భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో చాలా వాహన తయారీ సంస్థలు కొత్త కార్లను & బైకులను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కియా కారెన్స్ ఎక్స్-లైన్
దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా కంపెనీకి చెందిన కారెన్స్ ఇప్పుడు ఎక్స్-లైన్ రూపంలో విడుదలైంది. ఈ కొత్త కారు ధరలు రూ. 18.94 లక్షల నుంచి రూ. 19.44 వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్
తాజాగా ఇండియన్ మార్కెట్లో అడుగెట్టిన నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ధరలు ఈ రోజు అధికారికంగా వెలువడ్డాయి. దీని ధర రూ. 8.27 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది పెట్రోల్ ఎమ్‌టీ, టర్బో పెట్రోల్ ఎమ్‌టీ, టర్బో-పెట్రోల్ సీవీటీ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జిటి ప్లస్ మ్యాట్
వర్టస్ వెర్షన్ ఇటీవల జిటి ప్లస్ మ్యాట్ ఎడిషన్ రూపంలో విడుదలైంది. దీని ధరలు రూ. 17.62 లక్షల నుంచి రూ. 19.29 లక్షల వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ కేవలం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో మాన్యువల్ అండ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇదీ చదవండి: ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి
లాంబోర్గినీ రెవెల్టో
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ విఫణిలో 'రెవెల్టో' అనే కొత్త కారుని విడుదల చేసింది. దీని ధర రూ. 8.9 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & 3.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇందులోని 6.5 లీటర్ వి12 ఇంజిన్ 825 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment