
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హర్ సర్కిల్ ఎవిరీబాడీ పేరుతో ఓ ప్రాజెక్టును రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్‌పర్సన్ నీతా ఎం అంబానీ ఆవిష్కరించారు. మహిళల నిజ జీవిత కథలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా విభిన్న శరీర పరిమాణాలు, రూపాలను ప్రోత్సహించడం లక్ష్యంగా హర్ సర్కిల్ ఏడాదిపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
ఒక నిర్దిష్ట పరిమాణం, రంగు, ఆకృతిని కలిగి ఉండాలని ఆశించే అవాస్తవిక సౌందర్య ప్రమాణాలు, విష నిబంధనలను సవాలు చేసి విజేతలుగా నిలిచిన మహిళలను హర్ సర్కిల్ సామాజిక మాధ్యమం వేదికగా పరిచయం చేస్తారు. మహిళల కోసం భారత్‌లో అతిపెద్ద కంటెంట్, నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్, యాప్ అయిన హర్ సర్కిల్‌ను 2021లో నీతా అంబానీ ప్రారంభించారు. 31 కోట్ల మందికి ఈ వేదిక చేరువైంది. వీరిలో 2.25 లక్షల మంది మహిళా వ్యాపారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment