
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యుందాయ్ కంపెనీ మహిళా కస్టమర్లకోసం ప్రత్యేకమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. మార్చి 06 నుంచి 09 వరకు హ్యుందాయ్ డీలర్‌షిప్ లేదా సర్వీస్ సెంటర్‌లో ఈ ఆఫర్స్ పొందవచ్చు.
హ్యుందాయ్ కంపెనీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వివరాల ప్రకారం, ఫ్రీ వాషింగ్ కూపన్, పిక్-అండ్-డ్రాప్ వంటి సర్వీసులు ఉన్నాయని, అంతే కాకుండా కారుని మెరుగైన పద్ధతిలో ఎలా నిర్వహించాలనే దానిపై కూడా ప్రత్యేక సెషన్‌లు కూడా నిర్వహించనున్నట్లు, మహిళల కోసం బ్రాండ్‌లపై myHyundai యాప్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కంపెనీ అందించే ఈ ఆఫర్స్ కేవలం మార్చి 9 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
(ఇదీ చదవండి: Women’s Day 2023: మహిళల కోసం జావా యెజ్డీ ముందడుగు.. దేశ వ్యాప్తంగా బైక్ రైడింగ్)
ఇదిలా ఉండగా హ్యుందాయ్ కంపెనీ ఇటీవల 2023 హ్యుందాయ్ వెర్నా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది ఈ నెల 21న మార్కెట్లో విడుదలవుతుంది.
దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నాకి సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. అయితే ధరల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ దీని ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment