భారతదేశంలో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్ 'జావా యెజ్డీ మోటార్ మోటార్‌సైకిల్స్' మహిళల కోసం బైక్ రైడ్ ప్రారంభించింది.
2023 మార్చి 5న దేశంలోని మహిళా రైడర్ల స్ఫూర్తిని పురస్కరించుకుని ఢిల్లీ, బెంగళూరు, పూణే, చెన్నై, గౌహతి వంటి నగరాల్లో రైడింగ్ ప్రారంభించింది. ఈ రైడింగ్‌లో సుమారు 150 మంది మహిళా రైడర్లు పాల్గొన్నారు. ఈ రైడ్‌లలో పాల్గొన్న మహిళలు సమాజంలోని అణగారిన వర్గాల మహిళల ఋతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడంలో సహాయపడ్డారు.
కంపెనీ నిర్వహించిన ఢిల్లీ రైడ్‌లో ప్రముఖ ర్యాలీ రైడర్ 'గరిమా అవతార్' పాల్గొన్నారు. ఈ రైడ్‌లో ఆమె పాల్గొనడం వల్ల తోటి మహిళలు కూడా చాలా ఉత్సాహాన్ని కనపరిచాడు. ఈ రైడ్స్ బ్రాండ్ డీలర్‌షిప్‌ల నుండి ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా సామాజిక కార్యక్రమాలు, రిఫ్రెష్‌మెంట్‌ల కోసం అనేక స్టాప్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రైడ్‌లలో పాల్గొన్న రైడర్‌లు వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలకు ఫుడ్ ప్యాకెట్లు, శానిటరీ నాప్‌కిన్‌లను పంపిణీ చేశారు.
(ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' కొత్త లగ్జరీ కారు: ధర ఎంతంటే?)
ఈ సందర్భంగా జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ సీఈఓ 'ఆశిష్ సింగ్ జోషి' మాట్లాడుతూ.. కంపెనీ బైకులపై మహిళకు అనుభూతి పెరుగుతోందని, మహిళా రైడింగ్ వంటి వాటిని ప్రోత్సహించడంలో మేము ముందుంటామని, వివిధ మహిళా సంక్షేమ అంశాలపై అవగాహన కల్పించడంలో తప్పకుండా ముందుకు వస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment