గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్‌లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
కవాసకి జెడ్ఎక్స్-6ఆర్
కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
కవాసకి ఎలిమినేటర్ 500
ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది.
ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే?
బజాజ్ చేతక్ ప్రీమియం
ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్‌డేట్‌లు, నోటిఫికేషన్ అలర్ట్ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు.
ఏథర్ 450 అపెక్స్
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment