‘‘21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే అవతరించేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాజకీయ పదవుల్లో కూడా చట్టాలు చేసి మరీ సగభాగం ఇచ్చింది మన ప్రభుత్వమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం, మొత్తం సమాజం ఆడబిడ్డల పట్ల మరింత గౌరవం, శ్రద్ధ కనబర్చేలా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. -
రంగుల ప్రపంచంలో వెండితెరను ఏలిన మహిళా దర్శకులు..
సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాను రూపొందించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే దర్శకత్వ విభాగంలోనూ తొలితరం నుంచే తమదైన ముద్ర వేశారు మహిళా దర్శకులు. మరికొంత మంది నటిగా వెండితెరకు పరిచయమైనా, ఆ తర్వాత దర్శకురాలిగానూ సత్తాచాటారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళా దర్శకులపై స్పెషల్ స్టోరీ. సావిత్రి మహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే చిన్నారి పాపలు, మాతృ దేవత, వింత సంసారం వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి సత్తా చాటారు. జీవితా రాజశేఖర్ జీవితా రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అరంగేట్రం చేసిన జానకి రాముడు, ఆహుతి, అంకుశం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. 1990లో డా.రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనకు దూరమైన ఆమె శేషు సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత సత్యమేవజయతే, మహంకాళి, శేఖర్ వంటి సినిమాలను రూపొందించారు. తాజాగా 33 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి నటిగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. విజయనిర్మల విజయనిర్మల తన ఏడో ఏటనే ‘మత్స్యరేఖ’అనే సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 44 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. నందినీ రెడ్డి అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా మారింది నందినీ రెడ్డి. తొలి సినిమాతోనే ఆమె డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జబర్ధస్థ్, కల్యాణ వైభోగమే వంటి చిత్రాలు తెరకెక్కించింది. సమంతతో తీసిన ఓ బేబీ సినిమా దర్శకురాలిగా నందినీరెడ్డిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా అన్నీ మంచి శకునములే అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. మంజుల ఘట్టమనేని సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంజుల ఘట్టమనేని. తొలుత మళయాళ చిత్రం ‘సమ్మర్ ఇన్ బెత్లేహామ్’లో నటించిన ఆమె ఆ తర్వాత తొలిసారిగా ‘షో’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత నాని, పోకిరి,కావ్యాస్ డైరీ వంటి చిత్రాలను నిర్మించింది. మెగాఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది’ వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం నిర్మాతగా, నటిగా, దర్శకురాలిగా కొనసాగుతున్నారు. సుధా కొంగర ఒకప్పుడు విమర్శించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నారు డైరెక్టర్ సుధా కొంగర.2008లో కృష్ణ భగవాన్ హీరోగా వచ్చిన ఆంధ్రా అందగాడు సినిమాతో దర్శకురాలిగా మారింది సుధా కొంగర. ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత ద్రోహి, గురు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2020లో సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది సుధా కొంగర. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా సూపర్ హిట్‌తో ఎంతోమంది స్టార్ హీరోలు ఆమెతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( ఫొటోలు)
-
Women’s Day 2023: మహిళల కోసం జావా యెజ్డీ ముందడుగు
భారతదేశంలో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్ 'జావా యెజ్డీ మోటార్ మోటార్‌సైకిల్స్' మహిళల కోసం బైక్ రైడ్ ప్రారంభించింది. 2023 మార్చి 5న దేశంలోని మహిళా రైడర్ల స్ఫూర్తిని పురస్కరించుకుని ఢిల్లీ, బెంగళూరు, పూణే, చెన్నై, గౌహతి వంటి నగరాల్లో రైడింగ్ ప్రారంభించింది. ఈ రైడింగ్‌లో సుమారు 150 మంది మహిళా రైడర్లు పాల్గొన్నారు. ఈ రైడ్లలో పాల్గొన్న మహిళలు సమాజంలోని అణగారిన వర్గాల మహిళల ఋతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడంలో సహాయపడ్డారు. కంపెనీ నిర్వహించిన ఢిల్లీ రైడ్‌లో ప్రముఖ ర్యాలీ రైడర్ 'గరిమా అవతార్' పాల్గొన్నారు. ఈ రైడ్‌లో ఆమె పాల్గొనడం వల్ల తోటి మహిళలు కూడా చాలా ఉత్సాహాన్ని కనపరిచాడు. ఈ రైడ్స్ బ్రాండ్ డీలర్‌షిప్‌ల నుండి ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా సామాజిక కార్యక్రమాలు, రిఫ్రెష్మెంట్ల కోసం అనేక స్టాప్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రైడ్లలో పాల్గొన్న రైడర్లు వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలకు ఫుడ్ ప్యాకెట్లు, శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేశారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' కొత్త లగ్జరీ కారు: ధర ఎంతంటే?) ఈ సందర్భంగా జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ సీఈఓ 'ఆశిష్ సింగ్ జోషి' మాట్లాడుతూ.. కంపెనీ బైకులపై మహిళకు అనుభూతి పెరుగుతోందని, మహిళా రైడింగ్ వంటి వాటిని ప్రోత్సహించడంలో మేము ముందుంటామని, వివిధ మహిళా సంక్షేమ అంశాలపై అవగాహన కల్పించడంలో తప్పకుండా ముందుకు వస్తామని అన్నారు. -
ప్రతీ ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలి: మంత్రి రోజా
సాక్షి, గుంటూరు జిల్లా: దిశా యాప్‌తో మహిళలకు భద్రత, భరోసా వచ్చిందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రతీ మహిళ దిశా యాప్‌ను వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనను చూసి ఏపీలో దిశ చట్టం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ఆమె అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశిష్ట పురస్కారం అందుకోవడం తన అదృష్టమని, ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని మంత్రి రోజా అన్నారు. ‘‘నేను ఎంచుకున్న రెండు రంగాలు సవాళ్లతో కూడుకున్నవి. పురుషాధిక్యత ఉన్న ఈ రంగాల్లో రాణించేందుకు నా తండ్రి, సోదరులు, భర్త అండగా నిలిచారు. నాకు తోడబుట్టకపోయినా నేనున్నానని భరోసా కల్పించిన అన్న సీఎం జగన్. కష్టాన్ని నమ్ముకున్నోళ్లకు సక్సెస్ వచ్చి తీరుతుంది. చాలా మంది ఇళ్లల్లో ఆడ పిల్లంటే చిన్నచూపు ఉంటుంది. మగ పిల్లాడిని ఒకలా.. ఆడ పిల్లను మరోలా చూస్తారు. ఇల్లు, బడి, ఉద్యోగం అన్ని చోట్లా మహిళలను గౌరవించాలి’’ అని మంత్రి రోజా పిలుపునిచ్చారు. చదవండి: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్ -
మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం జగన్ లక్ష్యం: విడదల రజిని
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో మహిళా సాధికారత, సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని, సీఎం వల్లే ఇది సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని అన్నారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “మహిళా సాధికారత, సమానత్వం” అంశంపై పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ప్రతి అడుగులోనూ సీఎం జగన్ మహిళలకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో మహిళకు ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఒక కారణమన్నారు. నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందే అన్నారు. మహిళలకు అన్ని స్థాయిల్లో మేలు చేస్తున్నాం కాబట్టే తమ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మాటకు, చేతకు మన్నన ఇచ్చే మనసున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తామే నిలబడి ఎదగాలని మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రధానంగా అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపునేస్తం వంటి పథకాల ద్వారా సాధికారతతో పాటు తోడ్పాటు అందిస్తున్నామన్నారు. విద్యతోనే కుటుంబ తలరాతలు మారుతాయని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి.. జగనన్న అమ్మఒడి ద్వారా ఏటా రూ.15,000ల ఆర్థిక సాయం, జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన, మెరుగైన, రుచికరమైన పౌష్టికాహారం, 9 రకాల వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక కిట్, జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన వంటి పథకాలు విద్యారంగంలో అమలు చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 3255 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందించడమే గాకుండా చికిత్స అనంతరం రోగి కోలుకునే సమయంలో ఆర్థికంగా ఇబ్బంది ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. గర్భవతిగా ఉన్నప్పుడే మహిళలకు, పుట్టిన అనంతరం చిన్నారులకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా సంపూర్ణ పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీలు క్షేమంగా చికిత్స అనంతరం ఇంటికి చేర్చేలా తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, వైద్యం, భవిష్యత్ లో ఉద్యోగాల కల్పన వంటి అన్ని అంశాల గురించి ఆలోచిస్తోన్న ప్రభుత్వం తమదన్నారు. దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కేబినెట్లో మహిళలకు మంత్రులుగా అవకాశమివ్వడమే కాకుండా నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ అవకాశం కల్పించారన్నారు. కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని చివరి దశ వరకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వం సేవలందిస్తోందన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, తమ ముఖ్యమంత్రి మహిళా పక్షపాత సీఎం అని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తున్న మంచి మనసున్న సీఎం.. వైఎస్ జగన్ అని కొనియాడారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభం కాబోతుందని తద్వారా ప్రభుత్వ వైద్యులే ఇంటికి వచ్చి వైద్యం అందించే వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు. ఏపీలో ప్రతి రోజూ మహిళా దినోత్సవమే: వాసిరెడ్డి పద్మ ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మహిళాంధ్రప్రదేశ్ గా మార్చారని అన్నారు. మహిళల కోసం సమస్త యంత్రాంగం, వ్యవస్థ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రిదన్నారు. అడగకుండానే అన్నింట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. మహిళా సంక్షేమం కోసం ఎంతైనా చేయాలన్న తపన ముఖ్యమంత్రికి ఉందన్నారు. ప్రతి మహిళ జీవితంలో మార్పు రావాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్న వాసిరెడ్డి పద్మ.. మహిళా సాధికారత సాధన కోసం సీఎం.. వినూత్న పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు అవసరమైన తోడ్పాటు, ఆర్థిక చేయూతను ఈ పథకాల ద్వారా అందజేస్తున్నారన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తూ, గ్రామ సచివాలయాల్లో పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కచెల్లెమ్మలకు అభయ హస్తమందిస్తున్నారన్నారు. మహిళలపై ఏ చిన్న అఘాయిత్యం జరిగినా 21 రోజుల్లోనే వేగవంతమైన దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకొని శిక్షలు విధిస్తోన్న ప్రభుత్వం తమదేనన్నారు. ప్రస్తుతం మహిళను శక్తిగా గుర్తించే పరిస్థితి సీఎం జగన్ తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం తో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మనసా, వాచా, కర్మనః ముఖ్యమంత్రి వేస్తున్న ప్రతి అడుగూ మహిళ అభ్యున్నతి కోసమేనన్నారు. మహిళల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజూ మహిళా దినోత్సవమే అన్నారు. మహిళా సాధికారత సాధనకు సీఎం జగన్ ప్రభుత్వం కృషి: చల్లపల్లి స్వరూపరాణి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ మహిళా సాధికారత సాధనకు సీఎం జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో హింసా ప్రవృత్తి తగ్గుముఖం పట్టిందన్నారు. గృహహింస కేసులు తగ్గడం శుభపరిణామమన్నారు. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడంతో పాటు అణగారిన వర్గాల మహిళల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు, మహిళలకు చేరడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. గతంలో కన్నా ఆర్థిక, రాజకీయ స్వావలంబన మెరుగవడం సంతోషకరమన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో రక్షణ: సరిత ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ కె.జి.వి సరిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు తోడ్పాటు, చేయూతనందిస్తోందన్నారు. మహిళలు తమలోని శక్తిని తామే గుర్తించి సంకల్ప బలంతో ముందుకు వెళ్లాలని సూచించారు. దిశ చట్టాన్ని రూపొందించడం ద్వారా ప్రభుత్వం మహిళల భద్రత కు భరోసా కల్పిస్తుందన్నారు, దిశ యాప్ ద్వారా అరచేతిలో మహిళలు, యువతులకు రక్షణ వ్యవస్థ ఏర్పాటైందన్నారు. ఒక్క ఫోన్ కాల్ తో రక్షణ అందిస్తున్నామన్నారు. మహిళలు ఎదిగేందుకు సంక్షోభ నిర్వహణ, ఇతరుల బాధను తమ బాధ అనుకోవడం, సమిష్టిగా పనిచేయడం, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, ఏం కోల్పోయినా తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడం(స్థితిస్థాపకత), శారీరక, మానసిక ధృడత్వం వంటి 5 లక్షణాలు తప్పనిసరన్నారు. మహిళలపై ఏదైనా అఘాయిత్యాలు, వేధింపులు, దాడులు వంటివి జరిగితే వ్యక్తిగత సమస్యగా కాకుండా తమ సమస్యగా భావించి రిపోర్ట్ చేస్తే వెంటనే సపోర్ట్ అందిస్తోంది. ఈ ప్రభుత్వమన్నారు. గ్రామస్థాయిలో సైతం తమ సమస్యలు విన్నవించేందుకు, వెంటనే పరిష్కరించేందుకు గ్రామ సంరక్షణ కార్యదర్శులను సైతం ప్రభుత్వం నియమించిందన్న విషయం గుర్తుచేశారు. మహిళలు ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలన్నారు. న్యాయబద్ధమైన సమానత్వం కావాలని ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతి కోసం ఆలోచించిన వ్యక్తి సీఎం జగన్: రావూరి సూయిజ్ మార్పు ట్రస్ట్ డైరెక్టర్ రావూరి సూయిజ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ప్రతి రంగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లో టెక్స్ టైల్స్ రంగానికి రాయితీలు ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది మహిళలకు ఆ రంగంలో అవకాశాలు లభించనున్నాయన్నారు. మనబడి నాడు-నేడు పథకం ద్వారా కల్పిస్తున్న మౌలిక వసతులు, ఆధునికీకరణ వల్ల గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెరిగిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా మహిళల అభ్యున్నతి కోసం అన్ని రకాలుగా ఆలోచించిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం: జర్నలిస్టు రెహానా మీడియా అడ్వైసర్ కమిటీ సభ్యురాలు, జర్నలిస్టు రెహానా బేగం మాట్లాడుతూ మహిళలు సమాన హక్కులు కాదు సమాన విజయాలు సాధించాలన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు అవకాశాలు దక్కుతున్నాయన్నారు. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా సంక్షేమ పథకాలు, రాజకీయ సాధికారతకు అద్దం పట్టేలా రాజకీయ ప్రాధాన్యతను సీఎం జగన్ కల్పించారన్నారు. రేషన్ కార్డులో పేరు మొదలుకొని ఇళ్ల రిజిస్ట్రేషన్ వరకు ప్రతి ఒక్కటి మహిళ పేరు మీదే అందజేసి యాజమాన్య హోదా కల్పించిందీ ప్రభుత్వమన్నారు. ఉన్నతవిద్యలో మహిళలకు మరిన్ని అవకాశం కల్పించే అంశంపై దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో సెర్ప్, మెప్మా అధికారులు, సిబ్బంది, అన్ని జిల్లాల నుండి వచ్చిన డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్ -
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
సాక్షి, విజయవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా గొప్పది. అనేక రంగాల్లో మహిళలు తిరుగులేని నాయకత్వాన్ని పోషిస్తున్నారు. మహిళలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు’’ అని గవర్నర్ అన్నారు. విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించారు. ఏపీలో సంక్షేమ పథకాలతో ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనని, మహిళల కోసం సీఎం జగన్ ఒక యజ్ఞం చేస్తున్నారని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మహిళల రక్షణ కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చారని వాసిరెడ్డి పద్మ అన్నారు. చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్ -
ఊరంతా బాగుండాలి.. అందులో నేనుండాలి! ఎమ్మే బీఈడీ చదివి ఇప్పుడిలా..
ఎమ్మే బీఈడీ చదివినా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ.. ఎకరం కౌలు పొలంలో 20 రకాలకుపైగా కూరగాయల సాగు.. గ్రామస్తులకు, స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనానికి కూరగాయలు సరఫరా.. తిరుపతి జిల్లా ఎస్బీఆర్ పురం వాసి కోనేటి శైలజ ఆదర్శ సేద్యం ఎమ్మే బీఈడీ చదివినా ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. తన కుటుంబంతో పాటు... గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఎకరం భూమిని లీజుకు తీసుకొని అందులో 20 రకాలకుపైగా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. పండించిన పంటను మార్కెట్లో విక్రయించకుండా... తన ఊర్లో వారికి, అంగన్వాడీ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కోనేటి శైలజ. శైలజ స్వస్థలం తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం గ్రామం. పుట్టినిల్లు.. మెట్టినిల్లు కూడా అదే ఊరు. అందరూ వ్యవసాయంపై ఆధారపడ్డవారే. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ, ప్రైవేటు కాలేజ్‌లో బీఈడీ పూర్తి చేశారు. వ్యవసాయదారుడు మాధవ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సొంత భూమిలో మామిడి తోట సాగులో ఉంది. ఏపీ రైతు సాధికార సంస్థ ప్రోత్సాహంతో శైలజ ప్రకృతి సేద్యంలో కూరగాయల సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోనే ఎకరం భూమిని లీజుకు తీసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో 20 రకాల కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చు రూ.13,500 చేశారు. శైలజ తోటలో కిలో పచ్చిమిర్చి రూ. 60, క్యారెట్, బీట్రూట్ రూ. 50, టొమాటో, వంగ, బెండ, గోరుచిక్కుడు, కాకర, అలసంద రూ. 40, ముల్లంగి (కట్ట) రూ.15, గోంగూర(కట్ట) రూ. 10 చొప్పున అమ్ముతున్నారు. మొన్నటి వరకు రూ.17,500 ఆదాయం వచ్చింది. ఏడాది పొడవునా రోజూ కూరగాయలను ప్రజలకు అందించాలన్నదే తన లక్ష్యమని శైలజ వివరించారు. మధ్యాహ్న భోజనంలో ఇవే కూరలు శైలజ పండించే కూరగాయలను గ్రామస్తులకే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ, ప్రాథమిక, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్నారు. ఘనజీవామృతం, ఆవు పేడ, పంచితం, మజ్జిగతో కషాయాలను తయారు చేసి పంటలకు ఉపయోగిస్తుండటాన్ని గ్రామస్తులు ఆసక్తిగా చూస్తుంటారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతు సాధికర సంస్థ సిబ్బంది, శైలజ, ఆమె భర్త మాధవ వర్మ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది కూరగాయలు కొంటున్నారు. అంగన్వాడీ పిల్లలు, స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే కూరగాయలు కూడా శైలజ పండిస్తున్నవే. ‘శైలజ పండించిన కూరగాయలను ధర కాస్త ఎక్కువైనా కొని వాడుతున్నా. పిల్లలు కూరలు రుచిగా ఉన్నాయని చెబుతుంటే సంతోషంగా ఉందంటున్నారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు పూర్ణ. గ్రామస్తులు, స్కూలు పిల్లల కోసమే! ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నేను పండించే కూరగాయలు తిని మా ఊరివాళ్లంతా ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. ప్రస్తుతం నేను పండించే కూరగాయలు మా ఊరి వాళ్లకే సరిపోతున్నాయి. గ్రామస్తులు, స్కూలు పిల్లల తరువాతే ఎవరికైనా. ఏడాది పొడవునా కూరగాయలు పండించి ఇవ్వాలన్నదే నా తపన. – కోనేటి శైలజ, (9912197746),ఎస్బీఆర్ పురం, వడమాలపేట మం., తిరుపతి జిల్లా కొసమెరుపు: గ్రామానికి చెందిన వెంకట్రామరాజు శైలజ పండించే కూరగాయలను కొనుగోలు చేసి చెన్నైలో ఉంటున్న తన కుమారుడు డాక్టర్ రామకృష్ణంరాజుకు వారానికి ఒక రోజు పంపుతుండటం మరో విశేషం. – తిరుమల రవిరెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి. ఫొటోలు: కేతారి మోహన్‌కృష్ణ నిర్వహణ: పంతంగి రాంబాబు చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా? -
వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసమేల?!
International Women's Day- BCCI- IPL 2023:భారత క్రికెట్ నియంత్రణ మండలి గత ఆర్నెళ్ల కాలంలో రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. లింగ వివక్షను రూపుమాపే క్రమంలో సరికొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టింది. మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు గొప్ప ముందడుగు వేసింది. అందులో మొదటిది.. మ్యాచ్ ఫీజులు.. అవును.. పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే ఫీజులు అసలు లెక్కలోకే రావు! దీంతో మిగతా రంగాల మాదిరే క్రికెట్లోనూ అమ్మాయిల పట్ల ఉన్న వివక్షను తొలగించాలని.. మ్యాచ్ ఫీజుల విషయంలో ఉన్న అంతరాన్ని తొలగించాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఇందుకు అనుగుణంగా గతేడాది అక్టోబరులో బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి భారత మహిళల జట్టు కాంట్రాక్ట్ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లిస్తామని అక్టోబరు 27న బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు బోర్డు తెలిపింది. మహిళా క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకువెళ్లేలా.. క్రికెటర్లుగా ఎదగాలని కోరుకునే అమ్మాయిల ఆశలకు ఊపిరిలూదుతూ బీసీసీఐ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చిన రోజును ‘రెడ్ లెటర్ డే’గా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తమైంది. సచిన్ టెండుల్కర్, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయంలోనూ తొలుత న్యూజిలాండే! మహిళా క్రికెట్లో తొలి టీ20 లీగ్‌ను ప్రవేశపెట్టింది న్యూజిలాండ్. వుమెన్స్ సూపర్ స్మాష్ పేరిట 2007 నుంచి నేటికీ లీగ్‌ను కొనసాగిస్తోంది. తర్వాత వెస్టిండీస్ ట్వంటీ20 బ్లేజ్ పేరుతో 2012 నుంచి లీగ్‌ను నిర్వహిస్తోంది. ఇక ఆస్ట్రేలియా.. విజయవంతమైన బిగ్‌బాష్ లీగ్(పురుషులు)లో మహిళా క్రికెటర్లను భాగం చేసేందుకు 2015లో వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. నాటి నుంచి నేటిదాకా ఈ టోర్నీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌లో చార్లెట్ ఎడ్వర్డ్స్ కప్(2021 నుంచి), భారత్‌లో వుమెన్స్ టీ20 చాలెంజ్(2018-2022), వెస్టిండీస్‌లో ట్వంటీ20 బ్లేజ్(2012-), వుమెన్స్ కరేబియన్ లీగ్(2022-), జింబాబ్వేలో వుమెన్స్ టీ20(2020), పాకిస్తాన్లో పీసీబీ ట్రయాంగులర్ ట్వంటీ20(2020), సౌతాఫ్రికాలో వుమెన్స్ టీ20 సూపర్‌లీగ్(2019-), శ్రీలంకలో వుమెన్స్ సూపర్ ప్రొవెన్షియల్ టీ20 టోర్నమెంట్(2019-).. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహిళా టీ20 లీగ్‌లు ఉన్నాయి. అయితే, ఇప్పటికే భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెస్, పూజా వస్త్రాకర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ తదితరులు పేరెన్నికగన్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆడారు. ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్ అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుష టీ20లీగ్‌లను తలదన్నేలా క్యాష్ రిచ్ లీగ్‌ను రూపొందించిన.. బీసీసీఐ కాస్త ఆలస్యంగానైనా వుమెన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా (దేశీ, విదేశీ) ఎంతో మంది పురుష క్రికెటర్లకు లైఫ్‌నిచ్చిన ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌ను నిర్వహించేందుకు సమాయత్తమైంది. మార్చి 4, 2023న ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ మ్యాచ్‌తో ఈ మహిళా ప్రీమియర్ లీగ్‌కు తెరలేచింది. ఇద్దరు భారత కెప్టెన్లు(హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబై), స్మృతి మంధాన), ముగ్గురు విదేశీ కెప్టెన్లు(మెగ్ లానింగ్, బెత్‌మూనీ, అలిసా హేలీ) ఈ లీగ్‌లో ఆయా జట్లను ముందుకు నడిపిస్తున్నారు. హర్షణీయమే కానీ.. కోట్లలో తేడా అంటే దారుణం! తొలుత మ్యాచ్ ఫీజుల విషయం.. ఇప్పుడు ఇలా టీ20 లీగ్.. మరి నిజంగానే భారత్‌లో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య అంతరాలు పూర్తిగా తొలగిపోయినట్లేనా? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఫీజుల విషయంలో సమానత్వాన్ని అమలు చేసేందుకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్న రెండో బోర్డుగా బీసీసీఐ ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కూడా వ్యత్యాసం కొనసాగుతున్న వేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, కాంట్రాక్టుల విషయంలో ఇంకా ఆ వ్యత్యాసం అలాగే ఉండిపోవడం, ఈ అంశంపై బీసీసీఐ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. చరిత్ర సృష్టించిన షఫాలీ సేన 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు.. ఇటీవలి ప్రపంచకప్‌లో సెమీస్ వరకు చేరింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన అండర్-19 మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్రకెక్కింది. యువ కెరటం షఫాలీ వర్మ సారథ్యంలో ఈ అద్భుతం జరిగింది. వాళ్లకు కోట్లు.. వీళ్లకు లక్షలు అయితే, బోర్డు ఇంతవరకు కాంట్రాక్ట్ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. పురుష క్రికెటర్లకు ఎ, బి, సి గ్రేడ్లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్ కేటగిరీలో రూ. 7 కోట్లు చెల్లించే బీసీసీఐ.. మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్‌కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు మాత్రమే ఇస్తోంది. పురుషుల క్రికెట్‌కు ఉన్న ఆదరణ, స్పాన్సర్లు, ప్రేక్షకులు, రేటింగ్‌లు, బ్రాండ్ వాల్యూ దృష్ట్యా వారికి అంతమొత్తం చెల్లిస్తున్నారన్న మాట కాదనలేని వాస్తవమే. ఆరు రెట్లు అధికం అయితే, ఇరువురి కాంట్రాక్టుల విషయంలో కోట్లల్లో వ్యత్యాసం ఉండటం మరీ దారుణం. ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐపై.. పురుషుల క్రికెట్ స్థాయికి చేరేలా మహిళా క్రికెట్‌ను మరింత ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. ఇక డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. ఐదు జట్లలో అత్యధికంగా ముగ్గురు విదేశీ కెప్టెన్లే! వేలంలో అత్యధిక 3.40 కోట్ల రూపాయలు. ఐపీఎల్ వేలంలో 18 కోట్ల పైచిలుకు ధర పలికే ఆటగాళ్ల కంటే దాదాపు ఆరు రెట్లు తక్కువ. ఒకవేళ లీగ్ భారీగా సక్సెస్ అయితే.. ఈ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ.. కాంట్రాక్ట్ విషయంలో మాత్రం బోర్డు తలచుకుంటేనే మహిళా క్రికెటర్ల భవితవ్యం మారుతుంది. ఆట మీద ప్రేమతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వాళ్లు ఆర్థికంగా మరింత నిలదొక్కుకునే ఆస్కారం ఉంటుంది. కూతుళ్లను క్రికెటర్లు చేయాలనుకునే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు సైతం కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ‘‘యా దేవి సర్వభూతేశు, శక్తి రూపేన సమస్థితా’’ అంటూ మహిళా శక్తిని చాటేలా గీతం రూపొందించిన బీసీసీఐ.. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఓ మ్యాచ్‌ను మైదానంలో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించిన బోర్డు.. వచ్చే ఏడాది తిరిగేలోపు కాంట్రాక్టుల విషయంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షిద్దాం!! -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్‌ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్ WPL 2023: రెండు ముంబై ఇండియన్స్ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
నేను తెలంగాణ బిడ్డనే.. వెలివేయకండి: పూనమ్ కౌర్ ఎమోషనల్
హీరోయిన్ పూనమ్ కౌర్.. సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయింది. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తరచూ ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టేజీపై కన్నీళ్లు పెట్టుకుంది. తనను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారంటూ ఎమోషనల్ అయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పూనమ్ కౌర్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన మతం ద్వారా తనను వేరు చేసి చూస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను తెలంగాణలోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. కానీ నేను పంజాబీని అని, సిక్కు అని మతం పేరుతో దూరం చేస్తున్నారు. నన్ను తెలంగాణ నుంచి దూరం చేయకండి. మతం పేరుతో నన్ను వెలివేయకండి. నేను తెలంగాణ బిడ్డనే’అంటూ పూనమ్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నేను తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ కంటతడి..#Poonamkaur#telangana #RajBhavan #poonamKaurCryingpic.twitter.com/gwagW0ipNE — yousaytv (@yousaytv) March 7, 2023 -
ఆరోగ్యం మన మిద్దె తోటలోనే ఉంది! క్యాన్సర్‌ను జయించి..
ఆరోగ్యం ఆసుపత్రిలో లేదు. మన మిద్దె తోటలోనే ఉంది. మన తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను రసాయనాల్లేకుండా మనమే ఇంటిపైన పండించుకుందాం. నలుగురం చేయీ చేయీ కలిపి మిద్దె తోటలు సాగు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం.. అని చెప్పటమే కాదు.. మనసా వాచా కర్మణా ఆచరిస్తున్నారు కొల్లి కృష్ణకుమారి. గుంటూరు ఎన్జీవో కాలనీకి చెందిన బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగిని అయిన ఆమె 2020 జనవరి నుంచి 1400 చ.అ.ల మిద్దె తోట సాగు చేస్తున్నారు. ఉల్లి, వెల్లుల్లి, క్యారెట్ తప్ప మిగతావన్నీ దాదాపు రోజూ తమ ఇంటిపైన పండించుకున్నవే తింటున్నారు. క్యాన్సర్‌ను జయించిన ఆమె ఉద్యోగవిరమణ తర్వాత ఉద్యమ స్ఫూర్తితో సేంద్రియ మిద్దెతోటలను విస్తరింపజేస్తున్నారు. సంఘ బలం.. ఉత్సాహం.. రిటైరైన ఉద్యోగులు, పెద్దవాళ్లు (సెకండ్ యూత్) కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచడం హాబీగా మార్చుకుంటున్నారు. సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సంస్కృతిని వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో సంఘాలు కూడా ఏర్పాటవుతున్నాయి. మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు సహా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ మిద్దెతోటల పెంపకందారుల సంఘాలు ఏర్పాటయ్యాయి. ‘గుంటూరు మిద్దెతోటలు’ పేరుతో ఏర్పాటు చేసిన రెండు వాట్సప్ గ్రూప్‌లలో 659 మందికి పైగా ఉన్నారు. 2021 నుంచి గుంటూరులో మిద్దె తోటల కార్యకలాపాలను కృష్ణకుమారి నేతృత్వంలో వలంటీర్ల బృందం అత్యంత క్రియాశీలంగా నిర్వహిస్తుండటం విశేషం. ఉద్యానవన శాఖ అధికారుల సహకారంతో ప్రతి నెలా అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు మిద్దెతోటలు పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. ‘గుంటూరు మిద్దె తోటల పెంపకందారుల సంక్షేమ సంఘం(జి.ఎం.ఎస్.ఎస్.)’ లాభాపేక్షలేని సంస్థగా రిజిస్టర్ అయ్యింది. కృష్ణకుమారి ఆమె అధ్యక్షురాలిగా, మరికొందరు ఉత్సాహవంతులైన విశ్రాంత బ్యాంకు అధికారులు, వైద్యులతో కూడిన కార్యవర్గం ఏర్పాటైంది. సంఘ వార్షిక సభ్యత్వ రుసుము రూ. 500. నెలవారీగా సమావేశమవుతూ వారికి కావాల్సిన మొక్కలను కడియం, కుప్పం నర్సరీల నుంచి తెప్పించి సభ్యులకు అందిస్తున్నారు. సంఘం జమాఖర్చులపై ఆడిటింగ్ నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తుండటం ప్రశంసనీయం. ఉత్సాహంగా వాలంటీర్ల సేవలు సాధారణ మొక్కలతో పోల్చితే ఎన్నో రెట్లు ఎక్కువ దిగుబడినిచ్చే గ్రాఫ్టెడ్ మొక్కల అవసరం మేడపైన కుండీలు, మడుల్లో తక్కువ స్థలాల్లో కూరగాయలు పెంచుకునే వారికి ఎంతో ఉందంటారు కృష్ణకుమారి. అడవి వంగతో అంటుకట్టిన(గ్రాఫ్ట్ చేసిన) వంగ, టమాటో, మిరప, సొర మొక్కలతో పాటు పర్పుల్ క్యాబేజి, ఎర్రబెండ, ఎల్లో/పర్పుల్ కాలిఫ్లవర్ వంటి అరుదైన, నాణ్యమైన మొక్కలను నర్సరీల నుంచి తెప్పించి మిద్దెతోట పెంపకందారులకు మూడింట ఒక వంతు ధరకే అందిస్తున్నారు. కృష్ణకుమారి, వలంటీర్ల బృందం సఫలీకృతమయ్యారు. గూగుల్ ఫామ్స్, ఎక్సెల్ షీట్ ద్వారా సభ్యులకు కావాల్సిన మొక్కల ఆర్డర్ తీసుకొని మొక్కలను తెప్పిస్తున్నారు. సభ్యులందరికీ ముద్రిత ఫొటో గుర్తింపు కార్డులు ఇచ్చారు. 50 మంది వాలంటీర్లు ఉత్సాహంగా సేవలందిస్తుండటం వల్ల సంఘాన్ని చురుగ్గా నిర్వహించ గలుగుతూ ఉన్నామని కృష్ణకుమారి చెప్పారు. గత రెండేళ్లలో మిరప రైతులు పురుగుమందులను చాలా ఎక్కువగా వాడాల్సి వస్తోందని అంటూ.. రైతులను తప్పుపట్టలేమని, వినియోగదారులుగా మన జాగ్రత్తలో మనం ఉండాలని, వీలైనన్ని కూరగాయలను మనమే పండించుకోవాలని కృష్ణకుమారి(94906 02366) అంటున్నారు. – దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఫోటోలు: గజ్జల రామగోపాలరెడ్డి నిర్వహణ: పంతంగి రాంబాబు చదవండి: ఎకరం భూమి ఉందా? మేకలు, కోళ్లు, ముత్యాలు, పుట్టగొడుగులు.. ఇలా చేస్తే రోజుకు రూ. 1500 ఆదాయం.. ఇంకా.. పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే.. -
WPL 2023 GG Vs RCB: స్పెషల్ డే.. ‘స్పెషల్ మ్యాచ్’.. అందరికి ఎంట్రీ ఫ్రీ
WPL 2023- International Women's Day 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బంపరాఫర్ ఇచ్చింది. వుమెన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా మార్చి 8 నాటి మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ టీమ్ మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. అందరికీ ఉచిత ప్రవేశం మహిళా దినోత్సవ కానుకగా ఈ ఆసక్తికర పోరును నేరుగా చూసేందుకు వీలు కల్పించారు నిర్వాహకులు. ఈ మేరకు.. ‘‘మహిళా దినోత్సవాన్ని మేము ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం. మార్చి 8, 2023న టాటా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ వీక్షించేందుకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ముంబై- ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా స్క్రీన్ మీద ఈ మేరకు ప్రకటన చేసిన నిర్వాహకులు.. సోషల్ మీడియా వేదికగా మరోసారి ఈ శుభవార్తను పంచుకున్నారు. దీంతో బీసీసీఐపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టిక్కెట్లు ఉచితంగా ఇవ్వడం కంటే కూడా మహిళా క్రికెటర్లకు సమున్నత గౌరవం కల్పిస్తున్న తీరుకు ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా స్టేడియం పరిమితికి తగ్గట్లు కొన్ని షరతులతో ఫ్రీగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ముంబై టాప్ భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బీసీసీఐ మహిళా ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 4న ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ మ్యాచ్‌తో లీగ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన గుజరాత్‌పై 143 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ తలపడగా.. లానింగ్ బృందం 60 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. స్పెషల్ డే.. స్పెషల్ మ్యాచ్ మూడో మ్యాచ్‌లో గుజరాత్- యూపీ వారియర్స్ పోటీ పడగా.. యూపీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక నాలుగో మ్యాచ్ ముంబై- ఆర్సీబీ మధ్య జరుగగా.. స్మృతి మంధాన సేనకు ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవం ఎదురైంది. ఇక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరుగగా.. ముంబై రెండింటిలో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంతవరకు రెండేసి మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనూ ఓడిన గుజరాత్- ఆర్సీబీ మార్చి 8న గెలుపు కోసం పోటీపడనున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన రోజున మరి విజయం ఎవరిని వరిస్తుందో!! చదవండి: WPL 2023: ఆర్సీబీ రాత ఇంతేనా.. మహిళల ఐపీఎల్‌లోనూ నిరాశ తప్పదా..? PSL 2023: మార్టిన్ గప్తిల్ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో.. View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
International Womens Day: మహిళల హైరింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
ముంబై: దేశీయంగా ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతోంది. కంపెనీల్లో వైట్ కాలర్ ఉద్యోగాల్లో (ఆఫీసుల్లో చేసే) మహిళల రిక్రూట్మెంట్కు సంబంధించి గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో డిమాండ్ 35 శాతం పెరిగింది. జాబ్ ప్లాట్‌ఫామ్ ఫౌండిట్ (గతంలో మాన్స్టర్ ఏపీఏసీ, ఎంఈ) తమ పోర్టల్‌లో నమోదైన హైరింగ్ గణాంకాల ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే దిశగా.. నెలసరి, శిశు సంరక్షణ తదితర సందర్భాల కోసం ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం, కార్యాలయాల్లో పక్షపాత ధోరణులను నిరోధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలాంటి అంశాలపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. అలాగే పని విషయంలో వెసులుబాటు కల్పించడం వంటివి చేస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు డిమాండ్‌పరంగా చూస్తే ఐటీఈఎస్/బీపీవో రంగంలో అత్యధికంగా 36 శాతం, ఐటీ/కంప్యూటర్స్–సాఫ్ట్వేర్ (35%), బ్యాంకింగ్/అకౌంటింగ్/ఆర్థిక సర్వీసులు (22%)గా ఉంది. -
International Womens Day: అవగాహన ఉన్నా వినియోగం కొంతే..
ముంబై: ఆర్థిక సేవలపై మహిళలకు అవగాహన పెరుగుతున్నప్పటికీ వారు వాటిని వినియోగించుకోవడం తక్కువగానే ఉంటోంది. బీమా తదితర సాధనాల గురించి మూడో వంతు మందికి తెలిసినా కూడా డిజిటల్ విధానంలో కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్క శాతం కూడా ఉండటం లేదు. రిజర్వ్ బ్యాంక్‌లో భాగమైన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, డిజిటల్ చెల్లింపుల నెట్వర్క్ పేనియర్‌బై నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మహిళల్లో .. ముఖ్యంగా 18–35 ఏళ్ల వారిలో బీమాపై అవగాహన గతేడాది 29 శాతం మేర పెరిగింది. కానీ పాలసీల వినియోగం 1 శాతానికి లోపే ఉంది. మహిళలు ఎక్కువగా జీవిత బీమా, ఆరోగ్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. 5,000 రిటైల్ స్టోర్స్‌లో ఆర్థిక సేవలను వినియోగించుకున్న ఈ వయస్సు గ్రూప్ మహిళలపై నిర్వహించిన సర్వే ద్వారా అధ్యయన నివేదిక రూపొందింది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు.. ► రిటైల్ స్టోర్స్‌లో మహిళలు ఎక్కువగా నగదు విత్‌డ్రాయల్, మొబైల్ రీచార్జీలు, బిల్లుల చెల్లింపుల సర్వీసులను వినియోగించుకుంటున్నారు. ఇతర త్రా పాన్ కార్డు దరఖాస్తులు, వినోదం, ప్రయాణాలు, ఈ–కామర్స్ మొదలైన వాటి సంబంధిత లావాదేవీలూ చేస్తున్నారు. ► తమ పిల్లలకు మంచి చదువు ఇవ్వడానికి అత్యధిక శాతం మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు పొదుపే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు 68% మంది తెలిపారు. ఇక అత్యవసర వైద్యం, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కొనుగోలు కోసం పొదుపు చేసుకోవడమూ యవారికి ప్రాధాన్యతాంశాలు. ► నగదు లావాదేవీలను తగ్గించడానికి ప్రభుత్వం, ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా చాలా మంది మహిళలు నగదు రూపంలో లావాదేవీలు జరపడానికే ప్రాధాన్యమిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 48 శాతం మంది నగదువైపే మొగ్గు చూపారు. నగదు విత్‌డ్రాయల్ సర్వీసుల కోసమే రిటైల్ స్టోర్‌ను సందర్శిస్తామంటూ 78 శాతం మంది తెలిపారు. ► అయితే, అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ వినియోగమూ పెరుగుతోంది. 5–20% మంది మహిళలు దీనిని ఎంచుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం దాదాపు శూన్యమే. ► డిజిటల్ మాధ్యమం వినియోగం.. 18–40 ఏళ్ల గ్రూప్ మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. వారిలో 60%మందికి పైగా మహిళలకు స్మార్ట్ఫోన్లు, వాటి ద్వారా డిజిటల్ కంటెంట్ అందుబాటులో ఉంటోంది. -
InternationalWomen's Day 2023: మహిళల నిజాయితీపై సంచలన రిపోర్ట్
సాక్షి,ముంబై: రుణాలు చెల్లింపులో మహిళలే ముందు ఉన్నారని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రుణాలను తిరిగి చెల్లించడంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ నిజాయితీగా ఉన్నారని క్రెడిట్ డేటా సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజా నివేదిక వెల్లడించింది. స్త్రీలకు రుణాలు ఇవ్వడం పురుషుల కంటే తక్కువ ప్రమాదకరమని ఈ డేటా వెల్లడించింది. అందుకే గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య బాగా పెరిగిందని వ్యాఖ్యానించింది. ప్రతి ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన నివేదికను ప్రకటిస్తుంది తన రుణ చెల్లింపుపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో భారతదేశంలోని స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ మనస్సాక్షిగా ఉంటారని వెల్లడించింది. గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య పెరగడానికి వారి మరింత నిజాయితీగా తిరిగి చెల్లించే ప్రవర్తనే కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో భారతదేశంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య వార్షిక రేటు 15 శాతం పెరిగింది, పురుషులతో పోలిస్తే ఇది 11 శాతం. 2017లో 25 శాతం మంది మహిళలు రుణాలు తీసుకోగా, 2022లో ఈ సంఖ్య 28 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది ఈ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం, దేశీయ అంచనా జనాభా 1.4 బిలియన్లలో దాదాపు 454 మిలియన్ల వయోజన మహిళలు ఉన్నారు. వీరిలో 2022 వరకు దాదాపు 6.3 కోట్ల మంది మహిళలు రుణాలు తీసుకున్నారు. మహిళలకు రుణ సదుపాయం 2017లో 7 శాతంగా ఉంది, ఇది 2022లో 14 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు సాధించిన పురోగతి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఇంకా మెరుగు పడాల్సి ఉందనికూడా తెలిపింది. మహిళా రుణగ్రహీతల సంఖ్య పెరగడం ప్రభుత్వ ఆర్థిక సమ్మేళనానికి సానుకూల సంకేతమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ అభిప్రాయపడ్డారు. వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలు, ఏజ్ గ్రూపులు,, భౌగోళిక ప్రాంతాలలో మహిళలకు అనుగుణంగా రుణాలను అందించడం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుందని కూడా ఆమె సూచిస్తున్నారు. దీని వల్ల మహిళలకే కాకుండా సంప్రదాయంగా వెనుకబడిన రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. -
International women's day 2023: ‘ఆమె’ కోసం ఇలా చేస్తే రూ. 25 లక్షలు మీ సొంతం!
ఆడబిడ్డల పుట్టుకే ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో వారికి ఆర్థిక సమానత్వం, స్వేచ్ఛను ఇచ్చి ఆత్మగౌరవంతో ఎదిగేలా చేయడం చాలా అవసరం. తద్వారా అమ్మాయిలను చిన్న చూపు చూడకుండా, వారిని ఆర్థిక భారంగా భావించకుండా, భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రయోజనాలందేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ ఉద్దేశంతో వచ్చిందే ‘సుకన్య సమృద్ధి యోజన’. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక పథకం, ప్రయోజనాల గురించి మాట్లాడుకోవడం ఉత్తమం. కేంద్రం ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం,రక్షణ కోసం తీసుకొచ్చిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం బేటీ బచావో, బేటీ పఢావో. ఇందులో భాగంగా తీసుకొచ్చిన పొదుపు పథకమే సుకన్య సమృద్ధి యోజన. స్పెషల్‌గా అమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అందించారు. సుకన్య సమృద్ధి యోజన (SSY) 2015లో ప్రారంభించింది ప్రభుత్వం. దీని సాయంతో తల్లిదండ్రులు తమ ఆడపిల్ల కోసం అధీకృత వాణిజ్య బ్యాంకు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలకు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ ఆదాయం లభించనుంది. ఈ ఆదాయాన్ని మనం పెట్టిన పెట్టుబడి , వ్యవధి ఆధారంగా లెక్కిస్తారు. సుకన్య సమృద్ధి యోజన - అర్హత అమ్మాయి తప్పనిసరిగా భారతీయురాలై ఉండాలి అమ్మాయికి పదేళ్లకు మించి ఉండకూడదు సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఒక కుటుంబానికి ఇద్దరు కుమార్తెలకు మాత్రమే అవకాశం సుకన్య సమృద్ధి యోజనకు అర్హత పొందిన తర్వాత అవసరమైన పెట్టుబడి మొత్తాన్ని కాలిక్యులేటర్లో నమోదు చేయాలి. ఈ పథకంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల దాకా పెట్టుబడి పెట్టవచ్చు. అంటేకేవలం రూ.250తో సుకన్య ఖాతాను ఓపెన్ చేయవచ్చు. అలాగే గరిష్టంగా నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేయొచ్చు. అకౌంట్ తెరవొచ్చు. ఈ ఖాతా తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్లాలి. తర్వాత డబ్బులు కట్టాల్సిన పని లేదు. మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అయితే 18 ఏళ్లు వచ్చిన తర్వాత పాక్షికంగా కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి నగదు మన సొంతం అవుతుంది. ఇంతకు ముందు కనీస పెట్టుబడి రూ.1,000గా ఉండేది. అయితే, భారత ప్రభుత్వం జూలై 2018లో దీన్ని రూ.250కి తగ్గించడం గమనార్హం. ఉదాహరణకు, 10 సంవత్సరాలకు 7.6శాతం వడ్డీ రేటుతో నెలకు రూ. 8,333 (సుమారుగా) చొప్పున ఏడాదికి లక్షరూపాయల పెట్టుబడి పెట్టారనుకుందాం. మీకు వడ్డీతో కలిపి రూ.15,29,458లు చేతికి అందుతాయన్న మాట. అదే నెలకు రూ. 5 వేలు చొప్పున 21 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలకు పైగా (రూ.25,59,142) వస్తాయి. అలాగే నెలకు 8 వేల రూపాయల చొప్పున 21 ఏళ్లు పెట్టుబడి పెడితే వచ్చే మెచ్యూరిటీ రూ. 40,94,627లు. అయితే ఈ వడ్డీరేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తూ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్‌లో చేరేందుకవసరమైన డాక్యుమెంట్లు పాన్ కార్డు ఆధార్ కార్డు పాప ఫోటోలు పాప ఆధార్ కార్డు పాప బర్త్ సర్టిఫికెట్ పన్ను మినహాయింపు సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. ఈ విమెన్స్ డే సందర్భంగా మీ ముద్దుల తనయ కోసం ఎంతో కొంత పెట్టుబడిని మొదలు పెట్టండి. బంగారు భవిష్యత్తును ఆమెకు కానుకగా ఇవ్వండి! -
కదిలించే కావ్యం మహిళ
సృష్టిలో ఒక గొప్ప సృష్టి మహిళ. మహిళ గొప్పతనం గురించి గొప్పవాళ్లు ఎందరో ఎంతో గొప్పగా చెప్పారు. ఆ చెప్పినది అంతా మహిళ గొప్పతనానికి ఎంతమాత్రమూ న్యాయం చెయ్యలేదు, సరితూగలేదు. మహిళ గొప్పతనం గురించి ఎవ్వరూ గొప్పగా కాదుకదా తగినట్లుగా కూడా చెప్పలేదేమో? చెప్పలేరేమో?! అమ్మ అయింది, తోబుట్టువు ఆయింది, ఆలి అయింది; అడుగడుగునా మనతోడై నిలిచింది మహిళ. అనురాగం ఆప్యాయతల కలబోత అయిన మహిళ ఆనందానికి ఆలయం తానై వెలిసింది. మన ఉనికికి మూలం, మనుగడకు ఆలవాలం మహిళ. మూగిన జీవనచీకటిలో కాంతి మహిళ. మానవ బంధాలను, సంబంధాలను కలుపుతూ కదిలే కావ్యం మహిళ. మనల్ని కదిలించే కావ్యం మహిళ. మానవ జీవితకథకు ఇతివృత్తం మహిళ; మానవ జీవనకథనానికి గమనం మహిళ. మానవచరిత్రకు ఆత్మ మహిళ. అత్యుదాత్తతకు ఆకృతి మహిళ. తత్త్వంపరంగానూ, వ్యక్తిత్వంపరంగానూ, ప్రవర్తనపరంగానూ మహిళ ఎంతో విశిష్టమైంది. ‘మహిళ ఒకదాన్ని స్వీకరిస్తుంది ఆపై దాంతో సృజన చేస్తుంది; ఆ సృజన సూత్రం విశ్వంలోనే అత్యంత అద్భుతమైంది’ అని చైనీస్ తత్త్వవేత్త, కవి జుషి వందలయేళ్ల క్రితమే చెప్పా రు. ‘సారంలేని ఈ లోకంలో సారాన్ని ఇచ్చేది మహిళ అని తెలుసుకునే కాబోలు శివుడు తన అర్ధశరీరాన్ని మహిళకు ఇచ్చాడు’ అని ఒక పూర్వ సంస్కృతశ్లోకం మనకు చెబుతోంది. మనవాళ్లు మహిళకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు; మహిళకు ప్రశస్తమైన స్థానాన్ని ఇచ్చారు. వేదంలో ఒక వధువు, వరుడితో ‘‘నేను ఋక్ (సాహిత్యం), నువ్వు సామం (గానం)’’ అని అంటుంది. గానానికి సాహిత్యంలాగా మగవాడికి మహిళ ముఖ్యం. మహిళను సాహిత్యం అనడమే ఆమె గొప్పతనాన్ని చాటుతోంది. సాహిత్యం మనసుల్నీ, మస్తిష్కాల్నీ కదిలిస్తుంది. మహిళ కూడా అంతే. మన భారతదేశంలోని ఋషులలో రోమశ, లోపా ముద్ర, గార్గి, మైత్రేయి, అదితి, విశ్వనార, స్వస్తి, శశ్వతి, సూర్య, ఇంద్రాణి, శుచి, ఆపరి, ఉశన, గౌరివీతి, చైలకి, జయ, ్రపా దురాక్షి, మేధ, రమ్యాక్షి, లౌగాక్షి, వారుని, విదర్భి, విశ్వనార, వృష , సర్పరాజ్ఞి, సునీతి, హైమ ఇంకా కొందరు మహిళలు ఉండేవారు. కొన్ని మంత్రాలకు ఋషులైన మహిళలు ద్రష్టలు. వేదంలో ఒక మహిళ ‘‘నేను శిరస్సును, నేను జెండాను, నేను నిప్పుల మాటలు పలుకుతాను. నా భర్త నన్ను అనుసరించనీ’’ అంటుంది. ఈ మాటల్నిబట్టి వేదకాలంలో మహిళకు స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం నిండుగా ఉండేవని, మహిళకు విశేషమైన, ప్రత్యేకమైన స్థానాలు ఉండేవని తెలియవస్తోంది. ‘సమాజానికి, కుటుంబానికి మహిళ రక్షకురాలిగా వ్యవహరించాలి’ అనీ, ‘మహిళలు యుద్ధంలో పా ల్గొనాలి’ అనీ చెప్పిన వేదం ‘భర్తకు సంపా దించే మార్గాలు నేర్పించు’ అనీ మహిళకు చెబుతూ ఆమె ఆవశ్యకతను మనకు తెలియజేస్తోంది. ‘అదిశక్తి అంటూ శక్తి అంటే మహిళే అని మనకు తెలియ చెప్పడం జరిగింది. ‘శివుడు శక్తితో కలిస్తేనే జగత్తును సృష్టించే శక్తి కలవాడు అవుతాడు’ అని ఆదిశంకరులు సౌందర్యలహరిలో తెలియజెప్పా రు. మహిళ లేకపోతే శక్తే లేదు. మహిపై దేవుడి మహిమ వెల్లివిరిసింది, అది మహిళ అయింది. వ్యాఖ్యానించబడలేని ఔన్నత్యం ఒక మూర్తిమత్వాన్ని పొందింది; అదే మహిళ. మహిళను సరిగ్గా అర్థం చేసుకోవడం, సరిగ్గా గౌరవించడం మనం నేర్చుకోవాలి. సరైన మహిళకు సాటి సరైన మహిళతత్త్వమే. సరైన మహిళ లేదా సరైన మహిళతత్త్వం ప్రేరణ, స్ఫూర్తి కాగా మనం సరైన మనుగడ చెయ్యాలి. – రోచిష్మాన్ -
యాప్‌లతో సేఫ్టీకి భరోసా!
అడ్వాన్స్డ్ ఎరాలో ఉన్నాం.. మీట నొక్కే వేగంలో పనులు అయిపోతున్నాయి.. అయినా స్త్రీకి సంబంధించిన విషయంలో సమాజపు ఆలోచనలే ఇంకా ప్రగతి పంథా పట్టలేదు! అందుకే ఇప్పటికీ ఆమెకు భద్రత లేదు! ఆమె సేఫ్టీకి సాంకేతికత యాప్‌ల ద్వారా ఇస్తున్న భరోసా మనసావాచాకర్మణా సమాజం ఇవ్వడం లేదు! ఆ స్పృహను సాధించే వరకు.. మహిళ ఆ సేఫ్టీ యాప్‌లనే నమ్ముకోక తప్పదు!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యూఎన్ఓ ఈ ఏడాది ప్రకటించిన థీమ్.. డిజిటాల్: ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ (DigtALL: Innovation and technology for gender equality). . అవును ఏ ఆవిష్కరణ అయినా.. సాంకేతికతైనా స్త్రీ, పురుష సమానత్వాన్నే చాటాలి. ఈ సమానత్వ పోరు నేటిది కాదు.. దాదాపు 115 ఏళ్ల నాటిది. నాడు అమెరికాలో గార్మెంట్ ఇండస్ట్రీలో ప్రమాదరకమైన పని పరిస్థితులు.. స్త్రీల పట్ల వివక్ష.. అసమాన వేతనాలు వంటి విషయాల్లో మార్పు కోసం మహిళల సమ్మెతో మొదలైన పోరాటం.. అన్ని రంగాల్లో.. అన్ని విషయాల్లో జెండర్ ఈక్వాలిటీ దిశగా ఇంకా కొనసాగుతూనే ఉంది. శతాబ్దం మారింది.. అయినా సమానత్వ సాధన కోసం ఇంకా థీమ్స్‌ను సెట్ చేసుకునే దశ, దిశలోనే ఉన్నాం. ‘కాలం మారింది.. ఇప్పుడు అన్ని రంగాల్లో స్త్రీలు కనపడుతున్నారు.. వినపడుతున్నారు కదా!’ అని మనకు అనిపించినప్పుడల్లా.. ఒక్కసారి స్త్రీల మీద జరుగుతున్న క్రైమ్ రికార్డ్స్‌ను ముందేసుకుందాం! అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు కదా అని ఎత్తుకున్న తల దించేసుకుంటుంది. స్వేచ్ఛ ఉంటేనే సమానత్వం సిద్ధిస్తుంది. భద్రత ఉంటేనే ఆ స్వేచ్ఛకు అర్థం ఉంటుంది. ఇంట్లో హింస.. బయట హింస.. ఆఖరకు ఆడపిల్ల తల్లి గర్భంలో ఉన్నా హింసే. ఈ వాక్యాలు రొడ్డకొట్టుడులా అనిపిస్తున్నాయి. అంటే పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదనే కదా! అందుకే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ సాధించాలంటే ముందు ఆడపిల్ల సురక్షితంగా ఉండాలి. ఇంటా.. బయటా బేఫికర్‌గా మసలగలగాలి! పోలీసులు, చట్టాలు ఉన్నాయి కదా అని తట్టొచ్చు! ‘నాకు సేఫ్టీ లేదు.. భయంగా ఉంది’ అని అమ్మాయి చెబితేనే కదా.. పోలీసులు స్పందించేది. ఆ అభద్రతను రిజిస్టర్ చేస్తేనే కదా.. రక్షణ చట్టాలు వచ్చేవి. ఇదంతా జరగాలంటే సమాజంలో అవగాహన రావాలి. అమ్మాయిలను చూసే తీరు.. వాళ్లతో ప్రవర్తించే పద్ధతులు మారాలి. వాళ్ల పట్ల మర్యాద పెరగాలి. వీటన్నిటికీ మగపిల్లలకు జెండర్ సెన్సిటివిటీ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో.. తనున్న పరిస్థితి పట్ల ఎరుక.. దాన్నుంచి బయటపడే చొరవ అమ్మాయిలకూ అంతే అవసరం. ముందు తన చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గుర్తించే ధైర్యం.. తెగువ చేయాలి. అందుకు ఇప్పుడు సాంకేతికత బోలెడంత సాయాన్ని అందిస్తోంది. యాప్‌ల రూపంలో! అలా ఫోన్లో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాల్సిన విమెన్ సెక్యూరిటీ యాప్‌లు కొన్ని ఇక్కడ.. దిశ ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్ రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్. ఫోన్లో యాప్‌ను ఓపెన్‌చేసి.. మూడుసార్లు షేక్ చేయగానే ఫోన్లోని జీపీఎస్ యాక్టివేట్ అయ్యి.. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లు, డ్యూటీలో ఉన్న పోలీసులను అలర్ట్ చేస్తుంది లొకేషన్‌ను పంపించి. ఒకవేళ ఫోన్ షేక్ చేయకుండా యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కినా.. మీ సమాచారం మీరున్న ప్రాంతానికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్లు, ఆన్ డ్యూటీ పోలీసులకు చేరుతుంది. వెంటనే సహాయ సిబ్బంది మీ దగ్గరకు చేరుకుంటారు. ఈ యాప్ సహాయంతో 100 నంబర్, లేదా ఈ యాప్‌లో ఉన్న ఇతర హెల్ప్ లైన్ నంబర్స్కూ కాల్ చేయవచ్చు. ఈ యాప్ ప్రమాదస్థలికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ల వివరాలనే కాక.. ఇతర సేఫ్టీ ప్లేసెస్, ఆసుపత్రులు, ఇతర హెల్ప్‌లైన్ నంబర్లనూ అందిస్తోంది. విమెన్ సేఫ్టీ (Women Safety) ఈ యాప్‌లోని బటన్‌ను ఒక్కసారి తడితే చాలు.. మీరు ప్రమాదంలో చిక్కుకున్న సంగతి.. లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్ సహా మీ ఫోన్లో మీరు ఫీడ్ చేసుకున్న ఎమర్జెన్సీ నంబర్లకు చేరిపోతుంది. ఇందులోని బటన్లు మూడు రంగుల్లో ఉంటాయి. అంటే మీరున్న పరిస్థితి తీవ్రతను బట్టి ఆయా రంగుల్లో ఉన్న బటన్స్‌ను నొక్కాలి. షీ టీమ్స్ మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్రం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ వింగ్ 2014లో ప్రారంభమైంది. తొలుత హైదరాబాద్‌లోని సైబరాబాద్ పరిధికే వీరి సేవలు పరిమితమైనా.. తర్వాత ఏడాదికి అంటే 2015కల్లా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా 331 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. 112 యాప్ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆల్ ఇన్ వన్ యాప్ ఇది. ఉపయోగించడం చాలా తేలిక. ప్రమాదంలో ఉన్నప్పుడు.. ఈ యాప్‌ను సింగిల్ ట్యాప్ చేస్తే చాలు.. మీరున్న డేంజర్ సిచ్యుయేషన్‌కు సంబంధించి అలారమ్ మోగుతుంది. తక్షణమే సహాయక చర్యల సిబ్బందీ స్పందిస్తారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ఫోన్లకూ సెట్ అవుతుంది. ఈ 112 యాప్ మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తుంది. కీ ఫీచర్స్ ఏంటంటే.. ఎమర్జెన్సీ అలారమ్‌ను పంపించేందుకు ఇందులో ఆడియో/విజువల్ మీడియా ఉంటుంది. 24 గంటలూ ఈ యాప్ ద్వారా భద్రతా సేవలు పొందవచ్చు. అదనంగా.. సంఘటనల విచారణలోనూ తనవంతు సాయం అందిస్తుంది. మై సేఫ్టీపిన్ (My SafetyPin) డేటా మాపింగ్ టెక్నిక్స్ సాయంతో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు సేఫ్‌గా ఫీలయ్యేందుకు సాయపడుతుందీ అప్లికేషన్. వెలుతురు, వైశాల్యం, సెక్యూరిటీ గార్డ్స్, కాలిబాట, ప్రజా రవాణా వ్యవస్థ, జెండర్ యూసేజ్, భావోద్వేగాలు.. మొదలైన తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌ను రూపొందించారు. ఒకవేళ మీరు రాంగ్రూట్ని ఎంచుకున్నా ఇది వెంటనే మీ కుటుంబ సభ్యులను అలర్ట్ చేస్తుంది. భద్రమైన దారిని ఎంచుకునేందుకు మీకు తోడ్పడుతుంది. మీరు తప్పిదారి అంత భద్రతలేని ప్రాంతంలోకి వెళ్లినా.. ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. సెర్చింగ్‌లో మీ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు.. ఇతర సౌకర్యాల గురించీ మీకు సమాచారం ఇస్తుంది. దేశంలోని నగరాలను సురక్షిత నగరాలుగా మార్చడమే ‘మై సేఫ్టీపిన్’ లక్ష్యం. షీరోస్ ఇప్పుడున్న లీడింగ్ విమెన్ యాప్స్‌లో యూనిక్ యాప్ ఇది. మహిళల భద్రతకు సంబంధించే కాదు కెరీర్ గైడెన్స్, ఫ్రీ హెల్ప్ లైన్, రెసిపీలు మొదలు బ్యూటీ టిప్స్, ఇంట్లో ఉండే పనిచేసుకునే ఉపాధి అవకాశాల నుంచి కొత్త కొత్త పరిచయాలు, ఉచిత న్యాయ సలహాల వరకు మహిళలకు అవసరమైన చాలా అంశాల్లో ఈ యాప్ సహాయమందిస్తుంది. మీ నెలసరినీ ట్రాక్ చేస్తూ సూచనలిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది దీని గోప్యత, భద్రత. మీ ఫొటోలు, వీడియోలు మొదలు మీ వ్యక్తిగత సమాచారాన్నంత గోప్యంగా.. భద్రంగా ఉంచుతుంది. దీని సేవలను ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్.. రెండు ఫోన్లలోనూ పొందవచ్చు. స్మార్ట్ 24 గీ సెవెన్ ( స్మార్ట్ 24 X7) దీనితో ఇరవైనాలుగు గంటల కస్టమర్ సర్వీస్ సెంటర్‌తో సపోర్ట్ పొందవచ్చు. ఇది ఇటు యాపిల్ అటు ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్ అవుతుంది. ఆపదలో ఉన్న మహిళలు తమ దీని ద్వారా ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు చుట్టుపక్కలనున్న ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, అంబులెన్స్ సర్వీసెస్‌కూ పంపిచవచ్చు. వాటి సహాయం పొందవచ్చు.ఆపదలో ఉన్న వాళ్లు బటన్ నొక్కగానే ఆ ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్లు సేవ్ చేసుకున్న అయిదు ఎమర్జెన్సీ నంబర్లకు క్షణాల్లో సమాచారం వెళ్తుంది. ఒకవేళ జీపీఆర్ఎస్ అందుబాటులో లేకపోతే.. ఎస్మ్మెస్లు వెళ్తాయి. స్మార్ట్ 24 ఇంటూ సెవెన్ కస్టమర్ కేర్ సెంటర్ వాళ్లూ వెంటనే కాల్ చేస్తారు. బీసేఫ్ (bSafe) మహిళల మీద జరుగుతున్న హింస, లైంగిక వేధింపులు, లైంగిక దాడులను నివారించడమే కాక దురదృష్టవశాత్తు ఇలాంటి నేరాలు జరిగితే.. సంబంధించిన సాక్ష్యాధారాలనూ అందిస్తుంది. వాయిస్ యాక్టివేషన్, లైవ్ స్ట్రీమింగ్, ఆడియో, వీడియో రికార్డింగ్, ఫాల్స్ కాల్, ఫాలో మీ, లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్‌తో మహిళల భద్రతకు భరోసానిస్తోంది. బటన్‌ను ఒక్కసారి నొక్కితే చాలు.. ఎస్ఓఎస్ సిగ్నల్‌ను సెండ్ చేసేస్తుంది. దీని ద్వారా.. అత్యవసర వేళల్లో ఫొటోలు తీసుకుని.. వాటిని పోస్ట్ చేయొచ్చు. మీరున్న చోటును మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది. దీన్ని ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్ రెండు ఫోన్లలోనూ డౌన్లోడ్ చేçసుకోవచ్చు. నిర్భయ ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. ఫోన్లో డౌన్లోడ్ అయ్యాక.. ఒక్కసారి బటన్‌ను ప్రెస్ చేయగానే యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ బటన్ నొక్కడం వీలు పడకపోతే ఫోన్ షేకింగ్ ద్వారా, ఎస్సెమ్మెస్‌ల ద్వారా.. ఫోన్ కాల్ ద్వారా కూడా మన పరిస్థితిని తెలియజేయవచ్చు. అయితే వీటికి డేటా ప్లాన్, జీపీఎస్ అవసరం ఉంటాయి. ఆపదలో ఉన్నవారి లొకేషన్‌ను ఇది ప్రతి రెండు గంటలు.. లేదా ప్రతి మూడువందల మీటర్లకు మారినప్పుడల్లా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు పంపిస్తూంటుంది. ఎస్ఓఎస్ – స్టే సేఫ్ ఇది ఆండ్రాయిడ్ యాప్. ఫోన్లో ఈ యాప్ యాక్టివేట్ అయితే చాలు.. ఫోన్ లాక్ మోడ్‌లో ఉన్నా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను అన్‌లాక్ చేసుకునేంత టైమ్ ఉండదు. వెంటనే స్పందించాలి. అందుకే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. ఆపదలో ఉన్నామని తెలియగానే ఫోన్‌ను రెండుమూడు సార్లు షేక్ చేయాలి.. అంతే.. మనకు సంబంధించిన సమాచారం.. మనమున్న లొకేషన్ సహా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి వెళ్లిపోతాయి. ఒకవేళ షేక్ చేయడం తికమక వ్యవహారంలా అనిపిస్తే ఈ యాప్ హోమ్ బటన్‌ను ప్రెస్ చేసినా చాలు.. మన సమాచారం, లొకేషన్ సహా మప ఫోన్ బ్యాటరీ ఏ స్థితిలో ఉందో కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి చెప్పేస్తుంది. అంతేకాదు ఆడియో రికార్డింగ్‌నూ పంపుతుంది. రక్ష (Raksha) భద్రతతో కూడిన స్వావలంబన.. ఈ యాప్ లక్ష్యం. అందుకే అహర్నిశలూ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఉపయోగించడమూ తేలికే. మీరు ఆపదలో చిక్కుకున్నారని మీకు అనిపించిన వెంటనే యాప్‌లో సూచించిన బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు.. మీరున్న లొకేషన్ సహా మీకు సంబంధించిన అలర్ట్స్ అన్నీ మీ కుటుంబ సభ్యులకు చేరుతాయి మీ వాళ్ల ఫోన్ నంబర్ల ద్వారా. నెట్వర్క్ లేకపోయినా.. ఈ యాప్ స్పందిస్తుంది. వాల్యూమ్ కీని మూడు సెకండ్ల పాటు ప్రెస్ చేస్తే చాలు.. మీ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. ఇందులో ఎస్ఓఎస్ కూడా ఉన్నందున.. ఇంటర్నెట్ లేని ఏరియాల్లో .. ఎస్సెమ్మెస్ ద్వారా మీకు సంబంధించిన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు చేరవేస్తుంది. ఐయామ్ శక్తి (Iam Shakthi) ఇదీ యూజర్ ఫ్రెండ్లీనే. ఫోన్లోని పవర్ బటన్‌ను రెండు సెకండ్ల వ్యవధిలో అయిదుసార్లు నొక్కితే చాలు.. ఫోన్లో ముందుగా సెట్ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు లొకేషన్ సహా సమాచారం వెళుతుంది. బటన్ నొక్కిన వెంటనే లొకేషన్‌ను ట్రేస్ చేయలేకపోతే.. ట్రేస్ అయిన వెంటనే మళ్లీ అలర్ట్ మెసేజెస్ను పంపిస్తుంది. విత్యు (WithYou) ఇది కూడా ‘స్పాట్ఎన్సేవ్’ లాంటిదే. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్లోని పవర్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే .. మనకు సంబంధించిన సమాచారమంతా లొకేషన్ సహా.. అంతకుముందే సెట్ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు వెళుతుంది.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి. స్పాట్ఎన్సేవ్ ఫీల్ సెక్యూర్ ఇప్పుడున్న అన్ని సేఫ్టీ యాప్లోకెల్లా అడ్వాన్స్డ్ యాప్ ఇది. దీన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాచీలా మణికట్టుకు ధరిస్తే చాలు. అవును రిస్ట్ బ్యాండ్‌లా! డేంజర్ సిచ్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీ ఫోన్ పవర్ బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేయాలి అంతే.. రిస్ట్బ్యాండ్లోని యాప్ యాక్టివేట్ అయ్యి మీరు ముందే సెట్ చేసి పెట్టుకున్న మీ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్స్‌కి.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి.. మీరున్న లొకేషన్ సహా వివరాలను అందిస్తూంటుంది. ఒకవేళ మీరు ఫోన్‌ను ఉపయోగించే స్థితిలో లేకపోతే రిస్ట్బ్యాండ్కున్న బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేసినా చాలు బ్లూటూత్ సాయంతో యాప్ పనిచేయడం మొదలుపెడుతుంది. ఇటు చూడండీ.. ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో)–2021 నివేదిక ప్రకారం.. దేశంలో మహిళల మీద జరుగుతున్న హింస 2020 సంవత్సరం కన్నా 2021లో 15.3 శాతం పెరిగింది. 2020లో 3,71,503 కేసులు నమోదైతే 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు ఈ హింసాత్మక సంఘటనల రేటు 64.5 శాతంగా నమోదైంది. 2020లో ఇది 56.5 శాతం. వీటిల్లో 31.8 శాతం గృహహింస కేసులే. మిగతావన్నీ వేధింపులు, కిడ్నాప్‌లు, లైంగికదాడుల కేసులు. మహిళల మీద జరుగుతున్న హింసలో అసోం రాష్ట్రం మొదటి స్థానపు అప్రతిష్ఠను మూటగట్టుకుంది. తర్వాత స్థానాల్లో ఒడిశా, హరియాణా, తెలంగాణ, రాజస్థాన్‌లు నిలిచి ఆ అవమానపు భారాన్ని మోస్తున్నాయి. షాకింగ్ ఏంటంటే.. గతంలో కన్నా తెలంగాణలో మహిళల మీద హింస పెరిగినట్టు చూపిస్తోంది ఎన్సీఆర్బీ. అత్యంత తక్కువ కేసులతో నాగాలాండ్ కాస్త మెరుగైన రాష్ట్రంగా కనిపిస్తోంది. మూడేళ్లుగా ఇది ఈ రికార్డ్‌నే మెయిన్టైన్ చేస్తోంది. హింస పెట్రేగుతున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లు నిలిచి తలవంచుకుంటున్నాయి. 2021 సంవత్సరం CEOWORLD మ్యాగజీన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. మహిళల భద్రత విషయంలో ప్రపంచంలోకెల్లా తొలి స్థానంలో నిలిచిన దేశం నెదర్లాండ్స్. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్వీడన్లు ఉన్నాయి. డెన్మార్క్ నాలుగో స్థానాన్ని పొందింది. చిత్రమేంటంటే.. అందరికీ పెద్దన్నలా వ్యవహరించే అమెరికా మొదటి పది స్థానాల్లో ఎక్కడా లేదు. 20వ స్థానంలో ఉంది! యునైటెడ్ కింగ్‌డమ్‌ది పదిహేడో స్థానం. మన గురించీ చెప్పుకోవాలి కదా.. మహిళల భద్రత విషయంలో మన పరువుకు దక్కిన ప్లేస్.. నలభై తొమ్మిది! -
ఉమెన్స్ డేకి మహిళలంతా మొక్కలు నాటండి: నమ్రత
పర్యావరణం పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సూపర్ స్టార్ మహేశ్‌బాబు సతీమణి నమ్రత స్వీకరించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని ఆమె కోరారు. అంతకుముందు గ్రీన్ ఇండియా చాలెంజ్ కి తనను నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి నమ్రత ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
WPL: ‘శక్తి’మంతంగా డబ్ల్యూపీఎల్ ఆంథెమ్.. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం!
Women's Premier League 2023 Anthem: భారత క్రికెట్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ బీసీసీఐ నిర్వహించనున్న మహిళా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు సమయం ఆసన్నమైంది. ఐదు ఫ్రాంఛైజీలకు సంబంధించిన జట్లతో కూడిన టీ20 లీగ్ మార్చి 4న ఆరంభం కానుంది. ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్‌తో ప్రారంభ సీజన్‌కు తెరలేవనుంది. మహిళా శక్తికి అద్దం పట్టేలా ఈ నేపథ్యంలో బీసీసీఐ డబ్ల్యూపీఎల్ ఆంథెమ్‌ను విడుదల చేసింది. ‘‘యేతో బస్ షురువాద్ హై (ఇది కేవలం ఆరంభం మాత్రమే)’’ అంటూ మొదలైన ఈ గీతం అమ్మాయిల సంకల్ప బలానికి, మహిళా శక్తికి అద్దం పట్టేలా సాగింది. కఠిన సవాళ్లను ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగుతున్న మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా స్ఫూర్తిదాయక పదాల కూర్పుతో అద్భుతంగా ఉంది. గూస్బంప్స్ రావడం ఖాయం మహిళా క్రికెటర్లు ఎవ్వరికీ తీసిపోరని, అంకితభావంతో వాళ్లు ఇక్కడిదాకా చేరిన తీరుకు నిదర్శనంగా నిలిచింది. అందుకు తగ్గట్లే సంగీతం కూడా అదిరిపోయింది. మొత్తానికి ఈ పాట వింటే గూస్బంప్స్ రావడం ఖాయం. మహిళా శక్తిని వివరిస్తూ ‘‘జాగీ హుయీ శక్తి అబ్ మేరే పాస్ హై, దేఖో అభి, యేతో బస్ షురువాద్ హై!’’ అంటూ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన ఈ పాటను మీరు కూడా వినేయండి! మహిళా దినోత్సవానికి ముందే మరో కానుక ‘‘యా దేవి సర్వభూతేశు, శక్తి రూపేన సమస్థితా నమస్తస్యయై నమస్తస్యయై నమస్తస్యయై నమస్తస్యయై నమస్తస్యయై.. నమో నమః ధమ్ ధమ్ ధ మ మ ధమ్ ధమ్ ధమ్ ధ మ మ ధమ్ ధమ మైదాన్ మే గూంజే మేరీ శక్తి అబ్ ఆస్మాన్ మే’’ అంటూ నేటితరం ఆడబిడ్డలకు సవాళ్లు స్వీకరించడం ఓ అలవాటులా మారిపోయిందని.. విజయగర్జన చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ.. ఆకాశమే హద్దుగా ఆటలో తమను తాము నిరూపించుకుంటామంటూ సాగిన పాట జోష్ నింపుతోంది. నెటిజన్లు ఈ గీతానికి ఫిదా అవకుండా ఉండలేకపోతున్నారు. మహిళా దినోత్సవానికి ముందే మహిళా క్రికెటర్లకు అద్భుతమైన పాట రూపంలో కానుక ఇచ్చారంటూ బీసీసీఐని కొనియాడుతున్నారు. చదవండి: Jasprit Bumrah: న్యూజిలాండ్‌కు వెళ్లనున్న బుమ్రా Ind Vs Aus: ఇప్పటి వరకు అత్యంత చెత్త పిచ్ ఇదే! కానీ 109 పరుగులకే ఆలౌట్ కావడం వారి వైఫల్యమే! అప్పుడు కూడా ఇదే మాట అంటారా? View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
Adilabad: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు..
Mukhra Sarpanch Meenakshi Gadge Inspiring Journey: ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా అనే చిన్న పల్లెను చూస్తే సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుంది అనిపిస్తుంది. మూడేళ్లలో దీనిని ఇలా తీర్చిదిద్దింది సర్పంచ్ మీనాక్షి గాడ్గె. అందుకే ఆమెకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది.ఎందుకో చదవండి... నూట అరవై కుటుంబాలు 700 జనాభా ఉన్న ఆ చిన్న ఊరు ఎంత ముచ్చటగా ఉంటుందంటే ప్రతి ఊరు ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది. మూడేళ్ల క్రితం వరకూ అది అన్నింటిలాగే ఒక మామూలు పల్లె. మూడేళ్లలో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచే స్థాయికి ఎదిగింది. దానికి కారణం సర్పంచ్ మీనాక్షి గాడ్గె. ఆమె కృషి, పట్టుదల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా గ్రామాన్ని అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దాయి. నూతన గ్రామపంచాయతీ ఒకప్పుడు అనుబంధ గ్రామంగా ఉన్న ముఖరా 2019లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. గ్రామ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న సుభాష్ గాడ్గె తన భార్య మీనాక్షిని సర్పంచ్‌గా పోటీ చేయమని ప్రోత్సహించాడు. అక్షరాస్యత అంతంత మాత్రమే ఉన్న ఆ గ్రామంలో ఇంటర్ వరకూ చదివి అందరితో స్నేహంగా ఉండే మీనాక్షి ఆ పదవికి తగినదేనని ఊరంతా భావించింది. ఏకగ్రీవంగా ఆమెను సర్పంచ్‌గా ఎన్నుకుంది. ఈ నిర్ణయం మీనాక్షిని బాగా కదిలించింది. తన మీద ఇంత విశ్వాసం ఉంచిన గ్రామానికి పూర్తిగా సేవ చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. అన్నీ మంచి పనులే మీనాక్షి సర్పంచ్ అయిన వెంటనే చేసిన మొదటి పని ఊళ్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు కట్టించడం. దాంతో ఊరు ఒక్కసారిగా బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామంగా మారిపోయింది. ఆ తర్వాత తాగునీరు ప్రతి ఇంటికి అందేలా చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వృ«థానీరు ఆ గుంటలో పోయేలా చూసిందామె. దాంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఊరి బయట పెద్ద వాగు వానొస్తే పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగేది. మీనాక్షి వంతెన కట్టించింది. పక్కా రోడ్ల నిర్మాణం, సైడు కాలువల వల్ల శుభ్రత ఏర్పడింది. పాత భవనంగా ఉన్న స్కూలును కొత్త భవన నిర్మాణం చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే కాదు ఇంగ్లిష్ మీడియంలో చెప్పడానికి టీచర్లను నియమించింది. దాంతో 1 నుంచి 5 వరకు ఊళ్లో ప్రతి ఒక్క విద్యార్థి ఈ ప్రభుత్వ బడిలోనే చదువుతున్నాడు. డయల్ 100కు ఒక్క కాల్ లేదు ‘గత మూడేళ్లుగా మా ఊరి నుంచి డయల్ 100కు ఒక్క కాల్ కూడా వెళ్లలేదు’ అంటుంది మీనాక్షి. దానికి కారణం సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడమే. దాని వల్ల సగం గొడవలు లేకుండా పోయాయి. మద్యం తాగితే జరిమానా విధిస్తారు. అంతేకాదు గ్రామమంతా శాకాహారాన్ని అలవాటు చేసుకుంది. ఆరోగ్యం కోసం శాకాహారాన్ని ప్రచారం చేయడం వల్ల ఈ మార్పు వచ్చింది. ఊరిలో చిన్న అంగడి కూడా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తుంది. ఇక ఊరిలో నలభై వేల చెట్లు ఉన్నాయి. హరితహారంలో భాగంగా పదివేల మొక్కలు నాటి వాటిని పూర్తిగా కాపాడుకున్నారు. ఊళ్లోనే ఒక నర్సరీ ఉంది. వీటన్నింటి వల్ల ఊరు చల్లటి నీడలో ఉంటుంది. ఇందువల్లేనేమో కరోనా ఈ ఊరు దరిదాపులకు రాలేదు. మహిళా విజేత ఇన్ని మంచి పనులు చేసింది కనుకనే మీనాక్షిని మార్చి 4న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్–2023’ కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘మహిళా విజేత’ పురస్కారంతో సత్కరించనుంది. ‘నా భర్త, పిల్లలు, ఊరి ప్రజలు... వీరందరి సహకారం వల్లే ఈ పురస్కారం’ అని మీనాక్షి అంది. చెత్తను ఎరువుగా అమ్మి ముఖరాలో తడి చెత్త – పొడి చెత్త విభజనను ప్రతి ఒక్కరూ పాటిస్తారు. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసి రైతులకు అమ్మి పంచాయతీకి లాభం సంపాదించిపెడుతోంది మీనాక్షి. ఎరువు అమ్మకం ద్వారా 6 లక్షలు వస్తే వాటిలో నాలుగు లక్షలు వెచ్చించి ఊళ్లో 6 కె.వి. సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ తయారయ్యే కరెంటులో 4 కిలోఓల్టులు పంచాయతీ ఉపయోగించుకున్నా 2కిలో ఓల్ట్లను పవర్ గ్రిడ్‌కు అమ్మడం ద్వారా లాభం రానుంది. – ఇన్పుట్స్: గొడిసెల కృష్ణకాంత్ గౌడ్, సాక్షి, ఆదిలాబాద్ చదవండి: జంగిల్ రాణి..పద్మిని మాఝీ: అడవిని చేరాలంటే ఆమెను దాటాలి -
జంగిల్ రాణి..పద్మిని మాఝీ: అడవిని చేరాలంటే ఆమెను దాటాలి
చేత గొడ్డలి కళ్లల్లో తీక్షణత ‘అడవికి నేను కాపలా’ అనే ప్రకటన. 65 ఏళ్ల పద్మిని మాఝీ ఒరిస్సాలో తన పల్లె చుట్టూ ఉన్న 100 హెక్టార్ల అడవిలో పుల్ల కూడా పోకుండా ఒక్క కొమ్మా తెగి పడకుండా కాపలా కాస్తోంది. కలప మాఫియా ఆమె దెబ్బకు తోక ముడిచింది. అందుకే ఆమెను ఆ ప్రాంతంలో జంగిల్ రాణి అని పిలుస్తుంటారు. ఉదయం ఆరూ ఆరున్నరకంతా పద్మిని మాఝీ ఇంటి పనులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత ఆమె తన అసలైన ఇంటికి బయలుదేరుతుంది. అంటే దాపున ఉన్న అడవికి. అదే ఆమె రోజంతా గడిపే ఇల్లు. ఒరిస్సాలోని నౌపడా జిల్లాలో బిర్సింగ్పూర్ అని చిన్న పల్లె ఆమెది. ఆ పల్లెకు ఆనుకునే చిన్న కొండ. దాని చుట్టుపక్కల విస్తారమైన అడవి. అందులో చాలా విలువైన కలప చెట్లు, మందు మొక్కలు, అడవి పళ్లు అన్నీ దొరుకుతాయి. ‘మేము అడవి మీద ఆధారపడి బతుకుతాము. అడవిని నరికి, అడవిలో ఉండే జంతువులను చంపి కాదు’.. అంటుంది పద్మిని. కిరాసాగర్ మాఝీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ముప్పై ఏళ్ల క్రితం ఆ అడవి పక్క ఊరికి కోడలిగా వచ్చింది పద్మిని. అడవికి వెళ్లి వంట చెరుకు, తేనె, దుంపలు... ఇవన్నీ తెచ్చుకుని బతకడం తొందరగా నేర్చుకుంది. ‘కాని అడవిలో ఆ రోజుల్లో కలప దొంగలు విచ్చలవిడిగా తిరిగేవారు. వేటగాళ్లు ఉండేవారు. వారి వల్ల అడవి నాశనమవుతోందని నాకు అర్థమైంది. అడవి పచ్చగా ఉంటే మేము పచ్చగా ఉంటాము. అడవి ఉంటేనే వానలు పడతాయని మా నాన్న నా చిన్నప్పుడు చెప్పేవాడు. అందుకే అడవిని కాపాడాలనుకున్నా’ అంటుందామె. తనకు తానుగా వేసుకున్న ఈ డ్యూటీని పాతికేళ్లు గడిచినా ఆమె వదల్లేదు. రోజూ ఉదయం ఆరున్నరకంతా భుజాన గొడ్డలి వేసుకొని అడవిలోకి బయలుదేరుతుందామె. పుట్టి బుద్ధెరిగాక ఆమె చెప్పులు వేసుకోలేదు. ఇన్నాళ్లుగా ఆమె అడవిలో ఉత్త పాదాలతోనే తిరుగుతుంది. అడవిలోని ప్రతి అడుగు తెలిసినవారే ఉత్త పాదాలతో తిరగ్గలరు. అడవిని ఆమె ఐదారు భాగాలుగా చేసుకుంది. ఒకోరోజు ఒకో భాగంలో తిరుగుతుంది. దారిలో తనకు కనపడిన ఎండుపుల్లల్ని ఒకచోటకు చేరుస్తుంది. అడ్డంగా ఉన్న కొమ్మలను, తీగలను కొట్టి దారి చేస్తుంది. నిన్న ఉన్న అడవే ఇవాళా ఉందా అని చెక్ చేస్తుంది. ఇక పరాయి వ్యక్తి ఎవరైనా కనిపించాడో గొడ్డలి చేతికందుకుంటుంది. ‘మొదట వాణ్ణి భయపెడతాను. నన్ను చూడగానే చాలామంది పారిపోతారు. అడ్డం తిరిగితే పెద్దగా అరిచి సాయం వచ్చేలా చేస్తాను. ఊరి వాళ్లు ఎవరో ఒకరు అడవిలో తిరుగుతూనే ఉంటారు. వారొచ్చి పట్టుకుంటారు. ఊర్లోకి తీసుకెళ్లి వాణ్ణి కట్టేస్తాం. వాడు క్షమాపణలు చెప్పి మళ్లీ అడవి ముఖం చూడను అని ప్రమాణం చేస్తే వదిలేస్తాం. అడవిలో రోజూ నేను తిరుగుతానని ఎదురు పడతానని కలప దొంగలకు, వేటగాళ్లకు తెలిసిపోయింది. అందుకే రావడం మానేశారు. మా అడవి మాకు మిగిలింది’ అంటుంది పద్మిని. ఇన్నేళ్లుగా ఆమె ఒక పైసా ఎవరి నుంచి ఆశించకుండా, ఏ జీతం తీసుకోకుండా ఈ పని చేస్తున్నందు వల్ల ఊళ్లో పద్మిని అంటే చాలా గౌరవం. ఆమెను జంగిల్ రాణి అని పిలుస్తారు. ఫారెస్ట్ రేంజర్లు, గార్డులు ఆమె కనిపిస్తే గౌరవంగా మాట్లాడతారు. ‘నాకు జీతం ఎందుకు? ఇది ప్రతి మనిషి బాధ్యత’ అంటుంది మాఝీ. ఈ అడవి పచ్చగా ఉండటం వల్ల వీకెండ్స్‌లో విహారానికి వచ్చేవారి సంఖ్య ఎక్కువ. వారి ఆనందానికి కారణం ఒక బక్కపలుచని ఆదివాసి మహిళ అని వారికి తెలియకపోవచ్చు. ఇలాంటి తెలియని మహానుభావుల వల్లే మన దేశంలో ప్రకృతి ఈ మాత్రమైనా మిగిలి ఉంది. ఇలాంటి స్పూర్తిదాయక కథలు ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. పద్మిని మాఝీతో పాటు ఆమెలాంటి మహిళా మణులందరికీ ముందుగానే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!! నన్ను చూడగానే చాలామంది పారిపోతారు. అడ్డం తిరిగితే పెద్దగా అరిచి ఊరివాళ్లు సాయం వచ్చేలా చేస్తాను. ఊర్లోకి తీసుకెళ్లి వాణ్ణి కట్టేస్తాం. వాడు క్షమాపణలు చెప్పి మళ్లీ అడవి ముఖం చూడను అని ప్రమాణం చేస్తే వదిలేస్తాం.