
ట్రాక్టర్ నడుపుతున్న బడియా సావిత్రిది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామం. మత్స్యకార కుటుంబానికి చెందిన సావిత్రి పెద్దగా చదువుకోలేదు. కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ కూలీగా పనిచేసేది. ఆడవాళ్లు కార్లు, బైక్‌లు, బస్సులు, రైళ్లు, విమానాలు నడుపుతున్నారు, ట్రాక్టర్ కూడా నడపవచ్చు అనుకుంది.
డ్రైవింగ్ నేర్చుకుంది. తనకు సొంతంగా ట్రాక్టర్ ఉంటే బావుణ్నని కలగన్నది. స్వయంసహాయక బృందంలో సభ్యురాలు కావడంతో గత ఏడాది ఆమెకు ‘స్త్రీ నిధి’ నుంచి 80వేలు, గ్రామ సంఘం నుంచి లక్ష రూపాయల లోన్ వచ్చింది. ఆ డబ్బు డౌన్ పేమెంట్‌గా కట్టి వాయిదాల పద్ధతిౖపై ట్రాక్టర్ కొన్నది. ప్రస్తుతం తన ట్రాక్టర్‌ను తానే నడుపుతూ వ్యవసాయ పనులు, ఇతరత్రా పనులు చేసుకుంటోంది సావిత్రి.
►విజయవాడ నగరం, రామలింగేశ్వర నగర్ నివాసి రమాదేవి. . భర్త వ్యసనపరుడై మరణించాడు. ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి ఇంత కష్టమైన పనిని చేయడానికి ముందుకు వచ్చింది. ఎయిర్ బ్రేక్ సిస్టమ్ మెకానిక్‌గా పని చేస్తోంది.
►ఆటో నడుపుతున్న సరస్వతి సుమతిది నెల్లూరు నగరం. ఇంటర్ వరకు చదువుకున్న సుమతి పిల్లల పోషణ కోసం ఆటో నడుపుతూ, పిల్లలతో పాటు చదువును మళ్లీ మొదలు పెట్టి బీఎల్ పూర్తి చేసింది.
►స్వరూపరాణిది పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం, గంగన్నగూడెం. ఆడవాళ్లు వేదాలను ఎందుకు చదవకూడదనే ప్రశ్నకు తానే జవాబుగా నిలవాలనుకుంది. వేదాలు ఔపోశన పట్టి, బ్యాంకు మేనేజర్ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని పౌరోహిత్యం చేస్తున్నారు.
►నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు సర్పంచ్ గొడ్డేటి వెంకటసుబ్బమ్మ... పొలం దుక్కి దున్నడంతోపాటు నిమ్మచెట్లకు తెగుళ్లు సోకితే స్ప్రేయర్‌తో క్రిమిసంహారక మందులను స్వయంగా పిచికారి చేస్తుంది.
►కాచరమైన కళమ్మ ఉండేది కుషాయిగూడ హైదరాబాద్‌లో.మొదట భవన నిర్మాణ కార్మికురాలిగా ఉన్న కళమ్మ 30 ఏళ్లుగా ఇండ్లకు, దేవాలయాలకు పెయింటింగ్ వేస్తోంది.
►మదనపల్లె పట్టణంలో రేణుక... డ్రైవింగ్ స్కూల్‌లో స్వయంగా తానే మహిళలకు డ్రైవింగ్ నేర్పిస్తోంది.
►యదళ్ళపల్లి ఆదిలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్‌లో ఉంటుంది. గత 5 ఏళ్లుగా మెకానిక్‌గా పనిచేస్తోంది.
►కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పెట్రోలు బంకులో పెట్రోలు పడుతున్న పగిడేల ఉమా మహేశ్వరి.
చదవండి: Lalitha Manisha: తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో..
Comments
Please login to add a commentAdd a comment