అన్నలు, అక్కాచెల్లెళ్లతో డాక్టర్ జయసుధ..
నిజామాబాద్ : ‘చేసేది చిన్న ఉద్యోగమైనా ఆ తండ్రి తీసుకున్న నిర్ణయాలు నేడు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఎవరి కాళ్ల మీద వాళ్లు నిల బడాలనే తపనకు తోడు చదువులో పిల్లలు రాణించడంతో ప్రభుత్వఉద్యోగాలకు ఆ ఇల్లు నిలయమైంది. ఇద్దరు కుమారులు సహా నలుగురు కుమార్తెల్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారంటే అందులో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతుందో.. పురు ష, స్త్రీ తేడా లేకుండా అందరినీ సమానంగా చదివించడంలో వారి కృషి, కష్టం అంతకు రెట్టింపు ఉంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆ తల్లిదండ్రుల కోరిక నెరవేర్చిన కుమార్తెల్లో ఒకరై న జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధ విజ యగాథ మహిళా దినోత్సవం సందర్భంగా కథనం.
కుటుంబ నేపథ్యం..
కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన రాజారాం, సరోజలకు ఇద్దరు కుమారులు డాక్టర్ శ్రీనివాస్ ప్ర సాద్ (బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్) శ్రీధర్(ఉపాధ్యాయుడు), నలుగురు కుమార్తెలు విజయలక్ష్మి(గృహిణి), డాక్టర్ లత (ప్రొఫెసర్), డాక్టర్ జయసుధ(డీపీఓ), ప్రవీణ (ఉపాధ్యా యురాలు). రాజారాం పోస్ట్‌మాస్టర్ ఉద్యోగం చేసు కుంటూ కుమారులు, కుమార్తెలు అన్న తేడా లేకుండా ఉన్నత చదువులు చదివించా రు. చదువులో వా రి సహకారం, ప్రోత్సాహంతోనే ప్రస్తుతం అందరూ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. మీ కాళ్ల మీద మీరే ని లబడాలని తరచూ గుర్తుచేస్తూనే పిల్లల లక్ష్యాల లో ఆ తండ్రి పాలుపంచుకున్నారు. 2010లో బిచ్కుంద కు చెందిన నాగనాథ్‌తో జయసుధ వివాహమైంది.
ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతూ..
రాజారాం, సరోజ దంపతుల ఐదో సంతానమైన డాక్టర్ జయసుధ చిన్ననాటి నుంచి చదువులో రాణించేవారు. ఐదోతరగతి వరకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో, నవోదయ విద్యాలయంలో 6 నుంచి ఇంటరీ్మడియట్ వరకు చదివారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువును కొనసాగించారు. చిన్నప్పటి నుంచే వసతిగృహాల్లో ఉంటూ ఉన్నత చదువులు పూర్తిచేశారు. మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైస్సెస్ పూర్తి చేసిన జయసుధ పదేళ్లపాటు హైదరాబాద్‌లోని వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేశారు.
మొదటి ప్రయత్నంతోనే గ్రూప్–1లో విజయం
వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగం చే స్తున్నా.. ఎక్కడో ఏదో ఒక వెలితి. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో గ్రూ ప్స్‌కు సిద్ధమయ్యారు. అదేక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా కూడా ఉద్యోగం సాధించారు. 2015లో సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. మొదటి ప్రయత్నంలోనే 2017 లో గ్రూప్–1 సాధించారు. ఏడాది శిక్షణ తర్వా త జిల్లా పంచాయతీ అధికారిగా మొదటి పోస్టింగ్ నిజామాబాద్‌లోనే నియమితులయ్యారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వచ్ఛభారత్ మిషన్‌లో జాతీయస్థాయిలో మొదటిస్థానంలో జిల్లా కు అవార్డు దక్కింది. అలాగే సంసద్ ఆదర్శ గ్రా మ్ యోజనలో మొదటి 20 గ్రామాల్లో జిల్లా నుంచే 5 ఉత్తమ పంచాయతీలుగా ఎంపికై అవార్డులు పొందడం సంతోషానిచ్చింది. ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగు లు, సిబ్బంది సహకారంతో డీపీవోగా నాలుగేళ్లు ఎంతో సంతృప్తినిచ్చిందని జయసుధ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment