
సాక్షి, ముంబై: ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఆనంద్ మహీంద్రా తాజాగా 'రెడ్ హాట్' (Red Hot) అంటూ ట్విటర్‌లో ఒక ఫోటో షేర్ చేశారు. ఇందులో యెజ్డీ రోడ్‌స్టర్ డ్యూయెల్ కలర్ బైక్ చూడవచ్చు.
ధర 2.40 లక్షలు
ఇటీవలే కంపెనీ తన యెజ్డీ రోడ్‌స్టర్ బైకుని క్రిమ్సన్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 2.04 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కలర్ ఆప్సన్ కాకుండా యెజ్డీ రోడ్‌స్టర్ స్మోక్ గ్రే, సిన్ సిల్వర్, హంటర్ గ్రీన్, గాలియంట్ గ్రే, స్టీల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఈ బైక్ కలర్ ఆప్సన్ కాకుండా ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. ఇందులోని 334 సిసి సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 29.3 బిహెచ్‌పి పవర్, 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 6 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. పనితీరు పరంగా దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.
యెజ్డీ రోడ్‌స్టర్ రౌండ్ హెడ్‌ల్యాంప్, డిజిటల్ స్పీడోమీటర్, హెడ్‌లైట్ గ్రిల్, USB టైప్-సి ఛార్జింగ్ సాకెట్, సింగిల్-పీస్ సీట్ కలిగి సేడ్ లో కీ హోల్పొందుతుంది . ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు. సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి.
Red Hot… https://t.co/VPV2OKDyjX
— anand mahindra (@anandmahindra) February 15, 2023
Comments
Please login to add a commentAdd a comment