District Panchayat officer
-
స్ఫూర్తి గాథ: తండ్రి తపనను అర్థం చేసుకుని గెలిచిన బిడ్డలు
నిజామాబాద్ : ‘చేసేది చిన్న ఉద్యోగమైనా ఆ తండ్రి తీసుకున్న నిర్ణయాలు నేడు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఎవరి కాళ్ల మీద వాళ్లు నిల బడాలనే తపనకు తోడు చదువులో పిల్లలు రాణించడంతో ప్రభుత్వఉద్యోగాలకు ఆ ఇల్లు నిలయమైంది. ఇద్దరు కుమారులు సహా నలుగురు కుమార్తెల్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారంటే అందులో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతుందో.. పురు ష, స్త్రీ తేడా లేకుండా అందరినీ సమానంగా చదివించడంలో వారి కృషి, కష్టం అంతకు రెట్టింపు ఉంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆ తల్లిదండ్రుల కోరిక నెరవేర్చిన కుమార్తెల్లో ఒకరై న జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధ విజ యగాథ మహిళా దినోత్సవం సందర్భంగా కథనం. కుటుంబ నేపథ్యం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన రాజారాం, సరోజలకు ఇద్దరు కుమారులు డాక్టర్ శ్రీనివాస్ ప్ర సాద్ (బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్) శ్రీధర్(ఉపాధ్యాయుడు), నలుగురు కుమార్తెలు విజయలక్ష్మి(గృహిణి), డాక్టర్ లత (ప్రొఫెసర్), డాక్టర్ జయసుధ(డీపీఓ), ప్రవీణ (ఉపాధ్యా యురాలు). రాజారాం పోస్ట్‌మాస్టర్ ఉద్యోగం చేసు కుంటూ కుమారులు, కుమార్తెలు అన్న తేడా లేకుండా ఉన్నత చదువులు చదివించా రు. చదువులో వా రి సహకారం, ప్రోత్సాహంతోనే ప్రస్తుతం అందరూ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. మీ కాళ్ల మీద మీరే ని లబడాలని తరచూ గుర్తుచేస్తూనే పిల్లల లక్ష్యాల లో ఆ తండ్రి పాలుపంచుకున్నారు. 2010లో బిచ్కుంద కు చెందిన నాగనాథ్‌తో జయసుధ వివాహమైంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతూ.. రాజారాం, సరోజ దంపతుల ఐదో సంతానమైన డాక్టర్ జయసుధ చిన్ననాటి నుంచి చదువులో రాణించేవారు. ఐదోతరగతి వరకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో, నవోదయ విద్యాలయంలో 6 నుంచి ఇంటరీ్మడియట్ వరకు చదివారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువును కొనసాగించారు. చిన్నప్పటి నుంచే వసతిగృహాల్లో ఉంటూ ఉన్నత చదువులు పూర్తిచేశారు. మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైస్సెస్ పూర్తి చేసిన జయసుధ పదేళ్లపాటు హైదరాబాద్‌లోని వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేశారు. మొదటి ప్రయత్నంతోనే గ్రూప్–1లో విజయం వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం చే స్తున్నా.. ఎక్కడో ఏదో ఒక వెలితి. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో గ్రూ ప్స్‌కు సిద్ధమయ్యారు. అదేక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా కూడా ఉద్యోగం సాధించారు. 2015లో సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. మొదటి ప్రయత్నంలోనే 2017 లో గ్రూప్–1 సాధించారు. ఏడాది శిక్షణ తర్వా త జిల్లా పంచాయతీ అధికారిగా మొదటి పోస్టింగ్ నిజామాబాద్‌లోనే నియమితులయ్యారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వచ్ఛభారత్ మిషన్‌లో జాతీయస్థాయిలో మొదటిస్థానంలో జిల్లా కు అవార్డు దక్కింది. అలాగే సంసద్ ఆదర్శ గ్రా మ్ యోజనలో మొదటి 20 గ్రామాల్లో జిల్లా నుంచే 5 ఉత్తమ పంచాయతీలుగా ఎంపికై అవార్డులు పొందడం సంతోషానిచ్చింది. ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగు లు, సిబ్బంది సహకారంతో డీపీవోగా నాలుగేళ్లు ఎంతో సంతృప్తినిచ్చిందని జయసుధ పేర్కొన్నారు. -
శ్రీకాకుళం: ఓటర్ లిస్ట్‌లో మీ పేరుందా?
నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు check your vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. మీ ఓటుకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఈ మొబైల్ నంబరుకు సంప్రదించవచ్చు జిల్లా కలెక్టరేట్లోని ఎలక్షన్ కంట్రోల్ రూం 8186923639 -
ఇంటిపన్ను సవరణ కు ప్రత్యేక కార్యాచరణ
డీపీవో అల్లూరి నాగరాజువర్మ పెంటపాడు : భూమి విలువ ఆధారంగా ఇంటిపన్ను సవరణను జూలై ఒకటో తేదీ నుంచి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజువర్మ చెప్పారు. అపరిష్కృతంగా ఉన్న కబేళా సమస్య పరిష్కారంలో భాగంగా పెంటపాడు వచ్చిన ఆయన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిర్మాణపు విలువ, స్కేర్‌ఫీట్ (ఎస్ఎఫ్టి) ప్రకారం పన్నును లెక్కిస్తామన్నారు. భూముల మార్కెట్ విలువ విపరీతంగా పెరగడం వల్ల పన్ను పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువకు అనుగుణంగానే పన్ను ఉంటుందన్నారు. జిల్లాలోని 880 పంచాయతీలకు ఎస్ఎఫ్సీ తదితర పథకాల కింద రూ.41 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. పంచాయతీ భవన నిర్మాణాలకు త్వరలో మోక్షం జిల్లాలో శిథిలావస్థలో ఉన్న 97 పంచాయతీ భవనాల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని డీపీవో తెలిపారు. ఐదు వేలు జనాభా దాటిన పంచాయతీలకు రూ.13.5 లక్షలు, ఐదు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.12 లక్షల నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. డంపింగ్ యార్డులు లేని గ్రామాల్లో స్థలసేకరణ చేయాలని రెవిన్యూ శాఖను కోరామన్నారు. జిల్లాలో 120 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ ఏడాది 25 ఖాళీలు భర్తీ చేశామన్నారు. జిల్లాలో అనధికార లే అవుట్లపై నిఘా పెట్టామన్నారు. నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం వచ్చే వేసవి నుంచి సరికొత్త ప్రణాళిక రూపొందించనున్నట్లు నాగరాజువర్మ వెల్లడించారు. గ్రామాల్లో ఉన్న చెరువుల పరిమాణాలు పెంచడం, ఇతర చెరువులను తాగునీటికోసం వినియోగించడం, తదితర చర్యల వల్ల తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నామన్నారు. దీనివల్ల వేసవిలోనే కాక అన్ని కాలాలలో నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉందన్నారు. ట్యాంకర్ల ద్వారా నీరందించే పాతకాల పద్ధతికి స్వస్తి పలుకుతామన్నారు. ఎంపీడీవో జీవీకే మల్లికార్జునరావు, ఈవోపీఆర్డీ ఆర్.లక్ష్మికాంతం, కార్యదర్శులు పి.వెంకటేశ్వరరావు, షేక్ షంషుద్ధీన్ పాల్గొన్నారు. -
జిల్లాలో ఓటర్లు 22 లక్షల మంది
మండలాలవారిగా జాబితా విడుదల మహిళలే ఎక్కువ చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకరరావు తెలిపారు.గురువారం ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల జాబితాను మండలాలవారిగా విడుదల చేశారు. ఇందులో మొత్తం ఓటర్లు 22,02,621 మంది ఉన్నారు. వీరిలో 11,12,767 మంది మహిళా ఓటర్లు, 10,89,840 మంది పురుషులు ఉన్నారు. 14 మంది హిజ్రాలు ఉన్నారు. -
కర్నూలు శివారులో కొత్త మార్కెట్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.20 కోట్లు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారిణి ఎం. శోభా స్వరూపరాణి తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లాపరిషత్ సమావేశ భవనంలో జిల్లాలోని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.15,08,10,200, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రూ.4,96,18,200 విడుదలైనట్లు చెప్పారు. ఈ నిధులను 2011 జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తామన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులను ఆయా గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుద్ధ్య పనులకు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. ఎస్ఎఫ్సీ నిధులను ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గ్రామీణ పాలనపై అవగాహన కల్పించేందుకు సర్పంచుల పరిచయ వేదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీన నంద్యాల డివిజన్లోని సర్పంచులకు, 29న కర్నూలు, 30న ఆదోని డివిజన్లలోని సర్పంచులకు పరిచయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో డిమాండ్ మేరకు పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర వాటిపై పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్డీలు దృష్టి సారించాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని లే అవుట్లపై సమగ్ర సమాచారాన్ని పంపాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి పీడబ్ల్యుఎస్ పథకాల్లో క్లోరినేషన్ చాలా ముఖ్యమన్నారు. గ్రామ పంచాయతీల్లో రికార్డులను జాగ్రత్తగా నిర్వహించి ప్రతి నెలా నివేదికలు అందించాలన్నారు.