న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగంలో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా థాయ్‌లాండ్‌లో అసెంబ్లీ ప్లాంటును ప్రారంభించినట్లు ఐషర్ మోటార్స్ బుధవారం తెలిపింది. విడిభాగాలను దిగుమతి చేసుకుని ఈ కేంద్రంలో వాహనాల అసెంబుల్ చేస్తారు.
‘అపారమైన వృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ విస్తరణ వ్యూహాన్ని కలిగి ఉండటమే మా వ్యూహాత్మక ఉద్దేశం. థాయ్‌లాండ్ అసెంబ్లీ ప్లాంట్ ఈ విజన్‌ను అందిస్తుంది’ అని రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో బి.గోవిందరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జెంటీనా, కొలంబియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఇటువంటి అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. నూతన ఫెసిలిటీ థాయ్‌లాండ్‌లో మిడ్–సెగ్మెంట్ మార్కెట్‌ను వృద్ధి చేయడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నామని రాయల్ ఎన్‌ఫీల్డ్ సీసీవో యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.
అలాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌ను సమర్ధవంతంగా తీర్చడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. కొత్త ప్లాంట్ సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ యూనిట్లను అసెంబుల్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. థాయ్‌లాండ్ మార్కెట్‌తో ప్రారంభించి దశలవారీగా ఈ ప్రాంతంలో విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment