సాధారణంగా చాలామంది వాహన వినియోగదారులు మంచి మైలేజ్ అందించి సరసమైన ధర వద్ద లభించే వాహనాలను (బైకులు, కార్లు) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దేశీయ విఫణిలో ద్విచక్ర వాహన విభాగంలో సరసమైన ధర వద్ద లభించే ఐదు బైకులు గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.
హీరో హెచ్ఎఫ్ 100:
భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ధర రూ. 54,962 (ఎక్స్-షోరూమ్). ఇది 97 సీసీ ఇంజిన్ కలిగి 8 హెచ్‌పి పవర్ 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ కేవలం ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్:
హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ మన జాబితాలో సరసమైన ధర వద్ద లభించే పాపులర్ బైక్. దీని ధర రూ. 61,232 నుంచి రూ. 68,382 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 100 సిసి విభాగంలో తిరుగులేని అమ్మకాలు పొందుతూ ఇప్పటికీ ఎక్కువ మంది కస్టమర్ల మనసు దోచేస్తున్న బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కావడం విశేషం.
టీవీఎస్ స్పోర్ట్:
టీవీఎస్ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒకటి 'టీవీఎస్ స్పోర్ట్' బైక్. దీని ధర రూ. 61,500 నుంచి రూ. 69,873 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్న ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ కలిగి 8.3 హెచ్‌పి పవర్ 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
హోండా షైన్ 100:
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఎక్కువ అమ్ముడవుతున్న బైకులలో హోండా షైన్ 100 కూడా ఒకటి. దీని ధర రూ. 64,900 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 99.7 సీసీ ఇంజిన్ కలిగి 7.61 హెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రిక్ స్టార్టర్ పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన సెల్ఫ్-స్టార్ట్ మోటార్‌సైకిల్‌గా నిలిచింది.
బజాజ్ ప్లాటినా 100:
భారతీయ మార్కెట్లో లభించే సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా 100. ఈ బైక్ ధర రూ.67,475 (ఎక్స్-షోరూమ్). ఇది సిగ్నేచర్ DTS-i టెక్నాలజీ 102 సిసి ఇంజిన్ ద్వారా 7.9 హెచ్‌పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment