
సాక్షి, గుంటూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. గుంటూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారుల అనుభవాలు తెలుసుకుని పథకాలు మెరుగ్గా ఉండేటట్లు చూడాలన్నారు.
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హత ఉండి పథకాలు అందని వారి వివరాలు సేకరించాలని గవర్నర్ సూచించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతం కావడానికి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు.
చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు
Comments
Please login to add a commentAdd a comment