భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను వినియోగించాలనే ఆసక్తికలిగిన కస్టమర్ల కోసం కంపెనీలు కూడా ఆధునిక వెహికల్స్ విడుదల చేస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగే వచ్చే నెలలో కూడా కొన్ని లేటెస్ట్ కార్లు, బైకులు దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్నాయి. వచ్చే నెల నుంచి బీఎస్6 పేస్-2 ఎమిషన్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొత్తగా విడుదలయ్యే వాహనాలు తప్పకుండా దానికి లోబడి ఉండాలి.
సింపుల్ వన్:
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికీ విక్రయానికి రాలేదు, ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో గొప్ప ఆదరణ పొందిన ఈ టూ వీలర్ బుకింగ్స్ పరంగా కూడా ఉత్తమ వృద్ధిని కనపరిచింది. కాగా ఈ స్కూటర్ వచ్చే నెల ప్రారంభం నుంచి విక్రయానికి రానున్న సమాచారం.
డుకాటీ మాన్స్టర్ ఎస్పీ:
ద్విచక్ర వాహన ప్రియులకు ఎంతగానో ఇష్టమైన బైకులతో ఒకటైన డుకాటీ 2023 ఏప్రిల్ చివరి నాటికి తన మాన్స్టర్ ఎస్పీ బైక్ విడుదల చేయాలని ఆలోచిస్తోంది. కంపెనీ గతంలోనే 9 బైకులను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో మరిన్ని డుకాటీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది.
హోండా యాక్టివా 125 హెచ్- స్మార్ట్:
హోండా మోటార్‌సైకిల్ దేశీయ మార్కెట్లో వచ్చే నెలలో ఇప్పటికే విక్రయానికి ఉన్న యాక్టివా స్కూటర్‌లో కొత్త వెర్షన్ విడుదల చేయనుంది. దీని పేరు 'హోండా యాక్టివా 125 హెచ్-స్మార్ట్'. దీనికి సంబంధించిన చాలా వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. కావున డిజైన్ పరంగా పెద్ద తేడా లేనప్పటికీ.. రిమోట్ ఇంజిన్ స్టార్ట్, కీలెస్ ఇగ్నీషన్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయని తెలిసింది.
2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్:
ఇప్పటికే భారతదేశంలో విడుదల కావాల్సిన 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్ బైకులు కొన్ని అనివార్య కారణాల వల్ల లాంచ్ కాలేదు. అయితే ఇవి రెండూ వచ్చే నెలలో విడుదలకానున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ బైకులకు సంబంధిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment