న్యూఢిల్లీ: అతి తక్కువ ధరలతో ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్‌కు అందించాలని భావిస్తున్నట్లు దక్షిణ కొరియా సంస్థ కియా మోటార్స్ ప్రకటించింది. ఇందుకోసం హ్యుందాయ్ మోటార్స్‌తో కలిసి ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై సంస్థ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాన్–వూ పార్క్ మాట్లాడుతూ.. ‘తక్కువ ధరతో ఎలక్ట్రిక్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టాలనే అంశంపై దృష్టిసారించాం. భాతర ప్రభుత్వ మద్దతు విధానం, మౌలిక సదుపాయాల అంశాల ఆధారంగా తుది నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని అన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఈ సంస్థ ఇప్పటికే హైబ్రిడ్, ప్లగ్–ఇన్–హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్, ఫ్యూయల్ సెల్ వాహనాలను విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment