న్యూ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దీపికా ప‌దుకొనె.. ఏ కంపెనీకంటే.. | Hyundai Motor India New Brand Ambassador Deepika Padukone | Sakshi
Sakshi News home page

న్యూ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దీపికా ప‌దుకొనె.. ఏ కంపెనీకంటే..

Dec 29 2023 5:49 PM | Updated on Dec 29 2023 6:03 PM

Hyundai Motor India New Brand Ambassador Deepika Padukone - Sakshi

ప్రముఖ బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనెను త‌మ కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంచుకున్న‌ట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్ర‌క‌టించింది. షారుక్ ఖాన్ త‌ర్వాత దీపికా ప‌దుకొనెను రెండో బ్రాండ్‌ అంబాసిడర్‌గా హ్యుందాయ్ ఇండియా నియమించుకున్నట్లు తెలిపింది. 

షారుక్ ఖాన్ స్థానంలో దీపికా ప‌డుకొనె త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగుతుందా లేక ఇద్ద‌రూ క‌లిసి బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ప‌నిచేస్తారా అనే విష‌యంలో కంపెనీ ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అసాధార‌ణ నైపుణ్యం, న‌టనా సామ‌ర్థ్యం క‌లిగిన గ్లోబ‌ల్ ఇండియ‌న్ ఐకాన్ దీపికా ప‌డుకొనెను త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ త‌రుణ్ గార్గ్ వెల్ల‌డించారు.

ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్‌ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు

ఆమె తిరుగులేని ఆక‌ర్ష‌ణ శ‌క్తి, అద్భుత‌మైన కెరియర్‌ హ్యుందాయ్ మోటార్ ఇండియాకు ఉపయోగపడుతుందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి 2021 నాటికి భారతదేశంలో 17% మార్కెట్ వాటాను కలిగి ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని అనుబంధ సంస్థ కియాతో కలిసి 2022లో భారతదేశంలో 10 లక్షల కార్లను తయారుచేసింది. ఈ రెండు కంపెనీలు కలిసి ప్రస్తుతం దేశంలో దాదాపు 23% వాటాను కలిగి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement