Yezdi Motorcycles
-
ఇదే మంచి తరుణం.. ప్రీమియం బైక్‌లపై భారీ డిస్కౌంట్లు
పండుగ సీజన్లో మంచి ప్రీమియం బండి కొనాలనుకుంటున్నవారికి ఇదే మంచి సమయం. జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ తమ బైక్‌లపై పలు ఆఫర్లను ప్రకటించింది. జావా/యెజ్డీ బండిని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుండి బుక్ చేసుకుంటే వివిధ బ్యాంకులు అందించే డిస్కౌంట్లతో పాటు రూ.22,500 వరకు ఆదా చేసుకోవచ్చు.ఫ్లిప్‌కార్ట్‌లో జావా/యెజ్డీ బైక్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే.. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.8,500 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 12,500 నుండి రూ.22,500 వరకు స్ట్రెయిట్ అప్ డిస్కౌంట్‌తోపాటు రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.జావా యెజ్డీ మోటార్‌సైకిళ్లపై కంపెనీ ప్రాంతాలవారీగానూ ఆఫర్లను అందిస్తోంది. దేశంలోని దక్షిణ, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ.19,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , నాలుగు సంవత్సరాల లేబర్-ఫ్రీ పీరియాడిక్ సర్వీస్, నాలుగేళ్లు లేదా 50,000 కి.మీ వారంటీ ఉన్నాయి.తూర్పు ప్రాంత కస్టమర్లకు రూ.14,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.1,500 విలువైన రోడ్ సైడ్ అసిస్టెన్స్, రూ.2,500 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు. ఇక ఉత్తర భారతదేశంలోని కస్టమర్లకు రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతోపాటు సులభమైన ఫైనాన్స్ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. కొత్త యెజ్డీ అడ్వెంచర్‌ని కొనుగోలు చేసేవారు రూ.16,000 విలువైన ట్రయల్ ప్యాక్ యాక్సెసరీస్ ప్యాకేజీని ఉచితంగా అందుకోవచ్చు. -
అక్కడ డొక్కు డొక్కు.. ఇక్కడ డుగ్గు డుగ్గు
రాయల్ ఎన్ఫీల్డ్.. యెజ్డీ.. జావా.. నార్టన్... బీఎస్ఏ.. విశ్వ విఖ్యాత బైక్ బ్రాండ్లు ఇవి. విదేశాల్లో మనుగడ సాధించలేక చేతులెత్తేసిన ఈ బ్రాండ్లన్నీ భారతీయుల చేతిలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మకాల్లో దుమ్మురేడమే కాదు.. మళ్లీ వాటిని గ్లోబల్ బ్రాండ్లుగా నిలబెట్టి మనోళ్లు సత్తా చాటుతున్నారు!మహీంద్రా కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏను భారత్‌లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అక్కడ మూసేసిన ఈ కంపెనీని కొనుగోలు చేసి, మన మార్కెట్లో లాంచ్ చేసింది. విదేశీ బ్రాండ్లకు మన దగ్గర తిరిగి జీవం పోస్తూ... 1994లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌లో కార్యకలాపాలను నిలిపేసిన బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ను ఐషర్ గ్రూప్ 1994లో చేజిక్కించుకుంది. అయితే, మన దగ్గర ఈ బ్రాండ్‌ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీకి 15 ఏళ్లు పట్టింది. 2009లో క్లాసిక్ 350, క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లు డుగ్గు డుగ్గు మంటూ మళ్లీ మన రోడ్లపై పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు యువతకు ఈ మోటార్ సైకిల్స్ అంటే ఎంత క్రేజో చెప్పాల్సిన పని లేదు! ‘2009లో విడుదల చేసిన క్లాసిక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ కంపెనీగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. మొదట్లో ఏడాదికి 50,000 బుల్లెట్లను అమ్మడమే గగనంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం అనేక మోడల్స్ దన్నుతో వార్షిక సేల్స్ 8.5 లక్షలకు ఎగబాకాయి’ అని కంపెనీ సీఈఓ గోవిందరాజన్ పేర్కొన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ 75 లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించగా అందులో 40 లక్షలు క్లాసిక్ మోడల్ కావడం మరో విశేషం. ఈ నెల 12న కూడా కంపెనీ కొత్త క్లాసిక్‌ను ప్రవేశపెట్టింది.