దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో బైక్‌ను విడుదల చేయనుంది. హంటర్ 350 పేరుతో ఆదివారం ఈ బైక్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఈ బైక్ ధర రూ.1,30,000 నుంచి రూ.1,40,000 ధర మధ్యలో ఉండనుంది. ప్రస్తుతం ఈ బైక్ తరహాలో టీవీఎస్ రోనిన్, ట్రయంఫ్ బోన్నెవిల్లే టీ120, రాయిల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఉండనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
హంటర్ 350 స్పెసిఫికేషన్స్
రాయిల్ ఎన్ ఫీల్డ్ సంస్థ హంటర్ 350ని నేటి తరం ట్రెండ్‌కు తగ్గట్లుగా డిజైన్ చేయాలని భావించింది. అనుకున్నట్లుగానే బైక్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెహికల్ చాసిస్(బైక్ బాడీ)ను పలు మార్లు డిజైన్ చేయడం అవి నచ్చకపోవడం చివరకు ఈ తరహాలో తయారు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
మిగిలిన బైక్స్‌తో పోలిస్తే రాయిల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ రేంజ్,ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్‌ను అమర్చారు. హంటర్‌లో రౌండ్ లైట్ క్లస్టర్‌లు,స్పీడ్‌ను కంట్రోల్ చేసే ట్విన్ రియర్ షాక్‌లు వంటి అనేక క్లాసిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ డిజైన్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంది. అయితే మొత్తం డిజైన్ 350 సీసీ శ్రేణిలో క్రూయిజర్ కంటే రోడ్‌స్టర్‌గా ఉంది. సీసీ ఒకేలా ఉన్నా బైక్ డిజైన్ ప్రత్యేకంగా ఉందని రాయల్ ఎన్‌ఫీల్డ్ చెబుతోంది.
ఈ బైక్‌లో స్పీడ్‌ను కంట్రోల్ చేయడం లేదంటే పెంచేందుకు ఉపయోగపడే ఫ్రంట్ పోర్క్‌ను 41ఎంఎం(మిల్లీ మీటర్స్) నుండి 130ఎంఎం వరకు అందించింది. అయితే వెనుక భాగంలో 6 దశల ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్,102ఎంఎం వీల్ ట్రావెల్‌తో ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్‌లతో డిజైన్ చేసింది. 17అంగుళాల టైర్లను అమర్చింది.
టియర్ డ్రాప్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, రైడర్‌కు మోకాళ్లపై స్ట్రెస్ తగ్గించింది. ఫ్రీగా ఉండేలా డ్రైవింగ్ సీటు వెనుక బాగా ఫ్లాట్‌గా ఉండేలా రూపొందించింది. అయితే ఫుట్ పెగ్‌లు మరింత వెనక‍్కి జరిపి స్పోర్టియర్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ఈ బైక్‌లో టెయిల్ ల్యాంప్ ఎల్‌ఈడీ యూనిట్ అయితే హెడ్‌ల్యాంప్ హాలోజన్ బల్బ్‌తో వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment