
పండుగ సీజన్‌లో మంచి ప్రీమియం బండి కొనాలనుకుంటున్నవారికి ఇదే మంచి సమయం. జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ తమ బైక్‌లపై పలు ఆఫర్లను ప్రకటించింది. జావా/యెజ్డీ బండిని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుండి బుక్ చేసుకుంటే వివిధ బ్యాంకులు అందించే డిస్కౌంట్‌లతో పాటు రూ.22,500 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో జావా/యెజ్డీ బైక్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే.. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు రూ.8,500 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 12,500 నుండి రూ.22,500 వరకు స్ట్రెయిట్ అప్ డిస్కౌంట్‌తోపాటు రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
జావా యెజ్డీ మోటార్‌సైకిళ్లపై కంపెనీ ప్రాంతాలవారీగానూ ఆఫర్‌లను అందిస్తోంది. దేశంలోని దక్షిణ, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లోని కస్టమర్‌లు రూ.19,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ , నాలుగు సంవత్సరాల లేబర్-ఫ్రీ పీరియాడిక్ సర్వీస్, నాలుగేళ్లు లేదా 50,000 కి.మీ వారంటీ ఉన్నాయి.

తూర్పు ప్రాంత కస్టమర్లకు రూ.14,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.1,500 విలువైన రోడ్ సైడ్ అసిస్టెన్స్, రూ.2,500 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు. ఇక ఉత్తర భారతదేశంలోని కస్టమర్‌లకు రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతోపాటు సులభమైన ఫైనాన్స్ ఆఫర్‌లు కూడా అందిస్తున్నారు. కొత్త యెజ్డీ అడ్వెంచర్‌ని కొనుగోలు చేసేవారు రూ.16,000 విలువైన ట్రయల్ ప్యాక్ యాక్సెసరీస్ ప్యాకేజీని ఉచితంగా అందుకోవచ్చు.