రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & ఛైర్‌పర్సన్ 'నీతా అంబానీ' బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్‌లో ప్రతి జీవితం విలువైనదని మేము విశ్వసిస్తున్నాము. ప్రతి బిడ్డ సంతోషంగా, ఆరోగ్యంగా పెద్ద కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి అర్హులు అని వ్యాఖ్యానించారు.
బాలల దినోత్సవం సందర్భంగా.. కొత్త ఆరోగ్య సేవా పథకాన్ని ప్రారంభించినట్లు నీతా అంబానీ ప్రకటించారు. పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు & మహిళలపై దృష్టి సారించి, అట్టడుగు వర్గాలకు చెందిన 1,00,000 మంది వ్యక్తులకు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన ఆరోగ్య పరీక్షలు మరియు చికిత్సలను అందించడం ఈ చొరవ లక్ష్యం అని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి.. మా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రవేశపెట్టడం గర్వకారణంగా ఉందని, నీతా అంబానీ పేర్కొన్నారు. అంతే కాకుండా.. 50,000 మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత పరీక్షలు చేసి తగిన చికిత్సను అందించడం, 50వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌లతో పాటు 10,000 మంది కౌమార బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నిరోధక టీకాల వంటి వాటికి సంబంధించిన లక్ష్యాలను నీతా అంబానీ వెల్లడించారు.
ప్రారంభం నుంచి రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 1,50,000 కంటే ఎక్కువమంది పిల్లలతో సహా సుమారు 27 లక్షల కంటే ఎక్కువమంది భారతీయులకు సేవలందించింది. భారతదేశంలోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌గా గుర్తింపు పొందిన ఈ సంస్థ నాణ్యమైన సేవలను అందిస్తోంది.
బాలల దినోత్సవానికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నీతా అంబానీ.. పిల్లలతో ముచ్చటించడం, పిల్లకు కేక్ తినిపించడం వంటివి కూడా చూడవచ్చు. అంతే కాకుండా రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ద్వారా మేలు పొందిన వారు సంస్థకు కృతజ్ఞతలు చెప్పడం కూడా ఇక్కడ చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment