Jawa 42 Bobber Launched In India: Check Price Details And Specifications - Sakshi
Sakshi News home page

జావా అదిరిపోయే కొత్త బైక్‌ చూశారా? ధర కూడా అంతే అదుర్స్‌

Published Thu, Oct 6 2022 1:01 PM | Last Updated on Thu, Oct 6 2022 3:01 PM

Jawa 42 Bobber Launched Priced From Rs 2 Lakhs - Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ బైక్‌ మేకర్‌ జావా  కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. జావా 42 బాబర్  పేరుతో  సూపర్‌  బైక్‌ను తీసుకొచ్చింది.సరికొత్త డిజైన్‌తో, అప్‌గ్రేడెడ్‌ ఫీచర్స్‌తో వస్తున్న ఈ  బైక్‌ ధరను  ధర రూ. 2.06 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. (Akasa Air ఆఫర్‌: వారి సంబరం మామూలుగా లేదుగా!)

 

జావా 42 బాబర్   మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్, డ్యూయల్ టోన్ జాస్పర్ రెడ్ మూడు రంగుల్లో  లభిస్తుంది.  టెస్ట్ రైడ్‌లతో పాటు వచ్చే వారం ప్రారంభంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.  కొత్త రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, కొత్త హ్యాండిల్ బార్, కొత్త ఫ్యూయల్ ట్యాంక్, రీడిజైన్ చేసిన సీట్లు ప్రధాన ఫీచర్లుగా ఉండగా,  ఇంకాకన్సోల్ LCD స్క్రీన్‌, ఫంక్షన్‌లను నియంత్రించడానికి కొత్త స్విచ్‌గేర్ కూడా జోడించింది. ఫ్లోటింగ్ సీటు 2స్టెప్‌  ఎడ్జస్టబుల్‌   ఫీచర్‌తో రైడర్‌ తనకనుగుణంగా  ముందుకి, వెనక్కీ  ఎడ్జస్ట్‌ చేసుకోవచ్చు.   

ఇంజీన్‌: ఇక ఇంజీన్‌ విషయానికి వస్తే జావా పెరాక్‌ మాదిరిగానే  334cc ఇంజన్‌ అందించింది. ఇది 30.64 PS పవర్, 32.74 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌, రీట్యూన్డ్ సస్పెన్షన్,రీకాలిబ్రేటెడ్ బ్రేక్‌, కాంటినెంటల్ డ్యూయల్ ఛానల్ ABSని ప్రామాణికంగా అందిస్తున్నట్టు జావా వెల్లడించింది. 

ధరలు
జావా 42 బాబర్ మిస్టిక్ కాపర్  ధర రూ. 2,06,500
జావా 42 బాబర్ మూన్‌స్టోన్ వైట్ ధర రూ.2, 07,500
జావా 42 బాబర్ డ్యూయల్ టోన్ జాస్పర్ రెడ్ ధర రూ. 2,09,187

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement