hundai global suv
-
న్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనె.. ఏ కంపెనీకంటే..
ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను తమ కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. షారుక్ ఖాన్ తర్వాత దీపికా పదుకొనెను రెండో బ్రాండ్ అంబాసిడర్‌గా హ్యుందాయ్ ఇండియా నియమించుకున్నట్లు తెలిపింది. షారుక్ ఖాన్ స్థానంలో దీపికా పడుకొనె తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతుందా లేక ఇద్దరూ కలిసి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తారా అనే విషయంలో కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసాధారణ నైపుణ్యం, నటనా సామర్థ్యం కలిగిన గ్లోబల్ ఇండియన్ ఐకాన్ దీపికా పడుకొనెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు ఆమె తిరుగులేని ఆకర్షణ శక్తి, అద్భుతమైన కెరియర్ హ్యుందాయ్ మోటార్ ఇండియాకు ఉపయోగపడుతుందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి 2021 నాటికి భారతదేశంలో 17% మార్కెట్ వాటాను కలిగి ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని అనుబంధ సంస్థ కియాతో కలిసి 2022లో భారతదేశంలో 10 లక్షల కార్లను తయారుచేసింది. ఈ రెండు కంపెనీలు కలిసి ప్రస్తుతం దేశంలో దాదాపు 23% వాటాను కలిగి ఉన్నాయి. -
‘కియా’ చౌకధర ఎలక్ట్రిక్ వాహనాలు..!
న్యూఢిల్లీ: అతి తక్కువ ధరలతో ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్‌కు అందించాలని భావిస్తున్నట్లు దక్షిణ కొరియా సంస్థ కియా మోటార్స్ ప్రకటించింది. ఇందుకోసం హ్యుందాయ్ మోటార్స్‌తో కలిసి ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై సంస్థ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాన్–వూ పార్క్ మాట్లాడుతూ.. ‘తక్కువ ధరతో ఎలక్ట్రిక్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టాలనే అంశంపై దృష్టిసారించాం. భాతర ప్రభుత్వ మద్దతు విధానం, మౌలిక సదుపాయాల అంశాల ఆధారంగా తుది నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని అన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఈ సంస్థ ఇప్పటికే హైబ్రిడ్, ప్లగ్–ఇన్–హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్, ఫ్యూయల్ సెల్ వాహనాలను విక్రయిస్తోంది. -
మార్కెట్లోకి హ్యుందాయ్ గ్లోబల్ ఎస్యూవీ
హిమాయత్‌నగర్: హ్యుందాయ్ కొత్తగా ప్రవేశపెట్టిన గ్లోబల్–ఎస్యూవీ కారును సంస్థ సౌత్ రీజనల్ సేల్స్ మేనేజర్ ఎంఏ సలీమ్ అమీన్ గురువారం హిమాయత్‌నగర్‌లోని లక్ష్మీ హ్యుందాయ్ షోరూమ్‌లో మార్కెట్లోకి విడుదల చేశారు. సరికొత్త టుక్సాన్ డైనమిక్ లైనప్‌తో దీనిని ప్రవేశపెడుతున్నామన్నారు. అత్యాధునిక సాంకేతికత, ఉన్నత ప్రమాణాలతో నేటి తరం అభిరుచులకు అనుగుణంగా దీనిని రూపొందించామని సీఈఓ భాస్కరరాజు చెప్పారు. పెట్రోల్, డీజిల్ మోడల్స్‌లో ఈ కారు లభ్యమవుతుందన్నారు.