మార్కెట్లో లక్ష రూపాయల నుంచి రూ.70 లక్షల వరకు బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. చాలామంది ధరను మాత్రమే కాకుండా మైలేజ్‌ను దృష్టిలో ఉంచుకుని టూ వీలర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైకులు గురించి వివరంగా తెలుసుకుందాం.
బజాజ్ ఫ్రీడమ్ 125
'బజాజ్ ఫ్రీడమ్ 125' అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్. దీని ధర రూ.89,997 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.3 బిహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇందులో సీఎన్‌జీ, పెట్రోల్ కోసం రెండు ఫ్యూయల్ ట్యాంకులు ఉంటాయి. ఈ బైక్ 65 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' ఒకటి. ఈ బైక్ ధరలు రూ. 75541 నుంచి రూ. 78541 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైకులో ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ETFi) టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ పనితీరును అందిస్తుంది. ఈ బైకులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 86 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.
బజాజ్ ప్లాటినా 110
రూ. 71,354 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తున్న బజాజ్ ప్లాటినా 110 బైక్ 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ ఇంజిన్ 8.4 బీహెచ్‌పీ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో ఎల్ఈడీ డీఆర్ఎల్, హ్యాండ్ గార్డ్‌లు, వైడ్ ఫుట్‌పెగ్‌లు, 5 స్పీడ్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి.
హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్
హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్ కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో ఒకటి. రూ. 74401 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ బైక్ 110 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది జపనీస్ ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్ (ESP) టెక్నాలజీ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ 65 కిమీ/లీ అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..
హీరో స్ప్లెండర్ ప్లస్
భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ ధరలు రూ. 75441 నుంచి రూ. 78286 మధ్య ఉన్నాయి. 100 సీసీ ఇంజిన్, ఐ3ఎస్ టెక్నాలజీ కలిగిన ఈ బైక్ 80.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి దీనిని మైలేజ్ రాజు అని కూడా పిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment