Luxury bike manufacturing
-
జావా అదిరిపోయే కొత్త బైక్ చూశారా? ధర కూడా అంతే అదుర్స్
న్యూఢిల్లీ: లగ్జరీ బైక్ మేకర్ జావా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. జావా 42 బాబర్ పేరుతో సూపర్ బైక్‌ను తీసుకొచ్చింది.సరికొత్త డిజైన్‌తో, అప్‌గ్రేడెడ్ ఫీచర్స్‌తో వస్తున్న ఈ బైక్ ధరను ధర రూ. 2.06 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. (Akasa Air ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!) జావా 42 బాబర్ మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్, డ్యూయల్ టోన్ జాస్పర్ రెడ్ మూడు రంగుల్లో లభిస్తుంది. టెస్ట్ రైడ్లతో పాటు వచ్చే వారం ప్రారంభంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కొత్త రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, కొత్త హ్యాండిల్ బార్, కొత్త ఫ్యూయల్ ట్యాంక్, రీడిజైన్ చేసిన సీట్లు ప్రధాన ఫీచర్లుగా ఉండగా, ఇంకాకన్సోల్ LCD స్క్రీన్, ఫంక్షన్లను నియంత్రించడానికి కొత్త స్విచ్‌గేర్ కూడా జోడించింది. ఫ్లోటింగ్ సీటు 2స్టెప్ ఎడ్జస్టబుల్ ఫీచర్‌తో రైడర్ తనకనుగుణంగా ముందుకి, వెనక్కీ ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంజీన్: ఇక ఇంజీన్ విషయానికి వస్తే జావా పెరాక్ మాదిరిగానే 334cc ఇంజన్ అందించింది. ఇది 30.64 PS పవర్, 32.74 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ ట్రాన్స్మిషన్, రీట్యూన్డ్ సస్పెన్షన్,రీకాలిబ్రేటెడ్ బ్రేక్, కాంటినెంటల్ డ్యూయల్ ఛానల్ ABSని ప్రామాణికంగా అందిస్తున్నట్టు జావా వెల్లడించింది. ధరలు జావా 42 బాబర్ మిస్టిక్ కాపర్ ధర రూ. 2,06,500 జావా 42 బాబర్ మూన్‌స్టోన్ వైట్ ధర రూ.2, 07,500 జావా 42 బాబర్ డ్యూయల్ టోన్ జాస్పర్ రెడ్ ధర రూ. 2,09,187 -
హైదరాబాద్ సమీపంలో రీగల్ రాప్టార్ బైక్స్ ప్లాంట్
ఆటోమోటివ్ పార్కులో ఏర్పాటు ► ఫ్యాబ్ మోటార్స్ 1,000 కోట్ల పెట్టుబడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ బైక్‌ల తయారీలో ఉన్న అమెరికా కంపెనీ రీగల్ రాప్టార్ మోటార్‌సైకిల్స్ భారత్‌లో అడుగు పెట్టింది. సంస్థ భారతీయ భాగస్వామి అయిన ఫ్యాబులస్ అండ్ బియాండ్ మోటార్స్ ఇండియా(ఫ్యాబ్ మోటార్స్) తొలి షోరూంను హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించింది. ఫ్యాబ్ మోటార్స్ నగరం సమీపంలోని కలకల్ వద్ద ఉన్న ఆటోమోటివ్ పార్కులో అసెంబ్లింగ్ ప్లాంటును సైతం ఏర్పాటు చేస్తోంది. రీగల్ రాప్టార్, ఫ్యాబ్ మోటార్స్‌లు సంయుక్తంగా మూడేళ్లలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. తొలి దశలో షిఫ్ట్‌కు నెలకు 500 బైక్‌ల తయారీ సామర్థ్యంతో ఏడాదిలో ప్లాంటు సిద్ధమవుతుందని ఫ్యాబ్ మోటార్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎంజీ షారిఖ్ తెలిపారు. ఫ్యాబ్ రీగల్ రాప్టార్ మోటార్ సైకిల్స్ చైర్మన్ ఎంజీ జిలానితో కలసి సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. 100% ఇక్కడే..: ప్లాంటు ఏర్పాటుకు పార్కులో 20 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. మొత్తం 100 ఎకరాలు అవసరమవుతాయని షారిఖ్ తెలిపారు. ‘మూడు నెలల్లో కంపెనీ చేతికి స్థలం వస్తుందని ఆశిస్తున్నాం. తొలుత విడిభాగాల రూపంలో(సీకేడీ) బైక్‌లను దిగుమతి చేస్తాం. రానున్న రోజుల్లో అన్ని విడిభాగాలను ఇక్కడే ఉత్పత్తి చేస్తాం. విడిభాగాల తయారీ కంపెనీలతో యూనిట్లు పెట్టాలని కోరుతున్నాం. ఏడాదిన్నరలో పూర్తి బైక్‌ను తయారు చేయాలన్నది లక్ష్యం. ప్రత్యక్షంగా 13 వేలు, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది. బైక్‌లను విదేశాలకు ఎగుమతి చేస్తాం’ అన్నారు. దేశవ్యాప్తంగా షోరూంలు.. ఫ్యాబ్ మోటార్స్ ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 16 షోరూంలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం బాబర్ 350, డేటోనా 350, క్రూయిజర్ 350 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 500, 800తోపాటు 1,600 సీసీ మోడళ్లు కూడా రానున్నాయి. బైక్‌ల ధర రూ.2.90-20 లక్షల మధ్య ఉంది. సీకేడీ రూపంలో దిగుమతి చేస్తే 10 శాతం, పూర్తిగా తయారైన బైక్‌కు 150 శాతం దిగుమతి పన్ను ఉందని కంపెనీ తెలిపింది. బైక్‌లను ఇక్కడ తయారు చేస్తే తుది ఉత్పాదన ధర 20 శాతం వరకు తగ్గొచ్చు. రీగల్ రాప్టార్ 39 దేశాల్లో బైక్‌లను విక్రయిస్తోంది.