Megastar Chiranjeevi Extends Wishes On International Women's Day - Sakshi
Sakshi News home page

Chiranjeevi: భవిష్యత్ తరాలకు మీరే ఆదర్శం: మెగాస్టార్

Published Wed, Mar 8 2023 3:49 PM | Last Updated on Wed, Mar 8 2023 4:02 PM

Megastar Chiranjeevi Wishes International Womens Day - Sakshi

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని మహిళలందరికీ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భార్య సురేఖ, అమ్మ అంజనా దేవితో దిగిన ఫోటోను షేర్ చేశారు. 

ట్విటర్‌లో మెగాస్టార్ రాస్తూ..' ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో తమ సరైన  స్థానాన్ని పొందేందుకు పోరాడిన, పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలందరికీ వందనం. భవిష్యత్ తరాలకు మీరే ఆదర్శం. నా జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు వీరిద్దరే.' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement