
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, విజయవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా గొప్పది. అనేక రంగాల్లో మహిళలు తిరుగులేని నాయకత్వాన్ని పోషిస్తున్నారు. మహిళలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు’’ అని గవర్నర్ అన్నారు.
విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించారు. ఏపీలో సంక్షేమ పథకాలతో ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనని, మహిళల కోసం సీఎం జగన్ ఒక యజ్ఞం చేస్తున్నారని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మహిళల రక్షణ కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చారని వాసిరెడ్డి పద్మ అన్నారు.
చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్