Jawa Bikes
-
ఇదే మంచి తరుణం.. ప్రీమియం బైక్‌లపై భారీ డిస్కౌంట్లు
పండుగ సీజన్లో మంచి ప్రీమియం బండి కొనాలనుకుంటున్నవారికి ఇదే మంచి సమయం. జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ తమ బైక్‌లపై పలు ఆఫర్లను ప్రకటించింది. జావా/యెజ్డీ బండిని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుండి బుక్ చేసుకుంటే వివిధ బ్యాంకులు అందించే డిస్కౌంట్లతో పాటు రూ.22,500 వరకు ఆదా చేసుకోవచ్చు.ఫ్లిప్‌కార్ట్‌లో జావా/యెజ్డీ బైక్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే.. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.8,500 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 12,500 నుండి రూ.22,500 వరకు స్ట్రెయిట్ అప్ డిస్కౌంట్‌తోపాటు రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.జావా యెజ్డీ మోటార్‌సైకిళ్లపై కంపెనీ ప్రాంతాలవారీగానూ ఆఫర్లను అందిస్తోంది. దేశంలోని దక్షిణ, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ.19,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , నాలుగు సంవత్సరాల లేబర్-ఫ్రీ పీరియాడిక్ సర్వీస్, నాలుగేళ్లు లేదా 50,000 కి.మీ వారంటీ ఉన్నాయి.తూర్పు ప్రాంత కస్టమర్లకు రూ.14,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.1,500 విలువైన రోడ్ సైడ్ అసిస్టెన్స్, రూ.2,500 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు. ఇక ఉత్తర భారతదేశంలోని కస్టమర్లకు రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతోపాటు సులభమైన ఫైనాన్స్ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. కొత్త యెజ్డీ అడ్వెంచర్‌ని కొనుగోలు చేసేవారు రూ.16,000 విలువైన ట్రయల్ ప్యాక్ యాక్సెసరీస్ ప్యాకేజీని ఉచితంగా అందుకోవచ్చు. -
అప్డేటెడ్ జావా 42 బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ జావా మోటార్‌సైకిల్ అప్డేటెడ్ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త జావా 42 బైక్ ధరలు రూ. 1.73 లక్షల నుంచి రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 16000 తక్కువ ధరకే లభిస్తుంది.2024 జావా 42 బైక్ 294 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 27.32 హార్స్ పవర్ మరియు 26.84 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. రీడిజైన్ పొందిన ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. అనలాగ్ ఎల్సీడీ సెటప్ కూడా ఇందులో గమనించవచ్చు.మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ బైక్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. అప్డేటెడ్ జావా 42 సీటు ఎత్తు 788 మిమీ వరకు ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.The 2024 Jawa 42 is here! This is the answer you’ve been waiting for. With the perfect trinity of Performance, Neo-Classic Design and Engineering - you are in for a ride like no other!#Jawa42TheAnswer #Jawa42 #JPanther #JawaMotorcycles pic.twitter.com/AA4qFLCT3g— Jawa Motorcycles (@jawamotorcycles) August 13, 2024 -
జావా 42 బాబర్ కొత్త వేరియంట్.. ధర ఎంతో తెలుసా?
జావా మోటార్‌సైకిల్స్ తన '42 బాబర్' బైకును కొత్త 'రెడ్ షీన్' వేరియంట్లో లాంచ్ చేసింది. ఇది కొత్త పెయింట్ స్కీమ్ పొందటమే కాకుండా.. కొత్త అల్లాయ్ వీల్స్, కొన్ని కాస్మెటిక్ ట్వీక్‌లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 2.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్టాండర్డ్ వేరియంట్ కంటే దీని ధర రూ. 9550 ఎక్కువ.కొత్త కలర్ జావా 42 బాబర్.. రెడ్ షీన్ ట్రిమ్ ట్యూబ్‌లెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు రెడ్ అండ్ క్రోమ్‌లలో పూర్తి చేసిన సరికొత్త డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌ను పొందుతుంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత ఆకర్షణీయంగా ఉంటుంది.జావా 42 బాబర్ కొత్త వేరియంట్లో కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా.. ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్స్ లేదు. కాబట్టి ఇందులో అదే 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 29.5 Bhp పవర్ మరియు 30 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. -
కాలంలో కలిసిపోయిన జావా & యెజ్డీ బైకులు (ఫోటోలు)
-
Women’s Day 2023: మహిళల కోసం జావా యెజ్డీ ముందడుగు
భారతదేశంలో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్ 'జావా యెజ్డీ మోటార్ మోటార్‌సైకిల్స్' మహిళల కోసం బైక్ రైడ్ ప్రారంభించింది. 2023 మార్చి 5న దేశంలోని మహిళా రైడర్ల స్ఫూర్తిని పురస్కరించుకుని ఢిల్లీ, బెంగళూరు, పూణే, చెన్నై, గౌహతి వంటి నగరాల్లో రైడింగ్ ప్రారంభించింది. ఈ రైడింగ్‌లో సుమారు 150 మంది మహిళా రైడర్లు పాల్గొన్నారు. ఈ రైడ్లలో పాల్గొన్న మహిళలు సమాజంలోని అణగారిన వర్గాల మహిళల ఋతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడంలో సహాయపడ్డారు. కంపెనీ నిర్వహించిన ఢిల్లీ రైడ్‌లో ప్రముఖ ర్యాలీ రైడర్ 'గరిమా అవతార్' పాల్గొన్నారు. ఈ రైడ్‌లో ఆమె పాల్గొనడం వల్ల తోటి మహిళలు కూడా చాలా ఉత్సాహాన్ని కనపరిచాడు. ఈ రైడ్స్ బ్రాండ్ డీలర్‌షిప్‌ల నుండి ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా సామాజిక కార్యక్రమాలు, రిఫ్రెష్మెంట్ల కోసం అనేక స్టాప్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రైడ్లలో పాల్గొన్న రైడర్లు వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలకు ఫుడ్ ప్యాకెట్లు, శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేశారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' కొత్త లగ్జరీ కారు: ధర ఎంతంటే?) ఈ సందర్భంగా జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ సీఈఓ 'ఆశిష్ సింగ్ జోషి' మాట్లాడుతూ.. కంపెనీ బైకులపై మహిళకు అనుభూతి పెరుగుతోందని, మహిళా రైడింగ్ వంటి వాటిని ప్రోత్సహించడంలో మేము ముందుంటామని, వివిధ మహిళా సంక్షేమ అంశాలపై అవగాహన కల్పించడంలో తప్పకుండా ముందుకు వస్తామని అన్నారు. -
జావా అదిరిపోయే కొత్త బైక్ చూశారా? ధర కూడా అంతే అదుర్స్
న్యూఢిల్లీ: లగ్జరీ బైక్ మేకర్ జావా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. జావా 42 బాబర్ పేరుతో సూపర్ బైక్‌ను తీసుకొచ్చింది.సరికొత్త డిజైన్‌తో, అప్‌గ్రేడెడ్ ఫీచర్స్‌తో వస్తున్న ఈ బైక్ ధరను ధర రూ. 2.06 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. (Akasa Air ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!) జావా 42 బాబర్ మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్, డ్యూయల్ టోన్ జాస్పర్ రెడ్ మూడు రంగుల్లో లభిస్తుంది. టెస్ట్ రైడ్లతో పాటు వచ్చే వారం ప్రారంభంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కొత్త రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, కొత్త హ్యాండిల్ బార్, కొత్త ఫ్యూయల్ ట్యాంక్, రీడిజైన్ చేసిన సీట్లు ప్రధాన ఫీచర్లుగా ఉండగా, ఇంకాకన్సోల్ LCD స్క్రీన్, ఫంక్షన్లను నియంత్రించడానికి కొత్త స్విచ్‌గేర్ కూడా జోడించింది. ఫ్లోటింగ్ సీటు 2స్టెప్ ఎడ్జస్టబుల్ ఫీచర్‌తో రైడర్ తనకనుగుణంగా ముందుకి, వెనక్కీ ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంజీన్: ఇక ఇంజీన్ విషయానికి వస్తే జావా పెరాక్ మాదిరిగానే 334cc ఇంజన్ అందించింది. ఇది 30.64 PS పవర్, 32.74 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ ట్రాన్స్మిషన్, రీట్యూన్డ్ సస్పెన్షన్,రీకాలిబ్రేటెడ్ బ్రేక్, కాంటినెంటల్ డ్యూయల్ ఛానల్ ABSని ప్రామాణికంగా అందిస్తున్నట్టు జావా వెల్లడించింది. ధరలు జావా 42 బాబర్ మిస్టిక్ కాపర్ ధర రూ. 2,06,500 జావా 42 బాబర్ మూన్‌స్టోన్ వైట్ ధర రూ.2, 07,500 జావా 42 బాబర్ డ్యూయల్ టోన్ జాస్పర్ రెడ్ ధర రూ. 2,09,187