ప్రముఖ బైక్ తయారీ సంస్థ జావా మోటార్‌సైకిల్ అప్డేటెడ్ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త జావా 42 బైక్ ధరలు రూ. 1.73 లక్షల నుంచి రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 16000 తక్కువ ధరకే లభిస్తుంది.
2024 జావా 42 బైక్ 294 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 27.32 హార్స్ పవర్ మరియు 26.84 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. రీడిజైన్ పొందిన ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. అనలాగ్ ఎల్సీడీ సెటప్ కూడా ఇందులో గమనించవచ్చు.
మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ బైక్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. అప్డేటెడ్ జావా 42 సీటు ఎత్తు 788 మిమీ వరకు ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
The 2024 Jawa 42 is here! This is the answer you’ve been waiting for. With the perfect trinity of Performance, Neo-Classic Design and Engineering - you are in for a ride like no other!#Jawa42TheAnswer #Jawa42 #JPanther #JawaMotorcycles pic.twitter.com/AA4qFLCT3g
— Jawa Motorcycles (@jawamotorcycles) August 13, 2024
Comments
Please login to add a commentAdd a comment