యెజ్డీ.. కుర్రకారు హార్ట్ ‘బీట్’ అనుపమ్ తరేజా సారథ్యంలోని క్లాసిక్ లెజెండ్.. గ్లోబల్ బైక్ బ్రాండ్స్ జావా, యెజ్డీ, బీఎస్ఏలను భారతీయులకు మళ్లీ పరిచయం చేసింది. 1970లో మార్కెట్ నుంచి వైదొలగిన చెక్ కంపెనీ జావా.. 2018లో మనోళ్ల చేతికి చిక్కింది. అప్పటి నుంచి 1.4 లక్షల జావాలు రోడ్డెక్కాయి. గత నెల 13న జావా 42 మోడల్‌ను సైతం రంగంలోకి దించింది. ఇక అప్పట్లో అదిరిపోయే బీట్తో కుర్రోళ్ల మనను కొల్లగొట్టిన యెజ్డీ కూడా 1996లో అస్తమించి.. 2022లో లెజెండ్స్ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. 60 వేల బైక్‌లు ఇప్పటిదాకా అమ్ముడవ్వడం విశేషం. బీఎస్ఏ అయితే, 1973లోనే మూతబడింది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోటాపోటీగా దక్కించుకుని యూకేతో పాటు భారత్‌లోనూ మళ్లీ ప్రవేశ పెట్టారు.అదే బాటలో టీవీఎస్, హీరో... ఇక దేశీ దిగ్గజం టీవీఎస్ కూడా మరో విఖ్యాత బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్‌ను కేవలం రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 నాటికి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టడంతో పాటు మూడేళ్లలో ఆరు కొత్త నార్టన్ బైక్‌లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ ప్రఖ్యాత బ్రాండ్లను దక్కించుకోవడంతో పాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని అలాగే కొనసాగించడం ద్వారా ఒరిజినాలిటీని కాపాడుతున్నామని తరేజా వ్యాఖ్యానించారు. బీఎస్ఏను భారత్‌లోనే తయారు చేస్తున్నా, దాని బ్రిటిష్ బ్రాండ్ ప్రాచుర్యం పదిలంగా ఉందన్నారు. ఇక భారత్‌లో నేరుగా ప్లాంట్ పెట్టి, చేతులెత్తేసిన హార్లీ డేవిడ్సన్కు హీరో మోటోకార్ప్ దన్నుగా నిలిచింది. ఆ కంపెనీతో జట్టుకట్టి మళ్లీ హార్లీ బైక్‌లను భారతీయులకు అందిస్తోంది. ఎక్స్440 బైక్‌ను ఇక్కడే అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని దేశీయంగా హీరో ఉత్పత్తి చేస్తున్పప్పటికీ, ప్రామాణిక హార్లీ బైక్ బ్రాండ్ విలులో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోషెన్ జీట్స్ పేర్కొన్నారు. భారత్‌లో నేరుగా విక్రయాల్లో వెనుకబడ్డ బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్‌తో జట్టుకట్టింది. టీవీఎస్ రూపొందించిన 500 సీసీ లోపు బైక్‌లు 60 వేలకు పైగా అమ్ముడవ్వడం మనోళ్ల సత్తాకు నిదర్శనం! → 2015లో మహీంద్రా మెజారిటీ పెట్టుబడితో ఫై క్యాపిటల్ ఓనర్ అనుపమ్ తరేజా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీని నెలకొల్పారు. జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి గ్లోబల్ ఐకాన్లను దక్కించుకుని, పునరుద్ధరించారు.→ 2013లో టీవీఎస్ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌తో డీల్ కుదుర్చుకుంది, తద్వారా ప్రపంచ మార్కెట్ కోసం 500 సీసీ లోపు బైక్‌లను అభివృద్ధి చేసి, ఇంటా బయటా విక్రయిస్తోంది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్‌ను కొనుగోలు చేసింది; వచ్చే మూడేళ్లలో ఆరు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉంది.→ 1994లో ఐషర్ గ్రూప్ ఇంగ్లాండ్‌లో పూర్తిగా అమ్మకాలను నిలిపేసిన బ్రిటిష్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ను చేజిక్కించుకుంది. 2009లో ‘క్లాసిక్’ బ్రాండ్‌కు తిరిగి జీవం పోయడంమే కాదు.. గ్లోబల్ కంపెనీగా దీన్ని మళ్లీ నిలబెట్టింది.→ 2023లో హీరో మోటోకార్ప్ భారత్‌లో విఫలమై షట్టర్ మూసేసిన హార్లే డేవిడ్సన్కు మళ్లీ ఇక్కడ ప్రాణం పోసింది. ఎక్స్440 మోడల్‌ను విడుదల చేసి సక్సెస్ కొట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కాలంలో కలిసిపోయిన జావా & యెజ్డీ బైకులు (ఫోటోలు)
-
Women’s Day 2023: మహిళల కోసం జావా యెజ్డీ ముందడుగు
భారతదేశంలో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్ 'జావా యెజ్డీ మోటార్ మోటార్‌సైకిల్స్' మహిళల కోసం బైక్ రైడ్ ప్రారంభించింది. 2023 మార్చి 5న దేశంలోని మహిళా రైడర్ల స్ఫూర్తిని పురస్కరించుకుని ఢిల్లీ, బెంగళూరు, పూణే, చెన్నై, గౌహతి వంటి నగరాల్లో రైడింగ్ ప్రారంభించింది. ఈ రైడింగ్‌లో సుమారు 150 మంది మహిళా రైడర్లు పాల్గొన్నారు. ఈ రైడ్లలో పాల్గొన్న మహిళలు సమాజంలోని అణగారిన వర్గాల మహిళల ఋతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడంలో సహాయపడ్డారు. కంపెనీ నిర్వహించిన ఢిల్లీ రైడ్‌లో ప్రముఖ ర్యాలీ రైడర్ 'గరిమా అవతార్' పాల్గొన్నారు. ఈ రైడ్‌లో ఆమె పాల్గొనడం వల్ల తోటి మహిళలు కూడా చాలా ఉత్సాహాన్ని కనపరిచాడు. ఈ రైడ్స్ బ్రాండ్ డీలర్‌షిప్‌ల నుండి ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా సామాజిక కార్యక్రమాలు, రిఫ్రెష్మెంట్ల కోసం అనేక స్టాప్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రైడ్లలో పాల్గొన్న రైడర్లు వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలకు ఫుడ్ ప్యాకెట్లు, శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేశారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' కొత్త లగ్జరీ కారు: ధర ఎంతంటే?) ఈ సందర్భంగా జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ సీఈఓ 'ఆశిష్ సింగ్ జోషి' మాట్లాడుతూ.. కంపెనీ బైకులపై మహిళకు అనుభూతి పెరుగుతోందని, మహిళా రైడింగ్ వంటి వాటిని ప్రోత్సహించడంలో మేము ముందుంటామని, వివిధ మహిళా సంక్షేమ అంశాలపై అవగాహన కల్పించడంలో తప్పకుండా ముందుకు వస్తామని అన్నారు. -
‘రెడ్ హాట్’ ఆనంద్ మహీంద్ర ట్వీట్: ఇంతకీ అదేంటి?
సాక్షి, ముంబై: ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఆనంద్ మహీంద్రా తాజాగా 'రెడ్ హాట్' (Red Hot) అంటూ ట్విటర్లో ఒక ఫోటో షేర్ చేశారు. ఇందులో యెజ్డీ రోడ్‌స్టర్ డ్యూయెల్ కలర్ బైక్ చూడవచ్చు. ధర 2.40 లక్షలు ఇటీవలే కంపెనీ తన యెజ్డీ రోడ్‌స్టర్ బైకుని క్రిమ్సన్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 2.04 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కలర్ ఆప్సన్ కాకుండా యెజ్డీ రోడ్‌స్టర్ స్మోక్ గ్రే, సిన్ సిల్వర్, హంటర్ గ్రీన్, గాలియంట్ గ్రే, స్టీల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ బైక్ కలర్ ఆప్సన్ కాకుండా ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. ఇందులోని 334 సిసి సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 29.3 బిహెచ్పి పవర్, 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 6 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. పనితీరు పరంగా దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. యెజ్డీ రోడ్‌స్టర్ రౌండ్ హెడ్‌ల్యాంప్, డిజిటల్ స్పీడోమీటర్, హెడ్‌లైట్ గ్రిల్, USB టైప్-సి ఛార్జింగ్ సాకెట్, సింగిల్-పీస్ సీట్ కలిగి సేడ్ లో కీ హోల్పొందుతుంది . ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు. సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. Red Hot… https://t.co/VPV2OKDyjX — anand mahindra (@anandmahindra) February 15, 2023 -
యెజ్డీ మళ్లీ వచ్చింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కుర్రకారును 90వ దశకం వరకు ఉర్రూతలూగించిన చెక్ బ్రాండ్ యెజ్డీ బైక్స్ మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాయి. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో ఒకేసారి మూడు మోడళ్లు గురువారం ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ ఉన్నాయి. 26 ఏళ్ల విరామం తర్వాత పోటీ ధరతో యెజ్డీ కొత్త జర్నీ ప్రారంభించడం విశేషం. మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ భారత్‌లో జావా, బీఎస్‌ఏతోపాటు తాజాగా యెజ్డీ బ్రాండ్‌ను పరిచయం చేసింది. 1996 వరకు యెజ్డీ బైక్స్ దేశంలో అందుబాటులో ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్, హోండా, కేటీఎంకు ఇప్పుడు యెజ్డీ గట్టి పోటీ ఇవ్వనుంది. ఢిల్లీ ఎక్స్ షోరూంలో ధర మోడల్, వేరియంట్‌నుబట్టి రూ.1.98 లక్షల నుంచి రూ.2.18 లక్షల వరకు ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వద్ద ఉన్న ప్లాం టులో ఇవి తయారవుతున్నాయి. ఏటా 5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఇవీ ఫీచర్ల వివరాలు.. అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ మోడళ్లు 334 సీసీ సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డీవోహెచ్సీ ఇంజిన్‌తో తయారయ్యాయి. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్, కాన్స్టాంట్ మెష్ 6 స్పీడ్ గేర్ బాక్స్, ఏబీఎస్, 29.1–30.2 పీఎస్ పవర్, డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ వంటి హంగులు ఉన్నాయి. ట్యాంక్ సామర్థ్యం మోడల్‌నుబట్టి 12.5–15.5 లీటర్లు. బరువు 182–188 కిలోలు. సింగిల్ సైడ్ ఎగ్జాస్ట్‌తో అడ్వెంచర్, ట్విన్ ఎగ్జాస్ట్‌తో మిగిలిన రెండు మోడళ్లు రూపుదిద్దుకున్నాయి. విస్తృత స్థాయిలో 14 రంగులు కస్టమర్లను అలరించనున్నాయి. రూ.5 వేలు చెల్లించి బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు సైతం మొదలైనట్టు క్లాసిక్ లెజెండ్స్ కో–ఫౌండర్ అనుపమ్ థరేజా ఈ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ పునరుద్ధరణ, డిజైన్, ఆర్అండ్డీ, పారిశ్రామికీకరణకు క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటి వరకు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. It's not a motorcycle, it's an emotion. It's an era. It's a way of life. And we're back, thundering thrice in three new avatars! Book your test rides now - https://t.co/esLonZ0DEr .#NotForTheSaintHearted #Yezdi #YezdiIsBack #YezdiMotorcycles #YezdiForever pic.twitter.com/WvwiiVoA2Z — yezdiforever (@yezdiforever) January 13, 2022 -
రెట్రో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! సరికొత్తగా యెజ్దీ బైక్..! లాంచ్ ఎప్పుడంటే!
Classic Legends Announces Ressurection Date For Yezdi Motorcycles: జావా మోటార్ సైకిల్స్, బీఎస్ఏ క్లాసిక్ లెజెండ్స్ తరువాత భారత్‌లోకి మరో రెట్రో బైక్ మార్కెట్లలోకి రానుంది. రెట్రో బైక్స్‌లో యెజ్దీ బైక్‌లకు ఉండే క్రేజే వేరు. యెజ్దీ రయ్ రయ్‌మంటూ చేసే సౌండ్ బైక్ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేస్తుంది. ట్విన్ సైలెన్సర్ బైక్‌లను యెజ్దీ రూపొందించింది. భారత్‌లో యెజ్దీ బైక్స్ మరోసారి కనువిందు చేయనున్నాయి. యెజ్డిస్ భారతీయ మోటర్‌స్పోర్ట్ రంగంలో కూడా బలమైన ఖ్యాతిని కలిగి ఉంది. 1980-1990లలో వీపరితమైన క్రేజ్‌ను యెజ్దీ రోడ్ కింగ్ బైక్‌లకు వచ్చింది. మహీంద్రా గ్రూప్‌తో పునరాగమనం..! భారత మార్కెట్లలోకి తొలుత జావా మోటార్స్ యెజ్దీ బైక్‌లను లాంచ్ చేయాలని భావించింది. అది కాస్త వీలు కాకపోవడంతో మహీంద్రా గ్రూప్‌కు చెందిన క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యెజ్దీ బైక్‌లను భారత్‌లో పరిచయం చేయనుంది. ఫోటో క్రెడిట్: MotorBeam లాంచ్ ఎప్పుడంటే..! ట్విన్ సైలెన్సర్ బైక్ యెజ్దీ భారత్‌లో వచ్చే ఏడాది జనవరి 13న లాంచ్ కానుంది. యెజ్దీ బైక్స్‌లో భాగంగా కనీసం మూడు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యెజ్దీ తన లైనప్‌లో అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేయనుంది. ఈ బైక్‌ల ధర, స్పెసిఫికేషన్లు, లభ్యతపై మరిన్ని వివరాలు వచ్చే నెలలో తెలియనున్నాయి. ఫోటో క్రెడిట్: MotorBeam యెజ్దీ బైక్ స్పెసిఫికేషన్స్ అంచనా..! జావా మోటార్‌సైకిల్ పెరాక్‌లో కనిపించే 334 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. పెరాక్ సుమారు 30 బీహెచ్పీ 32.74 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కాగా ఈ బైక్ పూర్తి వివరాలు తెలియాలంటే లాంచ్ డేట్ వరకు ఆగాల్సిందే. చదవండి: ఊపిరి పీల్చుకోండి..! 2022లో మరోసారి భారీగా పెరగనున్న ఆయా వస్తువుల ధరలు..!